Monday, June 29, 2009

ఒక రాధిక మానస చోరా
ఒక మీరా హృదయ విహారా
రావేరా ప్రణయ కిషోరా
నన్నేలా ధీరసమీరా
1. ఇసుక తిన్నెలేలా పరచితి నాఎద
పిల్లగాలులేలా వీచితి పయ్యెద
యమునాతటియేల నే మందాకినే కాద
ఆరాధ నీకేల అనురాగ సుధగ్రోల
2. వేణువు నీకేల గొను అధరామృతాల
నర్తన నీకేల కను నానయనహేల
కీర్తన నీకేల విను నా ప్రార్థన గోల
ఆ మీర నీకేల నీ చరణాల నేవ్రాల

3 comments:

Anonymous said...

daily postings
1)bhakti geettalu-ganesha/sai/ayyappa/and others
2)PREMA/LOVE/POSITIVE
3)VISHAADA/VIRAHA/SARROW
PL RESPOND AND COMMENT ON MY SONGS
THANQ
RAKI

Padmarpita said...

Nice.....

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

మీకు నా ధన్యవాదాలు!
మీ ప్రతిస్పందనలు నాకు ఎంతో మోదాలు,ఆమోదాలు !!
నను ముందుకు నడిపించడంలో ఉత్తేజపరిచే నినాదాలు!!!
సదా మీ స్నేహాభిలాషి
రాఖీ