Thursday, July 9, 2009


నా ఎదనే పగిలిన శిల్పం
నే బ్రతికీ ఏమిలాభం
నా మనసే తెగిన పతంగం
ఇక భవితే నాకు శూన్యం

1. చీకటిలో నీ దారి కొరకు
వెలిగించా నాదు హృదయం
నువు గమ్యం చేరు వరకు
అర్పించా నీకు సకలం
నువు లేక వృధా ఈ లోకం
ఇక ఎన్నున్నా ఏమి లాభం

2. అందరాని చందమామా
కనులముందు ఉంటె నరకం
పొందలేని అందమంతా
కెలుకుతోంది గుండె శోకం
చేజారె సదవకాశం
ఇక వగచీ ఏమి లాభం

2 comments:

Padmarpita said...

బాగు..బాగు!

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

మీకు నా కృతజ్ఞతలు!మీ అభిప్రాయాలను మరింత వివరంగా విశ్లేషణాత్మకంగా తెలుపగలరని నా అభిలాష,నా మరో "నానీ"ల బ్లాగు కూడ సందర్శించి స్పందించండిwww.rakigita9-4u.blogspot.com
సదా మీ స్నేహాభిలాషి
రాఖీ