Saturday, July 4, 2009

పలుకు బంగారమాయె 
తలపు సింగారమాయె 
మనసు మందారమాయె 
రేయి జాగారమాయే 

1. చెలియ చెక్కిలి ఒక రోజా 
చెలియ నయనం నీరజా 
చెలియ పెదవుల హరివిల్లు 
చెలియ నవ్వుల ముత్యాలజల్లు

 2. చెలియ స్థానం బృందావనం
 చెలియ గానం మురళీరవం
 చెలియ ధ్యానం మృదు భావనం
 చెలియ లేనిది శవ జీవనం

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగుందండి.

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

విజయ మోహన్ గారిక నమస్సులు మీ బ్లాగు చూడ చక్కగా ఉంది మీ కృష్ణప్రయత్వం నన్నెంతో మురిపించింది. నేను వ్రాసిన గీతాల్లో కొన్ని మీ కృష్ణయ్యవే!నా మొదటి పోస్టింగ్ నుండి వెదకండి.చదివి సవివరంగా వ్రాయండి
సదా మీ స్నేహాభిలాషి
రాఖీ
rakigita9@gmail.com
rakigita9@yahoo.com లో కూడ కలవ వచ్చు