Tuesday, July 21, 2009

హరిహర నందన అయ్యప్పా-
అఖిలాండేశ్వర అయ్యప్పా 
అమరేంద్రనుత అయ్యప్పా-
శబరీనివాస శరణంఅయ్యప్పా 

1. పంచభూతాత్మ హే అయ్యప్పా 
పంచామృత ప్రియ అయ్యప్పా 
పంచేంద్రియ జయ అయ్యప్పా 
పంచగిరీశస్వామి పాహి అయ్యప్పా 

2. అరిషడ్వర్గ వినాశక అయ్యప్పా 
షడ్రస పోషక శరణం అయ్యప్పా 
ఆరుఋతువుల్లొ ఆప్తుడవయ్యప్పా 
షణ్ముఖ సోదర శరణం అయ్యప్పా

 3. అష్టాదశాధ్యాయ గీతాత్మ అయ్యప్పా
 అష్టకష్ట నివారణ అయ్యప్ప 
అష్టాదశ సోపానధీశ అయ్యప్ప 
అష్టదరిద్ర వినాశ అయ్యప్ప

No comments: