Sunday, July 12, 2009

నిన్నే నిన్నే వేడుకొందు శరణమయ్యప్పా-స్వామి శరణమయ్యప్పా శబరిగిరిని చేరుకొందు కావు మయ్యప్పా-నను కావుమయ్యప్పా

 1. కన్నూ మిన్నూ కానకుంటి- శరణమయ్యప్పా పాపపుణ్యమెంచకుంటి-కావుమయ్యప్పా 
మధు మాంసం వీడకుంటి శరణమయ్యప్పా 
నన్ను కడతేర్చే భారమింక నీదే అయ్యప్పా 

2. ధనదాహం మరువనైతి- శరణమయ్యప్పా 
వ్యామోహం విడువనైతి కావుమయ్యప్పా 
మదినీపై నిలుపనైతి శరణమయ్యప్పా
 కలుషితమెడ బాపి నన్ను కావుమయ్యప్పా 

3. కామానికి దాసుణ్నైతి శరణమయ్యప్పా 
వ్యసనానికి బానిసైతి కావుమయ్యప్పా 
అన్యధా శరణం నాస్తి శరణమయ్యప్పా 
వ్రతదీక్ష పరిసమాప్తి జేయుమయ్యప్పా

No comments: