Saturday, September 5, 2009

సాగరం కాదది నా కన్నీటి కాసారం
వర్షం కాదది నా అశ్రుభాష్ప తర్పణం
నయనజలం ఇంకిపోతె కారింది రుధిరం
కఱకు శిలలు కరిగినా ద్రవించలేదు నీ హృదయం
ఓ చెలీ వజ్రమే సృష్టిలోన అతి కఠినం
బ్రహ్మకే ఆశ్చర్యం! నీ ఎద కఠినాతి కఠినం
1. నీ గుండెను చెక్కబోతె ఉలులే విరిగాయి
నీ మదినే మలచబోతె నా చేతులు తెగాయి
నీ ఎడద ఛేదించగా బాంబులే బెదిరాయి
నీ హృదయం గెలుపుకై ఫిరంగులే జడిసాయి
ఓ చెలీ వజ్రమే సృష్టిలోన అతి కఠినం
బ్రహ్మకే ఆశ్చర్యం! నీ ఎద కఠినాతి కఠినం
2. నీ మనసును కరిగించబోతె అగ్నిశిఖలు వెఱిచాయి
నీ యోచన మరలించబోతె నవనాడులు కృంగాయి
నీ దృక్పథమును మార్చబోతె తలనరాలు చిట్లాయి
నీ ప్రేమ చూరగొనబోతే ప్రాణాలేపోతున్నాయి
ఓ చెలీ వజ్రమే సృష్టిలోన అతి కఠినం
బ్రహ్మకే ఆశ్చర్యం! నీ ఎద కఠినాతి కఠినం

2 comments:

Unknown said...

"నీ గుండెను చెక్కబోతె ఉలులే విరిగాయి
నీ మదినే మలచబోతె నా చేతులు తెగాయి"

ఈ మీ ప్రేమాశ్రువు కి ఆ గుండె నవనీతం అవుతుంది లెండి.

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

స్నేహితుడా ! స్నేహితుడా రహస్య స్నేహితుడా!! వందనాలివే అందుకో నా హితుడా!! నీ ఊరట మాటలే నాకు నవనీతాలు!! ఈ దాహార్తి కివే జలపాతాలు!!
సదా
నీ స్నేహాభిలాషి
రాఖీ