Friday, July 3, 2009

నను లాలించగ రావే ఓ నిద్దుర తల్లీ
నను ఓదార్చగ రావే ఓ ముద్దుల చెల్లీ
1. జీవితాన నేనెంతో అలసిసొలసి నిలిచితిని
పదేపదే పరుగిడి నే పలుమార్లు విసిగితిని
సహనమనేది నాలో సమూలంగ చచ్చినది
కరుణించి నీ ఒడిలో సేదదీర్చుకోనీవే
2. తపము చేసి నీకై నే కోరితి ఈ చిరువరం
నా వంటి వారంటే నీకెందుకు ఈ వైరం
శయనించవె కనుపాపల తల్పముపైన
ఎక్కించవె నన్నొకపరి కలల పల్లకీ మీద
3. లయకారుడి సిరిమువ్వవి నీవే కాదా
యమరాజుకు ప్రియసఖివి నీవే కాదా
మృత్యుదూతనెచ్చెలీ-మరణ ఢమరుకధ్వనీ
శాశ్వతముగ నాచెంతకు ఇకనైనా రారాదా
దర్పణమై నీ అందాలే కొలిచా
దరహాసమునై-నీ పెదవులపై నిలిచా
ఆతృతగా నా ఎదవాకిలి తెఱిచా
అర్పణగా నా బ్రతుకే నీకై పరిచా
1. రాతిరినై నీ కురులలోన కలిసా
ఉదయమునై నీ వదనముపై వెలిసా
రంగుల హరివిల్లును నేనై
తనువంతా ప్రభవింపజేసా-పరవశింపజేసా
2. మరుమల్లికనై నీ జడలో మెరిసా
మందారమునై నీ చెక్కిలిపై విరిసా
సుగంధాల ప్రబంధ నాయికగా
నిన్నే పరిమళింపజేసా-ప్రస్తుతింపజేసా
3. అనురాగమునేనై మనసారా వలచా
ఆనందమునై నను నేనే మరిచా
తగనివాడనని తప్పుకొంటివని
తలచితలచి నే వగచా-జీవశ్చవమై నిలిచా
శరణం అయ్యప్ప-శరణం అయ్యప్ప
శరణాగత త్రాణ -శరణం అయ్యప్ప
శ్రీ శబరి గిరివాస- శరణం అయ్యప్ప
1. ఓంకార రూపా- శరణం అయ్యప్ప
బ్రహ్మాండనాయక- శరణం అయ్యప్ప
మోహినిపుత్రా- శరణం అయ్యప్ప
జగదేక మోహన- శరణం అయ్యప్ప
2. హరిహర నందన- శరణం అయ్యప్ప
ఆపద్భాందవ- శరణం అయ్యప్ప
భవబంధమోచక- శరణం అయ్యప్ప
మోక్షప్రదాయక- శరణం అయ్యప్ప
3. విష్ణుకుమారా- శరణం అయ్యప్ప
శంకరాత్మజా- శరణం అయ్యప్ప
పార్వతిపుత్రా- శరణం అయ్యప్ప
పరమ పవిత్రా- శరణం అయ్యప్ప
4. గణపతి అనుజా- శరణం అయ్యప్ప
షణ్ముఖ సోదర- శరణం అయ్యప్ప
కైలాసవాసా- శరణం అయ్యప్ప
కైవల్యదాయక- శరణం అయ్యప్ప
5. దత్తావతారా- శరణం అయ్యప్ప
సాయిస్వరూపా- శరణం అయ్యప్ప
సద్గురునాథా- శరణం అయ్యప్ప
సద్గుణ మూర్తీ- శరణం అయ్యప్ప
6. పందళరాజా- శరణం అయ్యప్ప
పాండు కుమారా- శరణం అయ్యప్ప
విల్లాలివీరా- శరణం అయ్యప్ప
వీరమణికంఠా- శరణం అయ్యప్ప

7. గురువేదన తీర్చావు- శరణం అయ్యప్ప
గురుదక్షిణ ఇచ్చావు- శరణం అయ్యప్ప
పులిపాలు తెచ్చావు- శరణం అయ్యప్ప
తల్లికోర్కె తీర్చావు- శరణం అయ్యప్ప
8. దీక్షాభీష్టుడా- శరణం అయ్యప్ప
మాలధారణాతుష్టుడ- శరణం అయ్యప్ప
కన్నెస్వామి ఇష్టుడ- శరణం అయ్యప్ప
మండలనిష్ఠుడా- శరణం అయ్యప్ప
9. ఇరుముడి ప్రియుడా- శరణం అయ్యప్ప
ఎరుమేలివాసుడ- శరణం అయ్యప్ప
పేటతుళ్ళి నృత్యుడా- శరణం అయ్యప్ప
వావరు మిత్రుడా- శరణం అయ్యప్ప
10. అళుదా స్నాతుడా- శరణం అయ్యప్ప
అళుదామేడవాస- శరణం అయ్యప్ప
మహిషీ మర్ధన- శరణం అయ్యప్ప
మదగజ వాహన- శరణం అయ్యప్ప
11. కరిమల నిలయ- శరణం అయ్యప్ప
పంపావాసా- శరణం అయ్యప్ప
నీలిమల నిలయ- శరణం అయ్యప్ప
అప్పాచిమేడువాస- శరణం అయ్యప్ప
12. శబరిపీఠవాస- శరణం అయ్యప్ప
శరంగుత్తి ప్రియుడా- శరణం అయ్యప్ప
శబరీమలనిలయ- శరణం అయ్యప్ప
పదునెట్టాంబడియె- శరణం అయ్యప్ప
13. స్వామిసన్నిధానమే- శరణం అయ్యప్ప
స్వామిసాక్షాత్కారమె- శరణం అయ్యప్ప
స్వామిదివ్యరూపమె- శరణం అయ్యప్ప
స్వాముదరహాసమె- శరణం అయ్యప్ప
14. శ్రీ ధర్మశాస్తా- శరణం అయ్యప్ప
హే భూతనాథా- శరణం అయ్యప్ప
మణికంఠస్వామి- శరణం అయ్యప్ప
తారకప్రభువే- శరణం అయ్యప్ప
15. భస్మకుళమే- శరణం అయ్యప్ప
నెయ్యాభిషేకమె- శరణం అయ్యప్ప
కర్పూరజ్యోతియె- శరణం అయ్యప్ప
మాలికాపురోత్తమ- శరణం అయ్యప్ప
16. తిరువాభరణాలే- శరణం అయ్యప్ప
ఉత్తరా నక్షత్రం- శరణం అయ్యప్ప
కాంతిమలవాసా- శరణం అయ్యప్ప
జ్యోతిస్వరూపా- శరణం అయ్యప్ప
17. అన్నదానప్రభువే- శరణం అయ్యప్ప
కన్నవారి ప్రియనే- శరణం అయ్యప్ప
దీనజన్ రక్షకనే- శరణం అయ్యప్ప
పరమ దయాళా- శరణం అయ్యప్ప
18. నీలివస్త్రధారియే- శరణం అయ్యప్ప
నిత్యబ్రహ్మచారియే- శరణం అయ్యప్ప
శరణుఘోష ప్రియనే- శరణం అయ్యప్ప
సచ్చిదానందమూర్తియె- శరణం అయ్యప్ప
సాయి రామయ్యా నీవే నా గతివయ్య
మౌనం ఏలయ్య-మార్గంచూపవయ్య
1. మందువునీవే మాకువు నీవే
వ్యాధులు మాన్పే ఔషధమీవే
మంత్రము నీవే తంత్రము నీవే
పీడల బాపే యంత్రము నీవే
వైద్యడవీవే-సిద్ధుడవీవే
సరగున బ్రోచే సద్గురువీవే
2. అన్నము నీవే-పానము నీవే
మాలో వెలిగే ప్రాణము నీవే
గానము నీవే ధ్యానము నీవే
శాంతినొసగు సన్ని ధానము నీవె
భాగ్యము నీవే భోగము నీవే
కడకు మిగిలే వైరాగ్యము నీవే
దండాలయా శతకోటి దండాలయా
లంబోదరా నీ దయ ఉండాలయా
1. కష్టమొచ్చినా నిన్ను మ్రొక్కలేదా
కలిమి వచ్చినా నీవె దిక్కుకాదా
ఎన్నడూనిన్ను మేమూ ఏకదంత మరువం
గిరిజాతనయా శ్రీ గణనాయక
ఆనందనిలయా సిద్ధివినాయక
2. పేరుపేరునా నిన్ను తలవ లేదా
ఏటేటనిన్ను మేము నిలిపేము కాదా
నవరాత్రులూనీభజనలూ-ఇలాచేసేము వెంకయ్యా
శ్రీ విఘ్నేశ్వర నమో నమో
పాప సంహార నమోనమో