Sunday, July 12, 2009

అపజయమే నాకు నేస్తం
అవమానమే నాకు ప్రాణం
విషాదమే నా ముద్దుపేరు
ఆవేదనే నా పుట్టినూరు
1. ఆపదలు నా ఆప్త మిత్రులు
దారిద్ర్యం నా దగ్గరి చుట్టం
కన్నీళ్ళతో గాని తీరదు నా దాహం
రుధిరంతో నాకుపశమనం
2. వంచనే నాకు జనమిచ్చే బహుమానం
మౌనమే నేను పంచె అభిమానం
జీవితం నాకడుగడుగున ఒకరణం
శాశ్వతం నాకగత్యం మరణం
ఈ ఉదయం గులాబి నీ కోసం విరిసింది
నీ జడలో మెరవాలని పరితపించి పోతోంది
1. తూరుపునా నీబుగ్గా ఎరుపెక్కిందెందుకో
నన్నుచూడగానే సిగ్గుముంచుకొచ్చిందో
తొంగి చూశావేమో నీ తిలకం కనిపైంచింది
గొంతువిప్పావేమో భూపాలం వినిపించింది
2. నా పైనా నీ ప్రేమా మంచుబిందువయ్యింది
కాలందొంగాటకు తామరాకుపై నిలిచింది
నీ కిరణమే మన ప్రేమకు మరణం
నీ కరుణయే నాకిక శరణం
నిన్నే నిన్నే వేడుకొందు శరణమయ్యప్పా-స్వామి శరణమయ్యప్పా
శబరిగిరిని చేరుకొందు కావు మయ్యప్పా-నను కావుమయ్యప్పా
1. కన్నూ మిన్నూ కానకుంటి- శరణమయ్యప్పా
పాపపుణ్యమెంచకుంటి-కావుమయ్యప్పా
మధు మాంసం వీడకుంటి శరణమయ్యప్పా
నన్ను కడతేర్చే భారమింక నీదే అయ్యప్పా
2. ధనదాహం మరువనైతి- శరణమయ్యప్పా
వ్యామోహం విడువనైతి కావుమయ్యప్పా
మదినీపై నిలుపనైతి శరణమయ్యప్పా
కలుషితమెడ బాపి నన్ను కావుమయ్యప్పా
3. కామానికి దాసుణ్నైతి శరణమయ్యప్పా
వ్య్సనానికి బానిసైతి కావుమయ్యప్పా
అన్యధా శరణం నాస్తి శరణమయ్యప్పా
వ్రతదీక్ష పరిసమాప్తి జేయుమయ్యప్పా
సాటి మనిషితో ప్రియ భాషణలే సాయీ స్తోత్రాలు
జీవకోటిపై ప్రేమాదరణలె బాబా సూత్రాలు
మానవత్వము స్నేహతత్వము ముక్తికి మార్గాలు
దయకురిపించే మంచి మనసులే భువిలో స్వర్గాలు
నిండాలీ ఈ బావనలే ఎదఎద నిండా
ఉండాలీ బాబా దీవెన బ్రతుకులు పండ
షిర్డీశునీ దివ్య చరణాలే శరణమంటా
1. స్వార్థం ఎంతనర్థం-పతనమగునీ జీవితం
అర్థం ఎంత వ్యర్థం-కాదు నీకు శాశ్వతం
ద్వేషం పెంచుకోకు-పెంచుకోకు పంతము
మోసం చేసుకోకు –నిన్ను నీవే నేస్తము
వెలిగించుకో ప్రేమ దీపాలు నీ ముంగిట
చిత్రించుకో సాయి రూపాలు నీ గుండెన
2. మోహం వింత దాహం-తీరి పోదు ఎప్పుడు
రాగం దీర్ఘ రోగం- మానిపోదు ఎన్నడు
కామం బ్రతుకు క్షామం-చేసిపోయే గ్రీష్మము
కోపం నీకు శాపం-తెలుసుకో ఈ సూక్ష్మము
చే జార్చకు అతి విలువైందిలే కాలము
కడతేర్చులే సాయీ శరణంటె భవసాగరం
రామ భజనము సేయవే మనసా
శ్రీ రామ పాదమె శరణు నీ కెపుడు తెలుసా
1. శివ ధనస్సును చిటికెలో విరిచేసినా రఘురాముడు
తల్లిజానకి తనువులో సగమైన సీతా రాముడు
తండ్రిమాటను తలపునైన జవదాటనీ గుణధాముడు
ఇహములోనా సౌఖ్యమిచ్చే-పరములో సాయుజ్యమిచ్చే ||రామ భజనము||
2. త్యాగరాజుకు రాగమిచ్చిన సంగీతరాజ్య లోలుడు
రామదాసుకు యోగమిచ్చిన భద్రగిరి శ్రీ రాముడు
కొంగుసాచిన చింతదీర్చే ఆర్తజన పరిపాలుడు
అన్నకొద్దీ అఘము బాపే-విన్నకొద్దీ శుభములొసగే ||రామ భజనము||