Wednesday, October 13, 2010

https://youtu.be/qUdqszjxY9o?si=01ZsqFigKKIDTsCf


నీ చిరునవ్వు కోసమే-నే పరితపిస్తున్నా
కడగంటి నీ చూపుకె నే కలవరిస్తున్నా
ఎవరెవరికొ నువ్విచ్చినంత-ప్రాధాన్యత కోరానా
ఇష్టపడే వారంటే-ఇంతి కింత నిరాదరణ నా

1. కడుపునిండ నువు తింటే-నా ఆకలి మటుమాయం
కళ్ళముందు కనబడితే-నా రుగ్మతలన్ని నయం
కాసింత స్పందిస్తేనే- ఉన్నమతి పోతుంది
రవ్వంత దయతలిస్తె-నా గుండె ఆగుతుంది

2. మనసార పలకరిస్తే-మాణిక్యాలెందుకు
క్షణమైన దృష్టి పెడితె-లక్షలు కోట్లెందుకు
నీ వద్దనుండి నేను- లాక్కున్న సొమ్మేంలేదు
నువ్వెంత దోచుకున్నా-కిమ్మని అననైన లేదు

3. నీచర్మం గీరుకపొయినా-నా ప్రాణం విలవిలా
నీకేచిన్న గాయమైనా-నాకు నరక ప్రాయంలా
నీ ప్రసన్నవదనమే- నా కిల బృందావనం
నువు చల్లగ వర్ధిల్లుటే- నా మనోభీష్టం

ఓం శ్రీ సరస్వత్యై నమః

ఓం శ్రీ సరస్వత్యై నమః

తవ చరణ శరణ్యమే సుఖజీవనము
శ్రీవాణీ నీ కారుణ్యమే ఘనసాగరము

1. మూలా నక్షత్ర అవతారిణి
వాంఛితార్థప్రదాయిని చింతామణి
సంగీతవాహిని అనిల సరస్వతి
విజ్ఞాన దాయిని జ్ఞాన సరస్వతి

2. నటగాయక వందిని ఘట సరస్వతి
వీణాపాణి వేదాగ్రణి హే కిణి సరస్వతి
అంతరంగ నియంత్రిణి అంతరిక్ష సరస్వతి
అరిషడ్వర్గ నిర్మూలిని మహా సరస్వతి