ధర్మపురి వాసిని దయామృత వర్షిణి::కరినగర వాసిని-కనక వర్షిణి
దయామృత వర్షిణీ-చిన్మయ రూపిణి
శ్రీ చక్ర సంచారిణి-శ్రీ దేవీ-శ్రీ పీఠ సంవర్ధిని
1. అష్టదరిద్రనివారిణి-అష్టైశ్వర్యప్రదాయిని
అష్టలక్ష్మీ అవతారిణి-అభీష్ట వరదాయిని
నమోస్తుతే డోలాసుర సంహారిణి
నమోస్తుతే కోల్హాపుర నారాయణి
2. మాయా మోహిని-చంచలగామిని
సౌభాగ్య సంరక్షిణి-మంగళకారిణి
నమోస్తుతే నారసింహప్రియే
నమోస్తుతే ధర్మపురి నిలయే
3. కడలిపుత్రి కమలనేత్రి సంక్షేమ సంధాత్రి
మార్దవ గాత్రి మాధవ మైత్రి సకల జన సవిత్రి
నమోస్తుతే కౌశిక వాహిని
నమోస్తుతే కరినగర వాసిని
Subscribe to:
Post Comments (Atom)




రాఖీ గారికి నమస్తే!....
ReplyDeleteచాలా బాగా రాసారు సర్....
కడలిపుత్రి కమలనేత్రి సంక్షేమ సంధాత్రి
మార్దవ గాత్రి మాధవ క్షేత్రి సకల జన సవిత్రి
చాలా బాగా నచ్చింది...
అభినందనలు...
ధన్యవాదాలు.
tnx satya !bahunaalla darshanam!!
ReplyDelete"క్షేత్రి " మైత్రి gaa chinna maarpu chesaanu gamaninchedi