Saturday, May 19, 2012


ఎ ద కో యి ల కో వె ల.
ఆమని అరుదెంచినా-మామిడి చిగురించినా
పాడవేల  కోయిలా-మూగవైతివే ఎలా?
ప్రేమగ నిను పిలిచినా-ఎంతగ కవ్వించినా
ఉలకవైతివే పికమా!అలక ఏల ప్రియతమా !!

1.  1.    గ్రీష్మ౦ భీష్మి౦చినా-వర్ష౦ వారించినా
శరత్తే చకోరాల-మత్తులోన మునిగినా
హేమంతం పంతంగా-ముఖం చాటేసినా
శిశిర౦ కలవరపడి -మాట దాటవేసినా
వాసంతం తనుసాంతం-నీకు సొంతమయ్యెగా
నీ గీతం అమృతమని-నీకు బానిసయ్యెగా

పాడవేల  కోయిలా- మూగవైతివే ఎలా?
ఉలకవైతివే.పికమా!అలక ఏల ప్రియతమ!!

2.   2.   గాలి కూడ కలుషితమై-ఊపిరాడకున్నదా
నిర్మలమగు నీరు లేక-దప్పి దీరకున్నదా
నిప్పులకొలిమిలాగా-ఎ౦డ బాధించెనా
ప్రశాంతతే కరువైన-ప్రకృతి వేధించెనా
తోడెవరూ లేరనుకొని-ముభావంగ ఉన్నావో
కోవెలలో దేవతగా-కొలిచే నను మరిచావో

పాడవేల  కోయిలా-మూగవైతివే ఎలా?
ఉలకవైతివే పికమా...!అలక ఏల ప్రియతమా..!!