Monday, September 22, 2014

భారత మాత – భాగ్య విధాత


భారత మాత భాగ్య విధాత


||రాఖీ||భారత మాత – భాగ్య విధాత

మముగన్న మా తల్లి –జన కల్పవల్లి
మా భరత మాత-సౌభాగ్యధాత
భారత మాతా –భాగ్య విధాతా

1. అసోం నుండి గుజరాత్ వరకు
  కాశ్మీరాదిగ కన్యాకుమారికీ
విలసిల్లు దేశమా నీకు మా వందనం
మా మాతృదేశమా పాదాభి వందనం

2. మహిమోన్నత హిమాలయాలు
పావన గంగా యమునా నదులు
అలరారు దేశమా నీకు మా వందనం
మా మాతృదేశమా పాదాభి వందనం

3. మూడు దిశలలో కడలి జలాలు
తనువున వనములు మైదానములు
రాజిల్లు దేశమా నీకు మా వందనం
మా మాతృదేశమా పాదాభి వందనం

4. ఉగ్గుపాలతో వీర గాధలు
చిన్న నాటనే జ్ఞాన బోధలు
నూరిపోసినా జననీ నీకు మా వందనం
మా మాతృదేశమా పాదాభి వందనం

5. భిన్నత్వం లో నిజ ఏకత్వం
జగమే మెచ్చే లౌకిక తత్వం
చారిత్రిక దేశమా నీకు మా వందనం
మా మాతృదేశమా పాదాభి వందనం

http://www.4shared.com/mp3/7ls4_Fl0ba/MAMUGANNA_MAA_TALLI.html


Saturday, August 2, 2014

ఓ అర్ధాంగీ

తిరిగే గానుగలో నలిగే చెరుకు గడవో
మరిగే పాలమీద కట్టిన మీగడవో
ఓ అర్ధాంగీ ..,నిన్నర్ధం చేసుకొనగ నా తరమా
ఓ సంపంగీ ..నినువీడి క్షణమైన మనగలనా

1. పనితో అలసినా-చెరగదు చిరునవ్వు
నలతగ నీకున్నా –నలగదు నీ మోముపువ్వు
శిరోవేదనే నరక యాతనౌతున్నా
మనోవేదనే గుండెను మెలిపెడుతున్నా
తబడదెప్పుడూ నీ అడుగు
కనబడ దెప్పుడునీ కన్నీటి మడుగు

ఓ అర్ధాంగీ ..,నిన్నర్ధం చేసుకొనగ నా తరమా
ఓ సంపంగీ ..నినువీడి క్షణమైన మనగలనా

2. ఆశలు ఆదిలోనె-అణగారిపోతున్నా
ఊహలు తృటిలోనె-చేజారిపోతున్నా
కాదెప్పుడు బ్రతుకు నీకు ప్రశ్నార్థకం
ఇల్లాలిగ నీపాత్ర అయ్యింది సార్థకం
బంధువర్గాన నీకు-అభినందన చందనాలు
మిత్రబృందాన నీకు-అభిమాన బంధనాలు

ఓ అర్ధాంగీ ..,నిన్నర్ధం చేసుకొనగ నా తరమా
ఓ సంపంగీ ..నినువీడి క్షణమైన మనగలనా

తెలంగాణ- నింగిలోన ఎగురుతున్న నవ కేతనమా..


మరల మరల మరపు రాని అనుభూతుల పునఃశ్చరణ ...!
తెలంగాణ షహీద్ ల త్యాగాల సంస్మరణ...!!
“తెలంగాణ(ఆవిర్)భావ గీతం “రాఖీ -02-06-2014

నింగిలోన ఎగురుతున్న నవ కేతనమా..ఓ జయ కేతనమా..!!
తెలంగాణ జనుల స్వప్న సాకార చిహ్నమా...
ఉద్యమాల గర్భాన ఊపిరులూని
(పునర్) ఉద్భవి౦చినావమ్మా తెలంగాణ రాష్ట్రమా
“జయహో జయహో జయ తెలంగాణమా
స్వేఛ్చా స్వాభిమాన సకల జనుల ప్రాణమా”

1. నీదైన నాగరికత నీదైన భావుకత
నీ సంస్కృతి నీ సభ్యత నీదైన నడత
తెలంగాణ పేరులోనే ఒళ్ళంతా పులకరింత
తెలంగాణ తలపులోనే కన్నుల చెమరింత
“జయహో జయహో జయ తెలంగాణమా
స్వేఛ్చా స్వాభిమాన సకల జనుల ప్రాణమా”

2. శాతవాహన కాకతీయ సామ్రాజ్య వైభవమా
కులీకుత్బ్ షాహి వంశ గోల్కొండ ప్రాభవమా
గుండె చార్మినార్ నీకు అండ కాకతీ ద్వారము
నిండుగ వెలుగొందు తల్లి కొలుతుము ప్రణమిల్లి
“జయహో జయహో జయ తెలంగాణమా
స్వేఛ్చా స్వాభిమాన సకల జనుల ప్రాణమా”

3. కంటి ఊటలాగిపోయి- పంట కాల్వ పారాలి
“ఆకలే “ చల్లార్చే -నూకలే పండాలి
బడుగులంత బంగారు బతుకమ్మ లాడాలి
ఆ’కలే ‘ నెరవేర్చే రూకలే నిండాలి..
“జయహో జయహో జయ తెలంగాణమా
స్వేఛ్చా స్వాభిమాన సకల జనుల ప్రాణమా”

4. బలిదానాలు నీకు పరిపాటే అనాదిగా
పునరుజ్జీవనమే చేసుకో పునాదిగా
చేయి చేయి కలుపుతూ గెలుపు తలుపు తట్టాలి
తెలంగాణ ఖ్యాతిగని హారతులే
పట్టాలి ...జగతి జేజేలు కొట్టాలి...

“జయహో జయహో జయ తెలంగాణమా
స్వేఛ్చా స్వాభిమాన సకల జనుల ప్రాణమా”
http://www.4shared.com/mp3/WPnWwuM7ce/RAKI-JAYAHO_TELANGANAMA.html

మైత్రీ బంధము



03-08-2014-మైత్రీ దినోత్సవ శుభాభినందనలతో...రాఖీ-9849693324.

మైత్రీ బంధము -మానవతకె అందము
ఒకరికొరకు ఒకరైన చందము
ప్రతి జ్ఞాపకం ప్రతి అనుభవం పరమానందము

1.       రాముడు సుగ్రీవుడు రాచబాట వేసినారు
కృష్ణుడూ కుచేలుడూ అంతరాలు మరచినారు
సుయోధనుడు కర్ణుడు ఒకే ఆత్మ అయినారు
స్నేహితమే మహితమని చరితార్థులైనారు

2.       తెలిసీ తెలియని పసితనాన  సోపతి
ఎదిగే వయసులోన ఎల్లలెరుగనీ చెలిమి
బాంధవ్యాల కన్న మిన్న యైనదే స్నేహము
వేదనలో మోదములో స్మృతి మెదులును నేస్తము

3.       ఆర్థిక గణాంకాలు కొలవలేని పెన్నిధి
జాతిప్రాంత కులమతాల కతీతమీ సన్నిధి
రూపురేఖ లెంచనీ విలువైన దోస్తీ ఇది
ఎంతమంది ఎక్కినా మునగని షిప్పిది - ప్రెండ్ షిప్ ఇది

Wednesday, January 22, 2014


హృదయాన్ని వెలిగించి ఇస్తున్నా హారతి
ప్రియమారగ గైకొనుమా కొండగట్టు మారుతి
లేరయ్యా  వేరేవరూ నినువినా మాకుగతి
కరుణించి మము జేర్చుము కైవల్య పద గతి

1.      1. పిలువగనే బదులిచ్చే-పరమ దయాళువే నీవు
కోరగానే వరమిచ్చే కల్ప వృక్షమే నీవు
సంజీవని గొని తెచ్చిన ప్రాణదాతవే నీవు
సీతమ్మ జాడను తెలిపినా-రామ దూతవేనీవు
లేరయ్యా  వేరేవరరూ నినువినా మాగతి
కరుణించి మము జేర్చు కైవల్య పదగతి

2.      2 గ్రహ పీడలు పరిమార్చగ-అనుగ్రహము కోరుకొంటి
సంకటముల నెడబాపగ-నీవే ఇక శరణంటి
వాక్సుద్ధి నీయమని-వాగధీశ నిను వేడితి
గాత్ర శుద్ధి కలుగజేయ-నీ పదముల తలనిడితి
లేరయ్యా  వేరేవరరూ నినువినా మాగతి
కరుణించి మము జేర్చు కైవల్య పదగతి

3.       3.చాంచల్యము తొలగించు-స్వామీ ఓ జితేంద్రియా
ఆత్మ స్థైర్యమే పెంచు-స్వామి భక్తి పరాయణా
అడుగడుగున మము నడిపే మార్గదర్శి వేనీవు
ఆయురారోగ్యాలను ఇచ్చేటి చిరంజీవుడవు
లేరయ్యా  వేరేవరరూ నినువినా మాగతి
కరుణించి మము జేర్చు కైవల్య పదగతి