Friday, December 29, 2017

కవితా దినోత్సవ శుభాకాంక్షలతో

॥రాఖీ॥కవి సంగమం

కవి సంగమం-హృదయంగమం
బహుముఖ ప్రజ్ఞా పాటవ అపూర్వ మేళనం
కవితలపుల ఉదయించిన కవితల పుట్టిల్లు
భావుకతల చిరుజల్లు..అనుభూతుల హరివిల్లు

1.అక్షర శిల్పులు చెక్కిన రమ్య శిల్పారామం
పదపదమున ఎద కుదిపిన మానవతా ధామం
మల్లెలు మొల్లలు ముళ్ళున్న రోజాలు
పారిజాత మధూ’క ‘ వనాలు...మొగిలి పొదల ప’వనాలు
కవితలపుల ఉదయించిన కవితల పుట్టిల్లు
భావుకతల చిరుజల్లు..అనుభూతుల హరివిల్లు

2.మాటలు తూటాలుగ పేల్చే తుపాకులు
భావాలు బాంబులే సంధిచే శతఘ్నులు
గేయాలు గీతాలు నానీలు ఫెంటోలు హైకూలు
తీరైన కవితారీతులు తీరని కవిత్వ ఆర్తులు
కవితలపుల ఉదయించిన కవితల పుట్టిల్లు
భావుకతల చిరుజల్లు..అనుభూతుల హరివిల్లు

15/10/2017

("కవి సంగమం" ఒక ఫేస్ బుక్ గ్రూపు)
రాఖీ ॥"రమ్యస్మృతి"॥

నిదుర నేను పోదామంటే
ఎప్పుడు నువ్వొస్తావో
మెలకువగా ఉందామంటే
కలనైన కనిపిస్తావో

అశ్రు తర్పణం చేద్దామంటే
కనుల నుండి నువు జారేవో
హృదయ మర్పితం చేద్దామంటే
తెలియకుండ అది నిను చేరేనో

ఏమివ్వగలను నేను
ఏమవ్వగలను నేను
కవితయై నిన్నలరిస్తా
రమ్యస్మృతినై నీలొ నిలుస్తా

Tuesday, December 26, 2017

ముద్ద బంతి పూవు నీ మోముకు ముద్దు
ముద్ద మందారమంటి బుగ్గన ముద్దు
తేనెలూరు మోవికి చుంబనాల సేవ
ముద్దరాలి మేనంతా ముద్దుల వాన

పల్లవాల వంటి ఆ పాదాలకు ముద్దు
తమలపాకులాంటి నీ అరచేతికి ముద్దు
దృష్టిని మరలింపలేని నాభిపైన ముద్దు
స్రష్టయైన తట్టుకోని నడుము పైన ముద్దు

తేనెలూరు మోవికి చుంబనాల సేవ
ముద్దరాలి మేనంతా ముద్దుల వాన

శంఖమంటి కంఠానికి నులివెచ్చని ముద్దు
గగనమంటు జఘనానికి సుతిమెత్తని
ముద్దు చెవితమ్మెల యుగ్మానికి తమకమైన
ముద్దు
పరవశ హృదయానికి రసికతగల ముద్దు

తేనెలూరు మోవికి చుంబనాల సేవ
ముద్దరాలి మేనంతా ముద్దుల వాన

Monday, December 25, 2017


ఏడుకొండల మీద వెలిగి పోతున్న వేంకటేశ్వర స్వామి నీకు దండము
కొండగట్టు మీద కొలువు దీరి ఉన్న మాతండ్రి అంజన్న నీకు దండము
ఎములాడ రాజన్న భద్రాద్రి రామన్న దయగల్ల మాస్వామి దరంపూరి నర్సన్న నీకు దండము స్వామి నీకు దండము

1.విన్నమాటేగాని కన్నదెపుడూలేదు
మీరంత చేసిన మైమల గూర్చి
తీర్థాలుక్షేత్రాలు తిరుగుడేగాని తీరిన ముడుపుల చిట్టానే లేదు
మొక్కిన మొక్కులు లెక్కకు మిక్కిలి
ఎక్కిదిగిన గడపల కంతైతే లేదు

2.ఇచ్చేది చెప్పరు అడిగింది ఇవ్వరు
ఒంటికో ఇంటికో మంట బెడతరు
ఉన్నట్టు ఉంచరు ఊబిలోకి తోస్తరు
లబలబమనిమేము మొత్కోంగజూస్తరు
ఆటలాడందెమీకు పూట గడువదేమో
నటనలాపిమాకు నవ్వులందించరో
రచన&స్వరకల్పన:రాఖీ

ఎలా వ్యక్త పరుచాలో ఎరగనిదే ప్రేమా
ఎలా నిర్వచించాలో తెలియనిదే ప్రేమా

యుగయుగాలుగా ఎన్నో గాథలు విఫలమైనాయి ప్రేమనుదహరించలేక

తరతరాలుగా ఎన్నో రచనలు చతికిల పడినాయి
ప్రేమను వివరించ లేక

1.అమ్మ ప్రేగు పంచి ఇచ్చే అనురాగం ప్రేమ
నాన్న బ్రతుకు ధారబోసే వాత్సల్యం ప్రేమ
యువజంట మధ్య పుట్టే ప్రణయమే ప్రేమ
వార్ధక్యాన తోడుగ నిలిచే అనుబంధం ప్రేమ-బాంధవ్యం ప్రేమ

2.నేస్తాల నడుమన వెలిసే స్నేహమే ప్రేమ
అభిరుచుల ఎడల చూపే అభిమానం ప్రేమ
సోదరీసోదరులపైన కలిగియున్న మమతయే ప్రేమ
జీవరాశిపై మనిషికి ఉన్న కారుణ్యమే ప్రేమ-మానవత్వమే ప్రేమ

3.కనులుకనులతో కలుపుతు చేసే సైగల్లో ప్రేమ
నుదుటిపై పెదవులు రాసే కైతల్లొ ప్రేమ
చేతిలో చేయితొనొక్కే కరస్పర్శయే ప్రేమ
అలయ్  బలయ్ ఆలింగనమే అంతులేని ప్రేమ-ఆత్మగతమే ప్రేమ

Friday, December 22, 2017

మమతల కోవెల మాఇల్లు
అమ్మానాన్నలె.దేవుళ్ళు
మా ఇంటకురిసేను నవ్వుల వెన్నెల జల్లు
ప్రతిపూట విరిసేను సంబురాల హరివిల్లు

1.బంధుమిత్రులకు ఆతిథ్యాలే మాకు తిరునాళ్ళు
ఆటపాటలతొ ఆనందాలే గోదారిలాగా పరవళ్ళు
పచ్చదనాల పలుమొక్కలతో కళకళలాడును మాలోగిళ్ళు
స్వఛ్ఛదనాల పరిసరాలే ఆహ్లాదానికి ఆనవాళ్ళు

2.నోరూరించే కమ్మని రుచులకు కార్ఖానాయే మావంటిల్లు
వరుసపంక్తుల్లొ వడ్డించె భోజనాల మా నడిమిల్లు
చల్లనివెన్నెల కాలవాలము మలయసమీరపు మాడువిల్లు
సరససల్లాపముల సేదదీరగా శాంతినొసగమా పడకటిల్లు

3.తాతా బామ్మా మందలింపులతొ ఇంపైనది
అరమరికలెరగని అమ్మానాన్నల మనసైనది
అన్నదమ్ము లేరాళ్ళు కలివిడిగా అలరారునది
ఉమ్మడికుటుంబమంటే ఉదాహరణగా విలసిల్లునది

Wednesday, December 20, 2017

అమ్మతోనె జగతిరా
పలుకు తోనె ప్రగతిరా
అమ్మ భాషతోనె మనిషి భవితరా
కమ్మని మన తెలుగె బ్రతుకు బాటరా

1.ఉగ్గుపాలతోనె పద్యాలు నేర్వాలి
అమ్మలాలి పాటలో గేయలయను పట్టాలి
బామ్మ ఒడిలొ బజ్జుని భాగవతం వినాలి
తాతయ్యే తలనిమరగ
నీతికథలు గ్రోలాలి

అమ్మభాషతోనె మనిషి మనుగడరా
కమ్మని మనతెలుగె చెఱకు గడరా

2.చందమామ కన్ననీవు
చందస్సుని కనరా
అందచందాలకన్న
అలంకార శాస్త్రమెరుగర
పలకబలపం పట్టే సరికే
వ్యాకరణం నేర్వర
తొలి బడి వయసులోనె
పలుకుబడులు గ్రహించర

అమ్మభాష నెపుడు యాది మరువకురా
కమ్మని మనతెలుగె పాలమీగడరా

3.పాఠశాల స్థాయిలోనె
భాష పట్టు సాధించర
యవ్వన తొలినాళ్ళలోనె
కవనము చిలికించరా
పూర్వకవుల గ్రంథాలు
ఆపోశన పట్టరా
అవధానం,శతక రచన
ఆకళింపు చేకొనరా

అమ్మభాష అంతులేని సంపదరా
కమ్మని మన తెలుగును
కలలోను పొగడరా

Wednesday, December 13, 2017

కూతవేటు దూరం-బంగారు తెలంగాణా అన్న స్వప్నం
చరితే పునరావృతం-రామరాజ్యం ఇక అనుభవైకవేద్యం

రైతేరాజై
బడుగు ప్రగతి తొలి అడుగై
సర్వతోముఖవికాసం
తెలంగాణ ప్రజలకు తరగని దరహాసం


1. సింగాలను లొంగదీయు శాతవాహన శౌర్యం
 కోటిలింగాల రాజధాని బోలు పునర్వైభవం
 కాకతీయ కదన మదన కళాప్రాభవం
కులీకుత్బుషాషి నవాబ్ జనసమైక్య జీవనం


 కలలిక సాకారం-కళలకు సత్కారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత ప్రాధాన్యతా క్రమం


 2.ఆడపడుచు పురిటిికి కేసియార్ కిట్టు,
కన్నపిల్లపెళ్ళికి కల్యాణలక్ష్మి గిఫ్టు
అసరాకరువైన అతివలకు ఒసిగె భృతి
అన్నివర్గాల జనుల నాదుకొనే ధర్మనిరతి


పచ్చదనం పరిశుభ్రత ప్రజల వంతు
ప్రగతి రథంనడిపించుట ప్రభుతవంతు


3.నిరంతరం విద్యుత్తు ఉద్యోగుల శ్రేయస్సు
ఉద్యోగకల్పనతో యువత భవిత ఉషస్సు
టి ఎస్సై పాస్ తొ పరిశ్రమస్థాపన భేషు
స్త్రీకి షీ టీం కవచం మేలైన పోలీస్ బలం


ఆసరా పింఛన్లు డబల్ బెడ్రూమిళ్ళు
బడుగుల బతుకుల్లో బంగారు వరాలజల్లు


 4.కోటిఎకర చెలకలకు నీటి వనరు సహకారం
వ్యవసాయ ఖర్చులకు ఎనిమిదివేల ధనసాయం
కాకతీయ భగీరథ పథకాల ఫలసాయం
పంటపొలం ,తాగుజలం కరువెరుగని వైనం


మాటనిలుపుకున్నతీరు కమనీయం
మనసుగెలుచుకున్న రీతి మహనీయం
నీ సహవాసం మధుమాసం
నీ సహచర్యం రసమాధుర్యం
నీ సహయోగం కుసుమ పరాగం
నీ సహ జీవనం నందనవనము

1.నీ తలపే నిదురకు వెరపే
నీ ఊహే చెఱకుకన్న తీపే
నీపలుకే మురళికి ముప్పే
నీ నవ్వే వెన్నెల కుప్పే

2.నీతో పయనం దిగంతాలకే
నీతో ప్రణయం ప్రబంధాలకే
నీ పరిష్వంగం రసజగాలకే
నీ చుంబనమైకం రమ్యలోకాలకే
ధర్మపురీ ,శ్రీ లక్ష్మీ నరసింహుని దివ్య క్షేత్రము
ధర్మపురీ,గోదావరి ప్రవహించే పుణ్య తీర్థము
కర్మలు నశియింప జేయు సన్నిధానము
జన్మను తరియి౦పజేయు ముక్తి ధామము

1.దక్షిణ వాహిని గా అలరారే గోదావరి ఒక వరము
 దక్షిణ కాశీ గా వాసికెక్కి యున్నదీ ఈ పురము
 దక్షిణ దిక్పతి నెలకొని యున్న స్థలము
 దక్షిణ భారతాన ప్రసిద్ధ యాత్రాస్థలము 

2.వేదాలకు నెలవైన విప్రవరుల  నిలయము
సంస్కృతీ సనాతన సంప్రదాయ సహితము
సంస్కృతము జ్యోతిష్యము సమకూరి యున్నది
సంగీతము సాహిత్యము సకల కళల పెన్నిధి

3.శివకేశవులభేదమైన హరిహరక్షేత్రము
పరమత హితమెరిగిన మహిత స్థావరం
నిత్యమూ భక్తులతో అలరారే జనపదము
ప్రతిరోజు పండగనే తలపించే ఒకజగము

కన్నె స్వామిని కావాలనుంది
నాకు మళ్ళీ ఒకసారి
తీర్చి దిద్దుకోవాలని ఉంది
గాడి తప్పిన బ్రతుకు దారి
ఎంతో తెలుసను అహము నుండి
ఏమీ తెలియని నిజము వరకు
చేరుకోవాలని ఉంది
మారిపోవాలని ఉంది

1.నియమాలంటే నిర్లిప్తమై
దీక్షపట్ల శ్రద్ధ నిర్లక్ష్యమై
కప్పదాటులె వేసుకుంటు
అనుకూలంగా మలచుకుంటూ
కొత్త భాష్యాలే చెప్పుకుంటూ
వక్రమార్గాలే ఎన్నుకుంటు
భ్రష్టుపట్టి పోయినాను స్వామి
దృష్టి తప్పి తిరిగినాను స్వామీ

2.వేడినీటి తో స్నానాలు
వేళతప్పి పడక శయనాలు
నోటరాని శరణుఘోషలు
గురుస్వామి మినహాయింపులు
నిష్ఠ లేక ఇష్టా రాజ్యాలు
వదలలేని జిహ్వచాపల్యాలు
నియతిలేని వాగ్వాదాలు
నియంత్రణలేని ఇంద్రియాలు
విలాసమయ్యింది నీ దీక్ష
శరణు శరణు స్వామి నీవే రక్ష

https://youtu.be/iRGTHuY5IZQ?si=4UIaom1810-fViKt


నీ నవ్వులో విచ్చుకున్న పారిజాతాలు
నీ చూపులో గుచ్చుకున్న వాసంతాలు
నీ చేరువలో మలయమారుతాలు
నీ తలపులలో ఆహ్లాద జలపాతాలు

1.నీ సుందర వదనం ఉదయ సూర్య బింబం
నీ చందన దేహం నిశి శశి చందం
చేజారిన మణిపూసవు ఈ నాటికి
పదిల పరుచుకుంటా అనుభూతులు ఏనాటికి

2.నా కొరకై దిగి వచ్చిన దేవత నీవు
నాకిలలో వరమిచ్చే విధాతవు నీవు
నీ సహవాసం ప్రతిరోజు మధుమాసం
నీ దరహాసం అపురూప బహుమానం

3.మనం కలుసుకున్న ప్రతిక్షణం మరువం
మన కలల నందనం మరులు రేపు దవనం
వచ్చేజన్మ లోనూ పెనవేయనీ మన బంధం
ఊహకూ హాయి గొలుపు మన సహజీవనం

చూస్తూ ఉండి పోనీ
నీ కళ్ళ లోగిళ్ళ లోకి
నే రెప్పలే గిలపకుండా,
శిలలా మారిపోనీ
నీ ఎదుట  నా గుండె సైతం
కొట్టుకోకుండా

కాలాలు కరిగిపోనీ
ఋతువులే జరిగిపోనీ 
సృష్టియూ స్రష్టయూ
నిర్వీర్యులవనీ

1.స్నేహానికే కొత్త అర్థాలు చెబుదాం
ప్రణయానికే వింత భాష్యాలు రాద్దాం
కలవలేనీ ప్రేమ కథలు మనవి
కలలయందైన కలవ మనవి
చూపులే చుంబనాలై
పలుకులే ఆలింగనాలై
సగము సగమై సంగమిద్దాం
సరస జగమై పరవశిద్దాం

2.అనురాగ రాగాలు ఆలపిద్దాం
హృదయాల లయలోన అడుగులేద్దాం
విరహాలు దరిరాని అనుబంధము
కలతలే కనరాని
సహయోగము
మనసులే మరులు రేప
మమతలే దారి చూప
స్వర్గ ద్వారాల తలుపు తడదాం
స్వప్నలోకాన కాలు పెడదాం
శిథిలమైన శిల్పాన్ని తిరిగి చెక్కుతున్నా..
భిన్నమైన ప్రతిమకు ప్రాణప్రతిష్ట చేస్తున్నా
పాడుబడ్డ గుండెనే గుడిగాచేస్తున్నా
మనసు లేని దేవతకే మరీమరీ మొక్కుతున్నా

1.వరములేవి అడుగకున్నా కరుణ మానెనెందుకో
పూజలెన్ని చేస్తున్నా లెక్కచేయదెందుకో
దోషమేదొ ఎరిగింపక చింతపెంచె నెందుకో
ఊపిరాడలేకున్నా వింతగ చూసెనెందుకో

2.బాధపంచుకుంటె చాలు భాగ్యమునందించినట్టె
క్రీగంట చూస్తెచాలు దయామృతం చిలికినట్టె
చిరునవ్వితేనె చాలు వెన్నెల వర్షించినట్టె
స్నేహంగా ఉంటెచాలు బ్రతుకు బాగుచేసినట్టె
ప్రపంచ తెలుగు మహాసభలు-2017 పురస్సరంగా
"నా తెలఁగానం"
యుగయగాల వెలుగులీనె మన తెలుగు
దిగంతాల కీర్తి మించె మనతెలుగు
తెలంగాణ 'తెలుగు' పురిటి గడ్డ
తెలంగాణ పలుకు అప్యాయత అడ్డా

1.పాల్కుర్కిసోమన్న ప్రణీత ద్విపదగా ఆద్యమై
పనిపాటల పల్లె జానపదముగా హృద్యమై
తెలంగాణ నుడికారపు మమకారమై
కోనసీమ వెటకారపు వ్యవహారమై
రాయలసీమ మాండలీక మణిహారమై
కళింగాంధ్ర పదగతి  ప్రాకారమై

మాధుర్యం చిలుకుతుంది మన భాష
ఆంతర్యం ఒలుకుతుంది మనభాష

2.వేమన బద్దెనల నీతిశతక బోధకమై
పోతన్న గోపన్నల భక్తిభావ సాధకమై
దాశరథీ వరదన్నల వాణీ పద మంజీర నాదమై
కాళోజీ సినారెల ఆధునిక వచన గీత వేదమై
హృద్య పద్య ప్రసిద్ధగా లోకామోదమై
సహజసిద్ధ భావనాయుత ఆహ్లాదమై

ప్రభలు చిమ్మె తెలంగాణ తెలుగు తేజమై
సుధలు కురిసె తెలంగాణ విశ్వ విరాజమై

3.అజంతా సుందరిగా అరుదైన పదాకృతి
ముత్యాల దస్తూరిగ తీరైన వర్ణ లిపి
జగతిలోన ఏ సాహితి నోచని పద్య సంస్కృతి
ప్రభుత కొలువందు కొలువొంద మనస్కృతి
అధికార భాషగా ఆదరించమని వినతి
తెలుగువారు మాతృభాష మన్నింపగ ప్రణతి
ఇటలిభాష 'పడమటి తెలుగని'పొందగ ఖ్యాతి
పాడుకోవాలి జనమంతా మక్కువతో తెలుగుగీతి
చెరగనీకు పెదవులపై
చంద్రవంక చిరునగవు
చేయబోకు ఎడదనెపుడు
వెతలకింక తావు

ఆటుపోట్ల తాకిడికి
వెరవబోదు రేవు
కలతలు కన్నీళ్ళు
కలకాలం మనలేవు

1.ఎండకైన వానకైన
కొండ చెక్కుచెదరదు
తనగొంతు ఎండినా
ఎడారింక బెదరదు

రేయైనా పగలైనా
నదీ నడక నాపదు
ఋతువులెన్ని మారినా
చెట్టు ఎపుడు జడవదు

2.బతుకు చిటికెడైనగాని
బుడగకింక పంచదా
తలకుమించు బరువైనా
చీమకు తలవంచదా

గెలుపు ఎంత గొప్పదైన
మోడి(పట్టదల)ముందు ఓడదా
ప్రేమ తో జతకడితే
హాయివంత పాడదా
ఇంతకన్న ఇంకేమి చేయగలవు
పూవులాంటి జీవితాన్ని చిదిమేయ గలవు
ఇంతకన్న ఇంకేమి చేయగలవు
కడివెడు పాలల్లో ఉప్పురవ్వ వేయగలవు
ఇంతకన్న ఇంతకన్న ఇంతకన్నా
ఇంతకన్న ఇంకేమి చేయగలవు

1.ఆశల సౌధాల నెన్నొ కూలద్రోయగలవు
నడికడలిన బ్రతుకు నావ ముంచగలవు
పచ్చనైన కాపురాన చిచ్చు రేపగలవు
చేతికందు పంటనంత
బుగ్గిపాలు చేయగలవు
ఇంతకన్న ఇంతకన్న ఇంకన్న ఇంకేమి చేయగలవు
విధివిలాసమంటు వింత
తత్వబోధ చేయగలవు

2.నాటుకున్న మొక్కనైన పెకలించి వేయగలవు
ముక్కుపచ్చలారకున్నా
పీకలు నులిమేయగలవు
బంగారు భవితనంత
గంగపాలు చేయగలవు
అందమైన దేహాన్ని
అవకరంగ మార్చగలవు
ఇంతకన్న ఇంతకన్న ఇంతకన్న
ఇంకేమి చేయగలవు
కర్మ సిద్ధాంతమంటు గీతబోధ
చేయగలవు
రచన:
RAMKISHAN RAKI GOLLAPELLI

చిలకా గోరింక
చెరిసగమైనాయి
కలువ నెలవంక
ఒక జగమైనాయి
గత జన్మల ప్రణయాల గురుతుగా
దివిన జరుగు పరిణయాల
ఋజువుగా

1.మనసులు ఏకమైన మనువుగా
తపనలు కలగలిసిన తనువుగా
అర్థవంతమైన బంధాన అడుగిడగా
అర్ధనారీశ్వరమైన మనుగడగా

సాగిపోతుంది జీవితం
కలలే సాకారమై
విలసిల్లుతుంది కాపురం
మమతల ప్రాకారమై

 2.ఒడుదుడుకుల జడివానల నధిగమించి
చిరుచిరు కలహాలనే విరమించి
ఒకరి కొరకు ఒకరనే ఎప్పుడూ తలంచి
ఎదుటివారి సలహా శిరసా వహించి

ఆదర్శవంతమై నిలవాలి దాంపత్యం
పిల్లాపాపల నవ్వులు పూయాలి ప్రతినిత్యం
బ్రతుకీయగ చేతగాని శివశంకరా
చంపేయగనైనా సంకోచమేలరా
క్షణక్షణం భరియించెడి యాతనకన్నా
తీక్షణ మైనదా ఏరౌరవ నరకమైన

1.తోటలేల పెంచేవు
జిల్లేళ్ళూ నాగజెముళ్ళతో
బాటలేల వేసేవు
సమాధులూ చితులతో

ఇస్తే ఆనంద మీయి
బెదిరిస్తే భవిత బాగుచెయ్యి

2.మందే లేని రోగాలను
అప్పనంగ ఇచ్చేవు
తాళలేని వేదనలను
తలకు అంటగట్టేవు

ఇస్తే కాస్త అమృతమీయి
 దారుణ విషమైనా దయచేయి

3.నీ తావే సదాశివా శ్మశానవాటికా
నీ కడ గరళం
పుష్కలమేగా

దరి జేర్చుకో బిరబిరగా
మరుజన్మయే లేనట్లుగా
రచన:రాఖీ -రాధికలా...!

రాధనే నేనూ..ఆరాధనే నేను
విచ్చిన కలువను(నిను) ఎచటని కలువను
నామది యే బృందావనిగా,
నా పెదవే పిల్లనగ్రోవిగ
కలవని భావించి నే వేచితిని
రాగలవని నేనెంచి నిను నోచితిని

1.వేలగోపికల కలవేనీవు
వలపులతోనే వలవేసెదవు
మురళిని మ్రోయించి మత్తులోముంచేవు
చిత్తమునేమార్చి గమ్మత్తులు చేసేవు
కలవని భావించి నిను పిలిచితిని
కలయని తోచగ చింతించితిని

2.అష్ట భార్యల ఇష్టసఖుడవే
స్పష్టతలేదా నన్నలరించగ
కుబ్జయుతరించె నీ పదాబ్జమున
మీరా రమించె నిను తనమనమున
కలవని భావించి నిను తలచితిని
కలవరించినేనిల శిలనైతిని

Saturday, October 28, 2017

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

"దైవం మానుష రూపేణా..."

నిజమే లేదు-నువ్వున్నావను మాటలో
ఋజువే లేదు- మా అనుభవాలలో
ఉన్నావో లేవో తెలియని ఓదైవమా...
నమ్మలేను నిన్ను మనస్పూర్తిగా
అర్థించక మానలేను ఆర్తిగా

1.చెప్పడానికేముంది-పుక్కిటి పురాణాలు
విప్పడానికేముంది-గుప్పిటి రహస్యాలు
అదిగోపులి యిదిగో తోకయన్న చందము
మేమిచ్చిన గొప్పతప్ప ఏదీనీ మహత్మ్యము

మార్చుకోను నాగతి ఆధ్యాత్మిక దారికి మళ్ళక
ఉండలేను మసీచ్చర్చ్ గుళ్ళకు నే వెళ్ళక

2.ఉన్నట్టుండి తేగలవు-ఉపద్రవాలు
నట్టేట ముంచగలవు -మా జీవితాలు
పరిష్కార మెరుగక'నే వేతు వేల(?) సవాళ్ళు
ఉంటేగింటే నీ ఉనికి -చేయవేల అద్భుతాలు

కలోగంజో తాగుతా నా కష్టార్జితం
సాటిమనిషినడుగుతా ఆదుకొనగ సాయం

మనిషి మనిషిలో చూస్తా దైవమనే నీ భావం

28/10

Sunday, September 17, 2017

కోరనివెన్నో - తేరగ ఇచ్చావు
వేడని నాడూ - వేదన తీర్చావు
కంటిపాపలా - ననుకాచావు
మంచి మార్గమే-నువుచూపావు
ఆనందాల-తేలునంతలో
ఎందుకు స్వామీ-ననువీడావు
సుడిగుండాలలొ-ననుతోసావు

1.శ్రద్ధాసక్తులు-కనబరచలేదు
రేయీపగలూ-కృషిసలుపలేదు
ఉన్నత లక్ష్యాలు-ఊహించలేదు
ఏసరదాలు-నే కోల్పోలేదు
ఐనా స్వామీ-అంతానీదయ
పొందినదంతా-నీ దయా

2.ఆశించినది-నాకందలేదు
అంతకు మించే-ప్రసాదించావు
తలచినదేదీ-నువుచేయలేదు
ప్రతి ప్రతిఫలము-నాకతిశ్రేయము
కష్టాలకడలిలో-ఈదాడినా స్వామీ
ఏతడి ఒంటికి-అంటనీయవు

3.మొగ్గలోనే-పువ్వును చిదిమేవు
మధ్యలోనే-నాచేయి వదిలేవు
మందేలేని-గాయాలు చేసేవు
గుండెను పిండి-మరలోనలిపేవు
ఎరుగము స్వామీ-నీ అంతరంగము
నను దరిజేర్చగ-నీదే భారము

Saturday, August 26, 2017

సేవల పాయసము
చేసి ఉంచాను నీ కోసము
ఆరగించర మూషిక వాహన
నన్నాదరించర దీనజనావన

1.కమ్మని వాసన రావాలని
తుమ్మెద వాలని మల్లెలని
ఎరుపంటె నీకెంతొ ఇష్టమని
విరిసిన మందార పూవులని
సిద్ధపరిచాను సిద్ధివినాయక
చిత్తగించర శ్రీ గణనాయక

2.పంచామృత సమ నీనామగానం
పంచమ స్వరమున పలికించు వైనం
తలపోయ తెలిసే పికగాత్ర మర్మం
పులిమితి నామేన ఆకృష్ణ వర్ణం
ఆలపించితి నీ దివ్య గీతి
ఆలకించర ఓ బొజ్జ గణపతి

3.నా నయనాలే దివ్వెలుజేసి
వెలిగించానిదె మంగళ హారతి
నా హృదయము జే గంటగజేసి
మ్రోయించానిదె మంజుల రవళి
నా మనసే గొను నైవేద్యము
కరుణించి వరమిడు కైవల్యము

Wednesday, August 16, 2017

గుండె లో గుచ్చుకున్న పూబాణం నీవు
తలపులో చిక్కుబడిన తూనీగవు నీవు
నవ్వుతో చంపుతున్న ప్రియవైరివి నీవు
చూపులతో లోబచే మంత్రగత్తెవే నీవు

నీకు గులాం కానివారు లేరెవరూ ఇలలోనా
నీకు సలాం చేస్తానే బ్రతకనీయి కలనైనా..

1.సౌందర్యం మోహినిదే అదికాదు నీ ఘనత
మాధుర్యం కోయిలదే గాత్రం కాదు ప్రథ
ఔదార్యం శిబి దేలే అది ఓ పాత కథ
సహచర్యం నీదైతే విశ్వంలో నవ్య చరిత

నీకు గులాం కానివారు లేరెవరూ ఇలలోనా
నీకు సలాం చేస్తానే బ్రతకనీయి కలనైనా..

2.అధరాలకు అడ్డుగా తుమ్మెదలతొ ఒక బాధ
నయనాలకు సీతాకోక చిలుకలే ఎపుడు జత
కపోలాల నందబోగ కందిరీగలతొ చింత
నాభి చెంతచేరనీక తేనెటీగలే రొద

నీకు గులాం కానివారు లేరెవరూ ఇలలోనా
నీకు సలాం చేస్తానే బ్రతకనీయి కలనైనా..
స్మృతులే మధురం
మదిలో పదిలం
మృతి త్రెంచని బంధం
స్నేహం స్నేహం స్నేహం

1.అలనాటి బాల్యం
అపురూప కావ్యం
విలువే అమూల్యం
చెలిమి సదా నవ్యం

2.విద్యార్థి లోకం
వింతైన మైకం
దరిరాదు శోకం
సర్వస్వమే నేస్తం

3.నిండైన హితుడు
గుండె నిండ మిత్రుడు
ఏకైక ఆప్తుడు
నిజప్రేమ పాత్రుడు

Wednesday, August 9, 2017



వృధా చేయబోకు నేస్తం-ఏఒక్క క్షణము చేజార్చుకున్నావంటే-దొరకడమిక దుర్లభము

జీవితానికి పరమాధియే- ఆనందము
ఆనందించు మోదం పంచు- జీవితాంతము
హాప్పీ హాప్పీ న్యూ ఇయర్!అందుకో ఓ మై డియర్!!

1.అంగడిలో కొనగలేనిది
వ్యసనాలతొ పొందలేనిది
ఎంతగాలించినా ప్రపంచాన దొరకనిది
ఏడేడు లోకాల్లోనూ లభ్యమవనిది
నీలోకి తొంగి చూడు నిత్యమూ కనబడుతుంది                            నీ అంతరంగానా నివాసమై ఉంటుంది

జీవితానికి పరమాధియే- ఆనందము
ఆనందించు మోదం పంచు- జీవితాంతము
హాప్పీ హాప్పీ న్యూ ఇయర్!అందుకో ఓ మై డియర్!!

2.ఆరోగ్యం ఆత్మబంధువు-
ఉత్సాహం ప్రాణమిత్రుడు
దరహాసపు తోటలోన సంతోషమె అమరపుష్పము
సంతృప్తి తామరాకుపై గెలుపే తుషార బాష్పము
పంచుతూ పోయే కొద్దీ పదింతలై పెరిగేదీ
ఓటమన్నదిలేకున్నా ఒదిగి ఒదిగి ఉండేది

జీవితానికి పరమాధియే- ఆనందము
ఆనందించు మోదం పంచు- జీవితాంతము
హాప్పీ హాప్పీ న్యూ ఇయర్!అందుకో ఓ మై డియర్!!

Tuesday, August 1, 2017



చీకటి రేయి తెల్లవారదు,
వెన్నెల హాయి నన్ను చేరదు
ఎదురుతెన్నులే జీవితమంతా
అశనిపాతమే బ్రతుకంతా!!

చెలగాటం చెలియ నైజము
ఆరాటం నిత్యకృత్యము
తీరేనా నా మధుర స్వప్నము
తీరానా..కన నవ్యలోకము

వలపన్నె వలపుతోనే
ఎరవేసే సొగసుతోనె
మీనం మేషం లెక్కలెంచక
మీనము నైతి బెట్టుసేయక
నుదుటి పైన ముద్దు పెడితె నందివర్ధనం
కనులపైన ముద్దు పెడితె కమల కోమలం
ముక్కు పైన ముద్దు పెడితె సంపంగి పరిమళం
పెదవి పైన ముద్దుపెడితె పారిజాత పరవశం

చెక్కిలి పైముద్దు పెడితె ముద్దమందారం
చుబుకముపై ముద్దుపెడితె
శ్రీగంధ చందనం
చెవితమ్మెన ముద్దుపెడితె సన్నజాజి సోయగం
మెడవంపున
ముద్దుపెడితె
మొగిలిరేకు సౌరభం

ఎదపైన చుంబిస్తే
బంతిపూల మెత్తదనం
నాభిమీద చుంబిస్తే
పున్నాగ పులకరము
నడుము మడత ముద్దెపుడు
నిద్రగన్నేరు
గులాబి గుభాళింపు
తమకాల ముద్దుతీరు

తనువణువణువు ముద్దు తంగేడు పువ్వు సొగసు

Saturday, July 29, 2017

వెన్నెలంతా ముద్దగజేసి
నింగి సింగిడి రంగులనద్ది
మంచుకొండను గుండెగజేసి
మమతలెన్నో మనసున కూర్చి
నిన్ను సృష్టి చేసినాడు ఆబ్రహ్మా
చేసిచేయగానె ధన్యుడాయె నోయమ్మా

1.మేఘాలే కురులుగ మారే
కమలాలే కన్నుల చేరే
ముక్కుజేరగ ముక్కెర కోరే
పగడాలే పెదవుల రాలే
రోజాలే చెంపలపూసే
చుబుకం తీరు లేతకొబ్బరే

నువ్వు నవ్వు నవ్వగానె ఓయమ్మా
మాయలేవొ కమ్ము నమ్ము నమ్మవమ్మా

2.కుంభరాశి ఎద తులతూగె
సింహరాశి కటిలో నిలిచే
కన్యారాశి నాభిలొ మెరిసె
మిథునరాశి మతిపోగొట్టె
వృషభమేమొ జఘనమ్మాయే
మేను మేను మీనమాయే

నీ నడకల హొయలేచూస్తె ఓ కొమ్మా
హంస ఘనత ధ్వంసమగునులే
ఓ గుమ్మా

Monday, July 24, 2017

నీవేలే నా జీవితమంతా
నీ అడుగులె నా జీవన పంథా
నిను తలవక నా మనుగడ మృగ్యం
నువు కలవక నా బ్రతుకే శూన్యం


కేవలం ఇక నీవేలే
నాలోకమే ఇక నీవేలే

నా ధ్యానము నా మౌనము
నా గానము మరి నీవేలే
నా దేహము నా హృదయము
నా ప్రాణము ఇక నీవేలే

1.నీ విరహం అహరహ నరకం
నీ సంగమమే నాకిల నాకం
నిను పొందక నే జీవశ్చవము
నీ సన్నిధియే నందనవనము
 .
నా శ్వాసయే నీ ఊపిరి
నా గుండెలో నీ సవ్వడి

నా ప్రణయము నా పరువము
నా పరవశం నీవేలే
అనుభూతులు మధురోహలు
రసజగత్తులు నీవేలే

2.జన్మలు దాటెను మన అనుబంధం
కాలపు అంచులు మీటిన చందం
నీ సహవాసం నిత్య వసంతం
నీతో గడిపే యుగమే క్షణము

కేవలం ఇక నీవేలే
నా లోకమే ఇక నీవేలే

నా వేదన నా సాధన
నా ప్రార్థన మరి నీవేలే
నా పంతము నా సొంతము
ఆసాంతము  ఇక నీవేలే

ప్రేమ(వ)లయం

ఎనలేని మిన్ను అనురాగం
మనలేని కడలి కడు మోహం
దరిచేరలేని ఆరాటం
నెరవేరలేని బులపాటం

1.కెరటాలు చేసె పోరాటం
ఎగిరేందుకెంత ఉబలాటం
అలరించునంత తామే
అలసె అలలంతలోనే

వగచిందిలే తరంగం
కలచేంత అంతరంగం
అశ్రుధారచేర్చె లవణం
సింధువాయె క్షారక్షీరం

2.రేగింది విరహ తాపం
ఎగసింది నింగి భాష్పం
చుంబించె దివిని మేఘం
తీరంగ నే'మో వి'యోగం

అంబరానికెంతొ హర్షం
కురిసింది ప్రణయ వర్షం
ప్రవహించి వాగునదులై
చేరేను జలధి ఎదలో

Monday, July 17, 2017

హాయి పంచుకుందాం
అనుక్షణం నేస్తం
రాగమందుకుందాం
సంగీతం మన సమస్తం

1.గాయకులమే గాని
కులమెంచబోము
అభిమతము ఏదైనా
మతము పట్టించుకోము

శ్రుతి లయమేళవించే
ఆహ్లాదం మా వేదం
గతి గమకాలనద్దే
ఆనందం మానాదం

2.కోయిలే మాకు గురువు
ప్రకృతే పాఠశాల
సరిగమలు మా భాష
పాటలే మాకు శ్వాస

అరమరికలు లేనివిమా
అనురాగ బంధాలు
అజరామర మైనవి ఈ
అపురూప స్నేహితాలు

Wednesday, July 5, 2017

అందమైన సుందరుడు
నేలమీది చందురుడు
నవ్వుల్లొ వెన్నెలలే రువ్వుతాడు
చూపుల్లొ వేకువలే చిమ్ముతాడు
చిన్నారి నా తనయుడు
గారాల మారాల వీరుడు

1.మాటల్లు తేనియ విందేలే
పాటల్లు కోయిలతొ పందాలే

పూలబాల మెత్తదనం
మేఘమాల జాలిగుణం
పిల్లగాలి హాయిగుణం
ఊటనీటి స్వచ్ఛదనం

అన్నీ సొంతం చేసుకున్నాడులే
అందరి ఎదలే దోచుకున్నాడులే

2.నడకల్లొ ఉట్టిపడే రాజసాలు
వెనకంజ వేయనీ సాహసాలు

అమ్మ లోని ప్రేమగుణం
చెట్టు చూపె స్నేహగుణం
వానకున్న త్యాగగుణం
మోడుకున్న మొండితనం

అన్నీ సంతరించుకున్నాడులే
అందరి మన్నన చూరగొన్నాడులే

Wednesday, June 14, 2017

కొలవలేని ప్రేమకు
నాన్నేగా కొలమానం
మరపురాని గెలుపుకు
నాన్నేగా బహుమానం

త్యాగానికి ఇలలోన
నాన్నేగా తగు అర్థం
అనురాగానికి నాన్నేగ
బ్రతుకున పరమార్థం

1.పాదాలు కందకుండ
అరిచేతులపై నడిపాడు
అమ్మను మరిపించేలా
గుండెలపై పెంచాడు
అవసరాలనెరిగి మరీ
అన్నీ అమరించాడు
నాన్న కన్న మిన్న లేనే
లేదనిపించాడు

2.ఎండకూ వానకూ
తానే గొడుగైనాడు
సవాళ్ళ నెదుర్కొనగ
తొలి అడుగైనాడు
ఎదఅడుగున కనిపించని
కన్నీటిమడు గైనాడు
పెదవులపై చెరిగిపోని
నవ్వుల తొడుగైనాడు

3.తనదైన జీవితమే
నాన్న ఎన్నడెరుగడు
మా బాగోగులను
కలనైనా మరువడు
మా ఉన్నతి కంతటికీ
మా నాన్నే కారణం
తన పిల్లలమైనందుకు
మాకు గర్వకారణం

"దిక్కు"


ఘన సాగరాన

చిరునావలోన

సాగేను పయనం

ఏ దిక్కు లేక


తీరాన్ని చేరే దెలా

కడగండ్లు తీరేదెలా


కనుచూపు మేర

గాఢాంధకారం

ముంచెత్తివేసే

వడగళ్ళ వర్షం


ఉవ్వెతునెగసే

ఉత్తుంగ కెరటం

గొంతారి పోయే

విపరీత దాహం


తీరాన్ని చేరేదెలా

కడగండ్లు తీరేదెలా



చుక్కాని సైతం

చేజారి పోయే

తెరచాప కూడ

చిరిగింది నేడే


నడిపించు వాడు

నను వీడినాడు

ఏకాకినను చేసి

వదిలేసినాడు


తీరాన్ని చేరేదెలా

కడగండ్లు తీరేదెలా



గుండెలోని ఆశే

ఒక దారి చూపు

జడివాన నీరే

గొతింక తడుపు


నాచేతులే ఇంక

నానావ నడుపు

నన్నొడ్డు చేర్చు

తొలిపొద్దు పొడుపు


విశ్వాసమే చెలికాడు ఎపుడు

నేనే కదానాకు కడదాక తోడు
FROM the heart of my LOVELY sons

 హ్యాపీ బర్త్ డే డాడీ
ఎవర్ యు హాప్పీ మూడీ
(వి)లవ్ యూ లవ్ యూ డాడీ
నువ్వున్న చోటే మాకో గుడి

1.అడుగడుగున మా రక్షవు
క్రమశిక్షణ లో శిక్షవు
లక్ష్య సాధన పరీక్షవు
సడలని కార్య దీక్షవు

2.నవ్వులు పూసే తోటవు
గమ్యం చేర్చే బాటవు
తీయని కోయిల పాటవు
ధైర్యంకు పెట్టని కోటవు

 3.అబ్బుర పరిచే మాజిక్ వి
అర్థం కాని లాజిక్ వి
కాలమందుకోలేని రాకెట్ వి
రోజురోజుకో కొత్త గాడ్జెట్ వి
శుభోదయం! మొక్కవోని ప్రయత్నమే విజయం!!

ఒక నవ్వు నవ్వితే చాలురా
వరహాలు ముత్యాలు రాలురా
ఒకచూపు చూస్తే చాలురా
వేవేల వెన్నెల్ల జల్లురా

1.ఒక ముద్ద మింగితే చాలురా
నాకడుపుసైతం నిండురా
ఒక గుటక నీళ్ళైన తాగురా
లేకున్న  'కన్నా' గొతెండురా

ఒక పలుకు పలికితే చాలురా
తేనెల్లు ఏరులై పారురా
ఒక పాట పాడితే చాలురా
కోయిలే తలవంచి నిల్చురా

2.సొంతంగ మనగలుగు చాలురా
కోరేది మరిఏది లేదురా
కలివిడిగ కదలాడు చాలురా
కనగలుగు కల ఏది లేదురా

పిడికిలే బిగియించి మోదరా
కొండలే పిండిగా మారురా
ఒక అడుగు వేస్తే చాలురా
గమ్యాలు నీముందు వాలురా

3.యత్నిస్తె పోయేది లేదురా
ఎద దమ్ము దుమ్మింక తొలగురా
గురి పెడితె సరినీకు లేదురా
విజయాలు నిన్ననుసరించురా
నక్షత్ర(27 వ)వాసంత వైవాహిక దినోత్సవ అనుభూతులతో...రాఖీ గీత!!

తరగని ప్రేమ ఇది
చెరగని బంధమిది
జన్మజన్మాలది
ఆత్మగతమైనది

1.మూడుముళ్ళ కటిక ముడి
ఏడడుగుల కఠిన నడవడి
అలరించెను బ్రతుకు ఒరవడి
అలవోకగ సాగ పదపడి

దాంపత్యపు సత్యమిది
ఒడుదుడుకుల తత్వమిది
రాగ మోహాలది
దేహ దాహాలది

2.గుట్టు దాచ మూసిన గుప్పిటి
పట్టు విడుపు నేర్చిన పోటి
ఆలుమగల అలకల ధాటి
అనురాగము కేదీ సాటి

సంసారపు సారమిది
సహవాసపు గంధమిది
అనుపమాన సౌఖ్యమిది
అద్వితీయ హాయి ఇది

Friday, May 12, 2017

శుభోదయం-భవితకు అభయం!

కాలం సాగుతోంది నీ వెంట పడి
జీవితమే చిక్కుకుంది నీతో ముడిపడి
నీ చేతన మా శ్వాసగా
నీ వికాసమే ఆశగా
ప్రయత్నం మడమతిప్పకుంది
విశ్వాసం విధితో పోరాడుతోంది

1.శిఖరాలు లోయలెన్నో ఆగని నీ పయనంలో
ఆటుపోటు కెరటాలే నీ బ్రతుకు సంద్రంలో
అడుగడుగూ అవుతోంది నీకో సవాలు
అధిగమించి ఋజువు పరచు ప్రజ్ఞాపాటవాలు
నీ ప్రగతే మా ఆర్తిగ
నీ నడతే ఒక స్ఫూర్తిగ
సాధనయే దారి చూపుతోంది
సాహసమే వెన్ను తట్టుతోంది

2.అలుపెరుగని సూరీడే నీకు ఆదర్శం
వడివడిగా పరుగులిడే సెలయెరే గురుతుల్యం
ఉఛ్వాసనిశ్వాసలు ఉదయాస్తమయాలు
అడ్డంకులు ఒడుదుడుకులు కొండలుకోనలు
నీ గమ్యం కడురమ్యమై
నీ ధ్యేయం జనక్షేమమై
వెలుగులు పంచాలి విసుగుచెందక
వెతలను తీర్చాలి ఏదీ ఆశించక

Tuesday, April 18, 2017

మా లు సైతం రాని వాణ్ణి సాహిత్యంలో

సరిగమ పదనిస లైనా అసలెరుగని వాణ్ణి సంగీతంలో

కొలుతునెప్పుడు  వీణా పాణిని శ్రీ వాణిని

మది తలతునెప్పడు మాతా జ్ఞాన సరస్వతిని

 

1. పంచ మహా కావ్యాలు పఠియించలేదు

ఛందస్సు వ్యాకరణం నేర్చింది లేదు

వాగ్గేయ కారుల కృతులు పాడలేదు

శ్రుతి లయ గతులు జతులు అభ్యసించలేదు

గళసీమ యందైన మాధుర్య రుచిలేదు

నా గళసీమ యందైన మాధుర్య రుచిలేదు

కొలుతునెప్పుడు  వీణా పాణిని శ్రీ వాణిని

మది తలతునెప్పడు మాతా జ్ఞాన సరస్వతిని

 

 

2. సాహితీ స్రష్టల సహవాస ఫలమిది

సంగీత బ్రహ్మల సాన్నిధ్య యోగమిది

గోదారి జలపాన ఘనమైన మహిమ ఇది

ధర్మపురి నరసింహ స్వామి  కరుణాకటాక్షమిది

అమ్మా నాన్నల ఆశీస్సుల బలమిది

మా అమ్మా నాన్నల ఆశీస్సుల బలమిది

కొలుతునెప్పుడు వీణాపాణిని శ్రీవాణిని

మది తలతునెప్పుడు మాతా జ్ఞాన సరస్వతిని

 

 

 3.పురాణాలు హరికథలు అడుగులు వేయించెను

 నాటకాలు భజనలునా చేయిపట్టి నడిపించెను

 బాంధవ్యం  స్నేహితం వెన్నుతట్టి పురికొల్పెను

పూర్వజన్మ సుకృతమేదో కవిగ మేలుకొల్పెను

నా పూర్వజన్మ సుకృతమేదో కవిగా మేలుకొల్పెను

కొలుతునెప్పుడు వీణా పాణిని శ్రీ వాణిని


మది తలతునెప్పడు మాతా జ్ఞాన సరస్వతిని


Saturday, April 15, 2017


ఏ దేవుడికీదయరాదేలా
ఏ దేవతకీ హృదయంలేదా
పేరుకుమాత్రం ముప్పైమూడుకోట్లమంది
ఎంతమందిఉంటే౦దీ అక్కరకేరాందీ
1.అక్కడోఇక్కడోఆచూకిదొరుకుతుంది మానవత్వానికీ
ఏడగాలించినా అయిపుజాడలేదులే దైవత్వానికీ
తన్నుక చస్తున్నాతమాషాలుచూస్తారు
ఇల్లుకాలి ఏడ్చినా ఇగిలిస్తారు మరింతనిప్పురాజేస్తారు
ఇంకాస్త ఉప్పేస్తారు మనస్తులునొప్పిస్తారు
2.మూగజీవాలనింకతెగటార్చనేెల నిండుజీవితాలనే బలిచేస్తుంటే
ముడుపులుమొక్కులూసమర్పించనేల నూరేళ్ళబ్రతుకులనే నలిపెస్తుంటే
నమ్మకాలరంగంపై నర్తిస్తారు జాతకాలచక్రాన్నిసంధిస్తారు
వాస్తులనెరవేస్తారు వాస్తవాలుదాస్తారు ఆస్తులుకరిగిస్తారు
మాయలుచేస్తారు మత్తులొ పడవేస్తారు చోద్యంచూస్తారు
3.వింతవింతరోగాల చింతలుసృష్టిస్తారు ఆరోగ్యాన్ని భ్రష్టు పట్టిస్తారు
మన మానాన మనని మనకుండాచేస్తారు ఆశలముగ్గులోకితోస్తారు
కరువులుకాటకాలు సునామీల ముంచేస్తారుఅనుక్షణంవంచిస్తారు
శాంతినీ ప్రశాంతినీ విశ్రాంతిని దోస్తారు నవ్వులుకాజేస్తారు
ఆనందమనేదాన్నిఅంతరి౦పజేస్తున్నారు మానవజాతినే కబలింపచూస్తున్నారు
ఎంతకాలం సాగుతాయీ వెర్రి పోకడలు
ప్రపంచమంతా విస్తుపోయే వింత ధోరణులు
కొనగలిగే చదువులు
కులమడిగే పదవులు
భ్రష్టుబట్టి పోయిన విద్యా వ్యవస్థలు
కులప్రాతిపదికతో మేధావుల అవస్థలు

 1.వికాసమెంతో వికసించినా,అవకాశాలే పరిహసించునా
విజ్ఞానఖనిగా సానబట్టినా పోటీలలో కాస్త చోటైన దొరుకునా
చిత్తశుద్ది నోచలేక వైద్య వృత్తివిద్య లేల
నైపుణ్యం నందలేని నిర్మాణ చతురతేల

2. రాజకీయ మాయవల్లొ చేపపిల్ల లైతె ఎలా
నాటకీయ నేతలల్లొ ఆటబొమ్మలైతె మేలా
ఇకనైనా పునాదులతొ మేడలనే కడదాం
జాతిని జాగృత పరచే పాటలనే పాడుదాం
"సమసమాజం"

కులమెంత వ్యాకులమీ దేశంలో     
మతమెంత మౌఢ్యమీ లోకంలో     
పునాదులే వదిలేసిన గాలిమేడలు
అనాదిగా చెలరేగిన చితిమంటలు

చేతనైన పనిచేయగ
నైపుణ్యం వంటబట్టి
ఒకే తత్వమున్న జనులు
పరస్పరం ఊతమిచ్చి
ప్రత్యేక వృత్తుల ప్రవృత్తితో
ఏర్పడ్డ తెగలను కులమంటే
పుట్టుకెలా ఔతుంది కారణం
మర్మమెరుగ లేకనే
కులాల సంకుల సమరం

తోచినటుల ధ్యానించగ
నచ్చినటుల స్ఫురించగ
ఏర్పడ్డ భావాలకు
ఏదోఒక రూపు నిచ్చి
అనుయాయులు నడయాడగ
అభిమతమే మతమంటే
ఆబోధలననుసరిస్తె చిక్కేలేదు
బలవంతపు మతమార్పుకు
ప్రలోభాల బారిన చిక్కేది లేదు


ప్రతిభ ఒక్కటే ప్రగతికి మెట్టు
ప్రజ్ఞ ఒక్కటే పురోగతి జట్టు
ఆసరా అందీయగ లేదెవరికి బెట్టు
పక్షపాత రీతులే యువతకి గొడ్డలిపెట్టు

1.అనాదిగా జరుగుతున్న అన్యాయం ఎండగట్టు
అసమాన పోకడలను ఆదిలోనె తుంచిపెట్టు
బడుగూ బలహీనులకు అడుగడుగున గొడుగుపట్టు
సహాయము సహకారము అందించగ పట్టుబట్టు
ఆసరా అందీయగ లేదెెవరికి బెట్టు
పాటవాలకే ఎపుడు పెద్దపీట పెట్టు

2.రాయితీలు ఆర్థికంగ అందజేస్తె మంచిదే
తాయిలాల చేయూతల చేరదీస్తె మానవతే
నిలువనీడ కల్పిస్తే సమ్మతమే జాతికి
కడుపునింపు పథకాలూ సంతసమే జగతికి
ఆదుకొనగ లేదెవరికి ఎదలో అసూయ
తెలివితేటలకెపుడూ పడకూడదు సవతి ఛాయ

https://youtu.be/OCgeEYGSQzc

మహిలోన మహిమాన్విత చరిత మహిళది
ఇలలోన కొలవలేని ఘనత ఇంతిది
త్యాగానికి రూపమై
ధైర్యానికి దీపమై
అడుగడుగున వెన్నంటి నడిపించే నేస్తమై
పదపదమున ఎదపంచి ప్రేమించే ప్రాణమై
మగవాడికి మనుగడ మగువ
పురుషుని పుణ్యఫలం పడతి

1.అమ్మగా ప్రేగు పంచి,కమ్మగా పాలుపంచి
కంటికిరెప్పలా భావించి,అనురాగాల పలికించి
సంతానమే తన సర్వస్వమని తలంచి తపించి పోతుంది తరుణి
తనయగా బాధ్యతమోసి,ఇంటికే కాంతులు పూసి
సంతోషాల జల్లుకురిసి,నవ్వులెన్నొవెదజల్లి
పుట్టినిల్లు సొంతమని సోదరులే సాంతమని
మురిసి మురిసి పోతుంది ముదిత

2.నారిని సారించి నరకాసురుసంహరించి
లోకాలచీకట్లకు దీపావళి వెలిగించి
తలమానికమయ్యింది నారీమణి సత్యభామ
యమరాజుకు ఎదురొడ్డి వాదనతో మెప్పించి
పట్టుదలకు ప్రతీకగా పతివ్రతల ప్రతినిధిగా
పతిప్రాణము సాధించిన ధీరవనిత సావిత్రి

3.ఎవరెస్టు నధిగమించి అఖాతాల నీదులాడి
రోదసీ సీమలలో పతాకాల నెగురవేసి
శాస్త్ర సాంకేతిక రంగాల ఖ్యాతినందె రమణి
 తనువులోన తను సగమై మగనికి తా జగమై
గృహిణిగా ఇంట గెలిచి,ప్రధానిగాను పాలించి
క్రీడల్లో సైతం తన సత్తా చాటుతోంది సుదతి
శ్రీ షిర్డీ పురసాయి-జయ జయ హే ద్వారక మాయి
సచ్చిదానంద రూప-సద్గురునాథ సాయి

1.చిరునవ్వుల శ్రీ సాయి-చింతలన్ని దీర్చు సాయి
వెన్నెల దృక్కుల సాయి-వెతలను పరిమార్చు సాయి
పిలిచినంత ఎదుట నిలిచె-పరమ దయాళువే సాయి
తలచినంత వరములిచ్చె-కల్పతరువు శ్రీ సాయి

2.ఊరు పేరు లేని సాయి- హృదయాల్లో ఉన్న సాయి
మహిమలెన్నొ చూపు సాయి-మహితాత్ముడు మన సాయి
శ్రద్ధా ఓరిమిలను రెండు ౠకలడుగు సాయి
యోగక్షేమాలను మెండుగ మన కొసగు సాయి
రెండు దేహాలు
పంచప్రాణాలు
ఒకటైన జీవితాలు
ఒకేలా ఇరువురి భావాలు

1.చిలుక వేరు గోరింకవేరు
వలపుకు అవి మారుపేరు
ఆరాధామాధవులు
ప్రేమకు పెట్టింది పేరు

అనురాగ రాగాలు
రసరమ్య యోగాలు
ఒకటైన జీవితాలు
ఒకేలా ఇరువురి భావాలు

2.కలవలేని నింగి నేలను
కలుస్తుంది వంపివానను
అందుకొనిన నేల సైతం
మురుస్తుంది పెంచి వనమును

అపురూప స్నేహాలు
అనుపమాన బంధాలు
ఒకటైన జీవితాలు
ఒకేలా ఇరువురి భావాలు
రాముడు అన్నా నువ్వే -కృష్ణుడు అన్నా నువ్వే
జీసస్ అన్నా నువ్వే మహమ్మద్ అన్నా నువ్వే
నువ్వొక్కడివే బాబా-జగమంతా నిండినావే
నువ్వొక్కడివే సాయీ- తనువంతా నిండినావే

1.అసాధ్యమన్నది సైతం- సాధ్యం చేసి చూపావు
మానలేనివైనా రోగాలను నయముగ చేసావు
నిన్ను నమ్ముకుంటే మాఅండదండగ నిలిచావు
నిన్ను వేడుకుంటే వెనువెంటనె వేడుక తీర్చావు

గణపతి అన్నా నువ్వే-మారుతి అన్నా నువ్వే
గురుదేవ దత్తుడవీవే-గురు గ్రంథసాహెబ్ నువ్వే
నువ్వొక్కడివే బాబా -బ్రతుకంతా నిండినావే
నువ్వొక్కడివే సాయీ-భవితంతా నిండినావే

2.సందేహాలనన్నీ - పటాపంచలే చేసావు
మాదేహాలనన్నీ-ప్రక్షాళన చేసేసావు
భవబంధాలకర్థం-సోదాహరణగ చూపావు
ఆత్మానందపు మార్గం-పరసాయమ్మని నువు చాటావు

మణికంఠుడు అన్నా నువ్వే-నరసింహుడు అన్నా నువ్వే
మహవీరుడు అన్నా నువ్వే-ఇల బుద్ధుడు అన్నా నువ్వే
నువ్వొక్కడివే బాబా- మనసంతా నిండినావే
నువ్వొక్కడివే సాయీ -తలపంతా నిండినావే
మంచిని తలచే ప్రతి ఉదయం శుభోదయం
ఆనందాలను పంచగలిగితే  బ్రతుకంతా నవోదయం

గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ - ఎవ్రీ మార్నింగ్ విల్ బి ఏ గుడ్ మార్నింగ్
ఆల్ ఈజ్ వెల్ అనుకొని సాగితె-
అనుక్షణం ఒక ఆసమ్ ఈవెంట్

1.పెదాల తూర్పున నవ్వుల సూర్యుడు విభవిస్తే -గుడ్ మార్నింగ్
వదన సరస్సున నేత్రకమలాలు వికసిస్తే-గుడ్ మార్నింగ్
గతముకు వగచక తక్షణ లక్ష్యం గుర్తిస్తే-గుడ్ మార్నింగ్
పొరపాటును ఒక  గుణపాఠంగా ముందడుగేస్తే-గుడ్ మార్నింగ్

2.వేకువ జామున నడకలు సాగితె-గుడ్ మార్నింగ్
చల్లని స్వచ్ఛపు గాలులు సోకితె-గుడ్ మార్నింగ్
పక్షుల కిలకిల రవములు వింటే-గుడ్ మార్నింగ్
కోయిల కూతలు స్వాగతమంటె-గుడ్ మార్నింగ్

3.ప్రియవచనమ్ముల మేలుకొలిపితే-గుడ్ మార్నింగ్
ఘుమఘుమ కాఫీ టీ ఆస్వాదిస్తే-గుడ్ మార్నింగ్
మనసగు మిత్రులు మనకెదురొస్తే-గుడ్ మార్నింగ్
కమ్మని కలలకు రూపమునిస్తే-గుడ్ మార్నింగ్

Sunday, April 9, 2017

గుండె కరిగి నీరైతే
కన్నుల్లో వరదలు
ఆశ చెరిగి బీడైతే
భవితల్లో మోడులు

1.లయతప్పితె పాటైనా
అడ్డదారి పడుతుంది
పదములు లింక తడబడితే
కవితైనా చెడుతుంది

2.అనుమానం చెదపడితే
ప్రేమ అంతరిస్తుంది
పరస్పరం వదిలేస్తే
మైత్రి మరుగు పడుతుంది

3. అనుభూతుల గుడికడితే
ఆహ్లాదం కొలువుంటుంది
అనుక్షణం ముడిపడితే
ఆనందం నర్తిసుంది

Friday, February 24, 2017

శివశివ అంటేనే-పరవశమౌతాడు-
మన వశమౌతాడు
హరహర అంటెచాలు-మొఱ వింటాడు-
మనకు వరమిస్తాడు

శివశివ శంభో-హరహరశంభో
హరహర శంభో- శివశివ శంభో

1.కరుణాసాగరుడు-గౌరీ మనోరుడు
పరమ దయాళువు-అమృత వరదుడు

తలపైన గంగమ్మ తారాడినా-
దోసెడు నీళ్ళకే తన్మయమొందు
చితాభూమిలో తా తిరుగాడినా
చిటికెడు విభూతికే మోదమునొందు

శివశివ శంభో హరహర శంభో
హరహర శంభో శివశివ శంభో

2.భక్తవ శంకరుడు-భక్త వశంకరుడు
భోలా శంకరుడు-భవబంధ నాశకుడు

పున్నెము నెరుగని కన్నిచ్చిన తిన్ననికి-
కైవస మైనాడు-కైవల్య మిచ్చాడు
అన్నెము నెరుగని మార్కండేయునికి-
మృతినెడబాపాడు- నిరతము నిచ్చాడు

శివశివ శంభో -హరహర శంభో
హరహర శంభో- శివశివ శంభో

https://www.4shared.com/mp3/azrpzDWxce/RAKI-SHIVA-SHIVA-SHAMBHO.html

Monday, February 6, 2017

నువ్వంటే ప్రాణం పెట్టే నాన్నే నేను 
నిను హాయిగ బజ్జోబెట్టే లాలి పాటే నేను
నీ ఒంట్లో ప్రవహించేప్రతినెత్తురు బొట్టే నేను
నీ గుండె చేసే సవ్వడి లబ్ డబ్ నేను

తడబడని నడకలు నేర్పిన ఊతము నేను
నీతపనలు పంచుకొనే హితుడను నేను
తప్పొప్పులు సరిదిద్దే నీ మద్దతు నేను 
తల ఎత్తుక తిరిగేలాపెంచిన పద్ధతి నేను

నిను లక్ష్యం వైపు నడిపే దిక్సూచే నేను 
నీవెన్నంటి గమ్యం చేర్చే గురువే నేను 
ఓటమిలో బాసట నిలిచిన ఆసరా నేను 
గెలుపున విశ్వాసం పెంచిన ఆశయమే నేను

Wednesday, January 25, 2017

వందనాలు అందుకో..
మా భరత మాత
నీకు సాటి లేరమ్మా
ఓ దివ్య చరిత

చ1.శృంఖలాలు త్రెంచుకొని
స్వాతంత్ర్యం పొందావు
కట్టుబాట్లు కూర్చుకొని
గణతంత్ర మందావు
 అనతికాలమందేనీవు
ప్రగతి బాట పట్టావు

చ2.భిన్నమైన ప్రజల మధ్యన
లౌకికతను సాధించావు
యుధ్ధనీతి రచియించి
శాంతి దూత వనిపించావు
అంతర్జాతీయంగా
మార్గదర్శివైనావు

చ3.గాంధేయ వాదంతో
విజయాల నలరించావు
అంబేడ్కర్ వేదంతో
జాతిని నడిపించావు
నరేంద్రమోడి తోడుగ
అర్థక్రాంతి వెదజల్లావు