Friday, February 24, 2017

శివశివ అంటేనే-పరవశమౌతాడు-
మన వశమౌతాడు
హరహర అంటెచాలు-మొఱ వింటాడు-
మనకు వరమిస్తాడు

శివశివ శంభో-హరహరశంభో
హరహర శంభో- శివశివ శంభో

1.కరుణాసాగరుడు-గౌరీ మనోరుడు
పరమ దయాళువు-అమృత వరదుడు

తలపైన గంగమ్మ తారాడినా-
దోసెడు నీళ్ళకే తన్మయమొందు
చితాభూమిలో తా తిరుగాడినా
చిటికెడు విభూతికే మోదమునొందు

శివశివ శంభో హరహర శంభో
హరహర శంభో శివశివ శంభో

2.భక్తవ శంకరుడు-భక్త వశంకరుడు
భోలా శంకరుడు-భవబంధ నాశకుడు

పున్నెము నెరుగని కన్నిచ్చిన తిన్ననికి-
కైవస మైనాడు-కైవల్య మిచ్చాడు
అన్నెము నెరుగని మార్కండేయునికి-
మృతినెడబాపాడు- నిరతము నిచ్చాడు

శివశివ శంభో -హరహర శంభో
హరహర శంభో- శివశివ శంభో

https://www.4shared.com/mp3/azrpzDWxce/RAKI-SHIVA-SHIVA-SHAMBHO.html

Monday, February 6, 2017

నువ్వంటే ప్రాణం పెట్టే నాన్నే నేను 
నిను హాయిగ బజ్జోబెట్టే లాలి పాటే నేను
నీ ఒంట్లో ప్రవహించేప్రతినెత్తురు బొట్టే నేను
నీ గుండె చేసే సవ్వడి లబ్ డబ్ నేను

తడబడని నడకలు నేర్పిన ఊతము నేను
నీతపనలు పంచుకొనే హితుడను నేను
తప్పొప్పులు సరిదిద్దే నీ మద్దతు నేను 
తల ఎత్తుక తిరిగేలాపెంచిన పద్ధతి నేను

నిను లక్ష్యం వైపు నడిపే దిక్సూచే నేను 
నీవెన్నంటి గమ్యం చేర్చే గురువే నేను 
ఓటమిలో బాసట నిలిచిన ఆసరా నేను 
గెలుపున విశ్వాసం పెంచిన ఆశయమే నేను