Friday, December 29, 2017

కవితా దినోత్సవ శుభాకాంక్షలతో

॥రాఖీ॥కవి సంగమం

కవి సంగమం-హృదయంగమం
బహుముఖ ప్రజ్ఞా పాటవ అపూర్వ మేళనం
కవితలపుల ఉదయించిన కవితల పుట్టిల్లు
భావుకతల చిరుజల్లు..అనుభూతుల హరివిల్లు

1.అక్షర శిల్పులు చెక్కిన రమ్య శిల్పారామం
పదపదమున ఎద కుదిపిన మానవతా ధామం
మల్లెలు మొల్లలు ముళ్ళున్న రోజాలు
పారిజాత మధూ’క ‘ వనాలు...మొగిలి పొదల ప’వనాలు
కవితలపుల ఉదయించిన కవితల పుట్టిల్లు
భావుకతల చిరుజల్లు..అనుభూతుల హరివిల్లు

2.మాటలు తూటాలుగ పేల్చే తుపాకులు
భావాలు బాంబులే సంధిచే శతఘ్నులు
గేయాలు గీతాలు నానీలు ఫెంటోలు హైకూలు
తీరైన కవితారీతులు తీరని కవిత్వ ఆర్తులు
కవితలపుల ఉదయించిన కవితల పుట్టిల్లు
భావుకతల చిరుజల్లు..అనుభూతుల హరివిల్లు

15/10/2017

("కవి సంగమం" ఒక ఫేస్ బుక్ గ్రూపు)
రాఖీ ॥"రమ్యస్మృతి"॥

నిదుర నేను పోదామంటే
ఎప్పుడు నువ్వొస్తావో
మెలకువగా ఉందామంటే
కలనైన కనిపిస్తావో

అశ్రు తర్పణం చేద్దామంటే
కనుల నుండి నువు జారేవో
హృదయ మర్పితం చేద్దామంటే
తెలియకుండ అది నిను చేరేనో

ఏమివ్వగలను నేను
ఏమవ్వగలను నేను
కవితయై నిన్నలరిస్తా
రమ్యస్మృతినై నీలొ నిలుస్తా

Tuesday, December 26, 2017

ముద్ద బంతి పూవు నీ మోముకు ముద్దు
ముద్ద మందారమంటి బుగ్గన ముద్దు
తేనెలూరు మోవికి చుంబనాల సేవ
ముద్దరాలి మేనంతా ముద్దుల వాన

పల్లవాల వంటి ఆ పాదాలకు ముద్దు
తమలపాకులాంటి నీ అరచేతికి ముద్దు
దృష్టిని మరలింపలేని నాభిపైన ముద్దు
స్రష్టయైన తట్టుకోని నడుము పైన ముద్దు

తేనెలూరు మోవికి చుంబనాల సేవ
ముద్దరాలి మేనంతా ముద్దుల వాన

శంఖమంటి కంఠానికి నులివెచ్చని ముద్దు
గగనమంటు జఘనానికి సుతిమెత్తని
ముద్దు చెవితమ్మెల యుగ్మానికి తమకమైన
ముద్దు
పరవశ హృదయానికి రసికతగల ముద్దు

తేనెలూరు మోవికి చుంబనాల సేవ
ముద్దరాలి మేనంతా ముద్దుల వాన

Monday, December 25, 2017


ఏడుకొండల మీద వెలిగి పోతున్న వేంకటేశ్వర స్వామి నీకు దండము
కొండగట్టు మీద కొలువు దీరి ఉన్న మాతండ్రి అంజన్న నీకు దండము
ఎములాడ రాజన్న భద్రాద్రి రామన్న దయగల్ల మాస్వామి దరంపూరి నర్సన్న నీకు దండము స్వామి నీకు దండము

1.విన్నమాటేగాని కన్నదెపుడూలేదు
మీరంత చేసిన మైమల గూర్చి
తీర్థాలుక్షేత్రాలు తిరుగుడేగాని తీరిన ముడుపుల చిట్టానే లేదు
మొక్కిన మొక్కులు లెక్కకు మిక్కిలి
ఎక్కిదిగిన గడపల కంతైతే లేదు

2.ఇచ్చేది చెప్పరు అడిగింది ఇవ్వరు
ఒంటికో ఇంటికో మంట బెడతరు
ఉన్నట్టు ఉంచరు ఊబిలోకి తోస్తరు
లబలబమనిమేము మొత్కోంగజూస్తరు
ఆటలాడందెమీకు పూట గడువదేమో
నటనలాపిమాకు నవ్వులందించరో
రచన&స్వరకల్పన:రాఖీ

ఎలా వ్యక్త పరుచాలో ఎరగనిదే ప్రేమా
ఎలా నిర్వచించాలో తెలియనిదే ప్రేమా

యుగయుగాలుగా ఎన్నో గాథలు విఫలమైనాయి ప్రేమనుదహరించలేక

తరతరాలుగా ఎన్నో రచనలు చతికిల పడినాయి
ప్రేమను వివరించ లేక

1.అమ్మ ప్రేగు పంచి ఇచ్చే అనురాగం ప్రేమ
నాన్న బ్రతుకు ధారబోసే వాత్సల్యం ప్రేమ
యువజంట మధ్య పుట్టే ప్రణయమే ప్రేమ
వార్ధక్యాన తోడుగ నిలిచే అనుబంధం ప్రేమ-బాంధవ్యం ప్రేమ

2.నేస్తాల నడుమన వెలిసే స్నేహమే ప్రేమ
అభిరుచుల ఎడల చూపే అభిమానం ప్రేమ
సోదరీసోదరులపైన కలిగియున్న మమతయే ప్రేమ
జీవరాశిపై మనిషికి ఉన్న కారుణ్యమే ప్రేమ-మానవత్వమే ప్రేమ

3.కనులుకనులతో కలుపుతు చేసే సైగల్లో ప్రేమ
నుదుటిపై పెదవులు రాసే కైతల్లొ ప్రేమ
చేతిలో చేయితొనొక్కే కరస్పర్శయే ప్రేమ
అలయ్  బలయ్ ఆలింగనమే అంతులేని ప్రేమ-ఆత్మగతమే ప్రేమ

Friday, December 22, 2017

మమతల కోవెల మాఇల్లు
అమ్మానాన్నలె.దేవుళ్ళు
మా ఇంటకురిసేను నవ్వుల వెన్నెల జల్లు
ప్రతిపూట విరిసేను సంబురాల హరివిల్లు

1.బంధుమిత్రులకు ఆతిథ్యాలే మాకు తిరునాళ్ళు
ఆటపాటలతొ ఆనందాలే గోదారిలాగా పరవళ్ళు
పచ్చదనాల పలుమొక్కలతో కళకళలాడును మాలోగిళ్ళు
స్వఛ్ఛదనాల పరిసరాలే ఆహ్లాదానికి ఆనవాళ్ళు

2.నోరూరించే కమ్మని రుచులకు కార్ఖానాయే మావంటిల్లు
వరుసపంక్తుల్లొ వడ్డించె భోజనాల మా నడిమిల్లు
చల్లనివెన్నెల కాలవాలము మలయసమీరపు మాడువిల్లు
సరససల్లాపముల సేదదీరగా శాంతినొసగమా పడకటిల్లు

3.తాతా బామ్మా మందలింపులతొ ఇంపైనది
అరమరికలెరగని అమ్మానాన్నల మనసైనది
అన్నదమ్ము లేరాళ్ళు కలివిడిగా అలరారునది
ఉమ్మడికుటుంబమంటే ఉదాహరణగా విలసిల్లునది

Wednesday, December 20, 2017

అమ్మతోనె జగతిరా
పలుకు తోనె ప్రగతిరా
అమ్మ భాషతోనె మనిషి భవితరా
కమ్మని మన తెలుగె బ్రతుకు బాటరా

1.ఉగ్గుపాలతోనె పద్యాలు నేర్వాలి
అమ్మలాలి పాటలో గేయలయను పట్టాలి
బామ్మ ఒడిలొ బజ్జుని భాగవతం వినాలి
తాతయ్యే తలనిమరగ
నీతికథలు గ్రోలాలి

అమ్మభాషతోనె మనిషి మనుగడరా
కమ్మని మనతెలుగె చెఱకు గడరా

2.చందమామ కన్ననీవు
చందస్సుని కనరా
అందచందాలకన్న
అలంకార శాస్త్రమెరుగర
పలకబలపం పట్టే సరికే
వ్యాకరణం నేర్వర
తొలి బడి వయసులోనె
పలుకుబడులు గ్రహించర

అమ్మభాష నెపుడు యాది మరువకురా
కమ్మని మనతెలుగె పాలమీగడరా

3.పాఠశాల స్థాయిలోనె
భాష పట్టు సాధించర
యవ్వన తొలినాళ్ళలోనె
కవనము చిలికించరా
పూర్వకవుల గ్రంథాలు
ఆపోశన పట్టరా
అవధానం,శతక రచన
ఆకళింపు చేకొనరా

అమ్మభాష అంతులేని సంపదరా
కమ్మని మన తెలుగును
కలలోను పొగడరా

Wednesday, December 13, 2017

కూతవేటు దూరం-బంగారు తెలంగాణా అన్న స్వప్నం
చరితే పునరావృతం-రామరాజ్యం ఇక అనుభవైకవేద్యం

రైతేరాజై
బడుగు ప్రగతి తొలి అడుగై
సర్వతోముఖవికాసం
తెలంగాణ ప్రజలకు తరగని దరహాసం


1. సింగాలను లొంగదీయు శాతవాహన శౌర్యం
 కోటిలింగాల రాజధాని బోలు పునర్వైభవం
 కాకతీయ కదన మదన కళాప్రాభవం
కులీకుత్బుషాషి నవాబ్ జనసమైక్య జీవనం


 కలలిక సాకారం-కళలకు సత్కారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత ప్రాధాన్యతా క్రమం


 2.ఆడపడుచు పురిటిికి కేసియార్ కిట్టు,
కన్నపిల్లపెళ్ళికి కల్యాణలక్ష్మి గిఫ్టు
అసరాకరువైన అతివలకు ఒసిగె భృతి
అన్నివర్గాల జనుల నాదుకొనే ధర్మనిరతి


పచ్చదనం పరిశుభ్రత ప్రజల వంతు
ప్రగతి రథంనడిపించుట ప్రభుతవంతు


3.నిరంతరం విద్యుత్తు ఉద్యోగుల శ్రేయస్సు
ఉద్యోగకల్పనతో యువత భవిత ఉషస్సు
టి ఎస్సై పాస్ తొ పరిశ్రమస్థాపన భేషు
స్త్రీకి షీ టీం కవచం మేలైన పోలీస్ బలం


ఆసరా పింఛన్లు డబల్ బెడ్రూమిళ్ళు
బడుగుల బతుకుల్లో బంగారు వరాలజల్లు


 4.కోటిఎకర చెలకలకు నీటి వనరు సహకారం
వ్యవసాయ ఖర్చులకు ఎనిమిదివేల ధనసాయం
కాకతీయ భగీరథ పథకాల ఫలసాయం
పంటపొలం ,తాగుజలం కరువెరుగని వైనం


మాటనిలుపుకున్నతీరు కమనీయం
మనసుగెలుచుకున్న రీతి మహనీయం
నీ సహవాసం మధుమాసం
నీ సహచర్యం రసమాధుర్యం
నీ సహయోగం కుసుమ పరాగం
నీ సహ జీవనం నందనవనము

1.నీ తలపే నిదురకు వెరపే
నీ ఊహే చెఱకుకన్న తీపే
నీపలుకే మురళికి ముప్పే
నీ నవ్వే వెన్నెల కుప్పే

2.నీతో పయనం దిగంతాలకే
నీతో ప్రణయం ప్రబంధాలకే
నీ పరిష్వంగం రసజగాలకే
నీ చుంబనమైకం రమ్యలోకాలకే
ధర్మపురీ ,శ్రీ లక్ష్మీ నరసింహుని దివ్య క్షేత్రము
ధర్మపురీ,గోదావరి ప్రవహించే పుణ్య తీర్థము
కర్మలు నశియింప జేయు సన్నిధానము
జన్మను తరియి౦పజేయు ముక్తి ధామము

1.దక్షిణ వాహిని గా అలరారే గోదావరి ఒక వరము
 దక్షిణ కాశీ గా వాసికెక్కి యున్నదీ ఈ పురము
 దక్షిణ దిక్పతి నెలకొని యున్న స్థలము
 దక్షిణ భారతాన ప్రసిద్ధ యాత్రాస్థలము 

2.వేదాలకు నెలవైన విప్రవరుల  నిలయము
సంస్కృతీ సనాతన సంప్రదాయ సహితము
సంస్కృతము జ్యోతిష్యము సమకూరి యున్నది
సంగీతము సాహిత్యము సకల కళల పెన్నిధి

3.శివకేశవులభేదమైన హరిహరక్షేత్రము
పరమత హితమెరిగిన మహిత స్థావరం
నిత్యమూ భక్తులతో అలరారే జనపదము
ప్రతిరోజు పండగనే తలపించే ఒకజగము

కన్నె స్వామిని కావాలనుంది
నాకు మళ్ళీ ఒకసారి
తీర్చి దిద్దుకోవాలని ఉంది
గాడి తప్పిన బ్రతుకు దారి
ఎంతో తెలుసను అహము నుండి
ఏమీ తెలియని నిజము వరకు
చేరుకోవాలని ఉంది
మారిపోవాలని ఉంది

1.నియమాలంటే నిర్లిప్తమై
దీక్షపట్ల శ్రద్ధ నిర్లక్ష్యమై
కప్పదాటులె వేసుకుంటు
అనుకూలంగా మలచుకుంటూ
కొత్త భాష్యాలే చెప్పుకుంటూ
వక్రమార్గాలే ఎన్నుకుంటు
భ్రష్టుపట్టి పోయినాను స్వామి
దృష్టి తప్పి తిరిగినాను స్వామీ

2.వేడినీటి తో స్నానాలు
వేళతప్పి పడక శయనాలు
నోటరాని శరణుఘోషలు
గురుస్వామి మినహాయింపులు
నిష్ఠ లేక ఇష్టా రాజ్యాలు
వదలలేని జిహ్వచాపల్యాలు
నియతిలేని వాగ్వాదాలు
నియంత్రణలేని ఇంద్రియాలు
విలాసమయ్యింది నీ దీక్ష
శరణు శరణు స్వామి నీవే రక్ష

https://youtu.be/iRGTHuY5IZQ?si=4UIaom1810-fViKt


నీ నవ్వులో విచ్చుకున్న పారిజాతాలు
నీ చూపులో గుచ్చుకున్న వసంతాలు
నీ చేరువలో మలయమారుతాలు
నీ తలపులలో ఆహ్లాద జలపాతాలు

1.నీ సుందర వదనం ఉదయ సూర్య బింబం
నీ చందన దేహం నిశి శశి చందం
చేజారిన మణిపూసవు ఈ నాటికి
పదిల పరుచుకుంటా అనుభూతులు ఏనాటికి

2.నా కొరకై దిగి వచ్చిన దేవత నీవు
నాకిలలో వరమిచ్చే విధాతవు నీవు
నీ సహవాసం ప్రతిరోజు మధుమాసం
నీ దరహాసం అపురూప బహుమానం

3.మనం కలుసుకున్న ప్రతిక్షణం మరువం
మన కలల నందనం మరులు రేపు దవనం
వచ్చేజన్మ లోనూ పెనవేయనీ మన బంధం
ఊహకూ హాయి గొలుపు మన సహజీవనం

చూస్తూ ఉండి పోనీ
నీ కళ్ళ లోగిళ్ళ లోకి
నే రెప్పలే గిలపకుండా,
శిలలా మారిపోనీ
నీ ఎదుట  నా గుండె సైతం
కొట్టుకోకుండా

కాలాలు కరిగిపోనీ
ఋతువులే జరిగిపోనీ 
సృష్టియూ స్రష్టయూ
నిర్వీర్యులవనీ

1.స్నేహానికే కొత్త అర్థాలు చెబుదాం
ప్రణయానికే వింత భాష్యాలు రాద్దాం
కలవలేనీ ప్రేమ కథలు మనవి
కలలయందైన కలవ మనవి
చూపులే చుంబనాలై
పలుకులే ఆలింగనాలై
సగము సగమై సంగమిద్దాం
సరస జగమై పరవశిద్దాం

2.అనురాగ రాగాలు ఆలపిద్దాం
హృదయాల లయలోన అడుగులేద్దాం
విరహాలు దరిరాని అనుబంధము
కలతలే కనరాని
సహయోగము
మనసులే మరులు రేప
మమతలే దారి చూప
స్వర్గ ద్వారాల తలుపు తడదాం
స్వప్నలోకాన కాలు పెడదాం
శిథిలమైన శిల్పాన్ని తిరిగి చెక్కుతున్నా..
భిన్నమైన ప్రతిమకు ప్రాణప్రతిష్ట చేస్తున్నా
పాడుబడ్డ గుండెనే గుడిగాచేస్తున్నా
మనసు లేని దేవతకే మరీమరీ మొక్కుతున్నా

1.వరములేవి అడుగకున్నా కరుణ మానెనెందుకో
పూజలెన్ని చేస్తున్నా లెక్కచేయదెందుకో
దోషమేదొ ఎరిగింపక చింతపెంచె నెందుకో
ఊపిరాడలేకున్నా వింతగ చూసెనెందుకో

2.బాధపంచుకుంటె చాలు భాగ్యమునందించినట్టె
క్రీగంట చూస్తెచాలు దయామృతం చిలికినట్టె
చిరునవ్వితేనె చాలు వెన్నెల వర్షించినట్టె
స్నేహంగా ఉంటెచాలు బ్రతుకు బాగుచేసినట్టె
ప్రపంచ తెలుగు మహాసభలు-2017 పురస్సరంగా
"నా తెలఁగానం"
యుగయగాల వెలుగులీనె మన తెలుగు
దిగంతాల కీర్తి మించె మనతెలుగు
తెలంగాణ 'తెలుగు' పురిటి గడ్డ
తెలంగాణ పలుకు అప్యాయత అడ్డా

1.పాల్కుర్కిసోమన్న ప్రణీత ద్విపదగా ఆద్యమై
పనిపాటల పల్లె జానపదముగా హృద్యమై
తెలంగాణ నుడికారపు మమకారమై
కోనసీమ వెటకారపు వ్యవహారమై
రాయలసీమ మాండలీక మణిహారమై
కళింగాంధ్ర పదగతి  ప్రాకారమై

మాధుర్యం చిలుకుతుంది మన భాష
ఆంతర్యం ఒలుకుతుంది మనభాష

2.వేమన బద్దెనల నీతిశతక బోధకమై
పోతన్న గోపన్నల భక్తిభావ సాధకమై
దాశరథీ వరదన్నల వాణీ పద మంజీర నాదమై
కాళోజీ సినారెల ఆధునిక వచన గీత వేదమై
హృద్య పద్య ప్రసిద్ధగా లోకామోదమై
సహజసిద్ధ భావనాయుత ఆహ్లాదమై

ప్రభలు చిమ్మె తెలంగాణ తెలుగు తేజమై
సుధలు కురిసె తెలంగాణ విశ్వ విరాజమై

3.అజంతా సుందరిగా అరుదైన పదాకృతి
ముత్యాల దస్తూరిగ తీరైన వర్ణ లిపి
జగతిలోన ఏ సాహితి నోచని పద్య సంస్కృతి
ప్రభుత కొలువందు కొలువొంద మనస్కృతి
అధికార భాషగా ఆదరించమని వినతి
తెలుగువారు మాతృభాష మన్నింపగ ప్రణతి
ఇటలిభాష 'పడమటి తెలుగని'పొందగ ఖ్యాతి
పాడుకోవాలి జనమంతా మక్కువతో తెలుగుగీతి
చెరగనీకు పెదవులపై
చంద్రవంక చిరునగవు
చేయబోకు ఎడదనెపుడు
వెతలకింక తావు

ఆటుపోట్ల తాకిడికి
వెరవబోదు రేవు
కలతలు కన్నీళ్ళు
కలకాలం మనలేవు

1.ఎండకైన వానకైన
కొండ చెక్కుచెదరదు
తనగొంతు ఎండినా
ఎడారింక బెదరదు

రేయైనా పగలైనా
నదీ నడక నాపదు
ఋతువులెన్ని మారినా
చెట్టు ఎపుడు జడవదు

2.బతుకు చిటికెడైనగాని
బుడగకింక పంచదా
తలకుమించు బరువైనా
చీమకు తలవంచదా

గెలుపు ఎంత గొప్పదైన
మోడి(పట్టదల)ముందు ఓడదా
ప్రేమ తో జతకడితే
హాయివంత పాడదా
ఇంతకన్న ఇంకేమి చేయగలవు
పూవులాంటి జీవితాన్ని చిదిమేయ గలవు
ఇంతకన్న ఇంకేమి చేయగలవు
కడివెడు పాలల్లో ఉప్పురవ్వ వేయగలవు
ఇంతకన్న ఇంతకన్న ఇంతకన్నా
ఇంతకన్న ఇంకేమి చేయగలవు

1.ఆశల సౌధాల నెన్నొ కూలద్రోయగలవు
నడికడలిన బ్రతుకు నావ ముంచగలవు
పచ్చనైన కాపురాన చిచ్చు రేపగలవు
చేతికందు పంటనంత
బుగ్గిపాలు చేయగలవు
ఇంతకన్న ఇంతకన్న ఇంకన్న ఇంకేమి చేయగలవు
విధివిలాసమంటు వింత
తత్వబోధ చేయగలవు

2.నాటుకున్న మొక్కనైన పెకలించి వేయగలవు
ముక్కుపచ్చలారకున్నా
పీకలు నులిమేయగలవు
బంగారు భవితనంత
గంగపాలు చేయగలవు
అందమైన దేహాన్ని
అవకరంగ మార్చగలవు
ఇంతకన్న ఇంతకన్న ఇంతకన్న
ఇంకేమి చేయగలవు
కర్మ సిద్ధాంతమంటు గీతబోధ
చేయగలవు
రచన:
RAMKISHAN RAKI GOLLAPELLI

చిలకా గోరింక
చెరిసగమైనాయి
కలువ నెలవంక
ఒక జగమైనాయి
గత జన్మల ప్రణయాల గురుతుగా
దివిన జరుగు పరిణయాల
ఋజువుగా

1.మనసులు ఏకమైన మనువుగా
తపనలు కలగలిసిన తనువుగా
అర్థవంతమైన బంధాన అడుగిడగా
అర్ధనారీశ్వరమైన మనుగడగా

సాగిపోతుంది జీవితం
కలలే సాకారమై
విలసిల్లుతుంది కాపురం
మమతల ప్రాకారమై

 2.ఒడుదుడుకుల జడివానల నధిగమించి
చిరుచిరు కలహాలనే విరమించి
ఒకరి కొరకు ఒకరనే ఎప్పుడూ తలంచి
ఎదుటివారి సలహా శిరసా వహించి

ఆదర్శవంతమై నిలవాలి దాంపత్యం
పిల్లాపాపల నవ్వులు పూయాలి ప్రతినిత్యం
బ్రతుకీయగ చేతగాని శివశంకరా
చంపేయగనైనా సంకోచమేలరా
క్షణక్షణం భరియించెడి యాతనకన్నా
తీక్షణ మైనదా ఏరౌరవ నరకమైన

1.తోటలేల పెంచేవు
జిల్లేళ్ళూ నాగజెముళ్ళతో
బాటలేల వేసేవు
సమాధులూ చితులతో

ఇస్తే ఆనంద మీయి
బెదిరిస్తే భవిత బాగుచెయ్యి

2.మందే లేని రోగాలను
అప్పనంగ ఇచ్చేవు
తాళలేని వేదనలను
తలకు అంటగట్టేవు

ఇస్తే కాస్త అమృతమీయి
 దారుణ విషమైనా దయచేయి

3.నీ తావే సదాశివా శ్మశానవాటికా
నీ కడ గరళం
పుష్కలమేగా

దరి జేర్చుకో బిరబిరగా
మరుజన్మయే లేనట్లుగా
రచన:రాఖీ -రాధికలా...!

రాధనే నేనూ..ఆరాధనే నేను
విచ్చిన కలువను(నిను) ఎచటని కలువను
నామది యే బృందావనిగా,
నా పెదవే పిల్లనగ్రోవిగ
కలవని భావించి నే వేచితిని
రాగలవని నేనెంచి నిను నోచితిని

1.వేలగోపికల కలవేనీవు
వలపులతోనే వలవేసెదవు
మురళిని మ్రోయించి మత్తులోముంచేవు
చిత్తమునేమార్చి గమ్మత్తులు చేసేవు
కలవని భావించి నిను పిలిచితిని
కలయని తోచగ చింతించితిని

2.అష్ట భార్యల ఇష్టసఖుడవే
స్పష్టతలేదా నన్నలరించగ
కుబ్జయుతరించె నీ పదాబ్జమున
మీరా రమించె నిను తనమనమున
కలవని భావించి నిను తలచితిని
కలవరించినేనిల శిలనైతిని