Wednesday, December 13, 2017

బ్రతుకీయగ చేతగాని శివశంకరా
చంపేయగనైనా సంకోచమేలరా
క్షణక్షణం భరియించెడి యాతనకన్నా
తీక్షణ మైనదా ఏరౌరవ నరకమైన

1.తోటలేల పెంచేవు
జిల్లేళ్ళూ నాగజెముళ్ళతో
బాటలేల వేసేవు
సమాధులూ చితులతో

ఇస్తే ఆనంద మీయి
బెదిరిస్తే భవిత బాగుచెయ్యి

2.మందే లేని రోగాలను
అప్పనంగ ఇచ్చేవు
తాళలేని వేదనలను
తలకు అంటగట్టేవు

ఇస్తే కాస్త అమృతమీయి
 దారుణ విషమైనా దయచేయి

3.నీ తావే సదాశివా శ్మశానవాటికా
నీ కడ గరళం
పుష్కలమేగా

దరి జేర్చుకో బిరబిరగా
మరుజన్మయే లేనట్లుగా

No comments: