Wednesday, December 13, 2017


కన్నె స్వామిని కావాలనుంది
నాకు మళ్ళీ ఒకసారి
తీర్చి దిద్దుకోవాలని ఉంది
గాడి తప్పిన బ్రతుకు దారి
ఎంతో తెలుసను అహము నుండి
ఏమీ తెలియని నిజము వరకు
చేరుకోవాలని ఉంది
మారిపోవాలని ఉంది

1.నియమాలంటే నిర్లిప్తమై
దీక్షపట్ల శ్రద్ధ నిర్లక్ష్యమై
కప్పదాటులె వేసుకుంటు
అనుకూలంగా మలచుకుంటూ
కొత్త భాష్యాలే చెప్పుకుంటూ
వక్రమార్గాలే ఎన్నుకుంటు
భ్రష్టుపట్టి పోయినాను స్వామి
దృష్టి తప్పి తిరిగినాను స్వామీ

2.వేడినీటి తో స్నానాలు
వేళతప్పి పడక శయనాలు
నోటరాని శరణుఘోషలు
గురుస్వామి మినహాయింపులు
నిష్ఠ లేక ఇష్టా రాజ్యాలు
వదలలేని జిహ్వచాపల్యాలు
నియతిలేని వాగ్వాదాలు
నియంత్రణలేని ఇంద్రియాలు
విలాసమయ్యింది నీ దీక్ష
శరణు శరణు స్వామి నీవే రక్ష

No comments: