Wednesday, December 13, 2017

ప్రపంచ తెలుగు మహాసభలు-2017 పురస్సరంగా
"నా తెలఁగానం"
యుగయగాల వెలుగులీనె మన తెలుగు
దిగంతాల కీర్తి మించె మనతెలుగు
తెలంగాణ 'తెలుగు' పురిటి గడ్డ
తెలంగాణ పలుకు అప్యాయత అడ్డా

1.పాల్కుర్కిసోమన్న ప్రణీత ద్విపదగా ఆద్యమై
పనిపాటల పల్లె జానపదముగా హృద్యమై
తెలంగాణ నుడికారపు మమకారమై
కోనసీమ వెటకారపు వ్యవహారమై
రాయలసీమ మాండలీక మణిహారమై
కళింగాంధ్ర పదగతి  ప్రాకారమై

మాధుర్యం చిలుకుతుంది మన భాష
ఆంతర్యం ఒలుకుతుంది మనభాష

2.వేమన బద్దెనల నీతిశతక బోధకమై
పోతన్న గోపన్నల భక్తిభావ సాధకమై
దాశరథీ వరదన్నల వాణీ పద మంజీర నాదమై
కాళోజీ సినారెల ఆధునిక వచన గీత వేదమై
హృద్య పద్య ప్రసిద్ధగా లోకామోదమై
సహజసిద్ధ భావనాయుత ఆహ్లాదమై

ప్రభలు చిమ్మె తెలంగాణ తెలుగు తేజమై
సుధలు కురిసె తెలంగాణ విశ్వ విరాజమై

3.అజంతా సుందరిగా అరుదైన పదాకృతి
ముత్యాల దస్తూరిగ తీరైన వర్ణ లిపి
జగతిలోన ఏ సాహితి నోచని పద్య సంస్కృతి
ప్రభుత కొలువందు కొలువొంద మనస్కృతి
అధికార భాషగా ఆదరించమని వినతి
తెలుగువారు మాతృభాష మన్నింపగ ప్రణతి
ఇటలిభాష 'పడమటి తెలుగని'పొందగ ఖ్యాతి
పాడుకోవాలి జనమంతా మక్కువతో తెలుగుగీతి

No comments: