Friday, February 24, 2017

శివశివ అంటేనే-పరవశమౌతాడు-
మన వశమౌతాడు
హరహర అంటెచాలు-మొఱ వింటాడు-
మనకు వరమిస్తాడు

శివశివ శంభో-హరహరశంభో
హరహర శంభో- శివశివ శంభో

1.కరుణాసాగరుడు-గౌరీ మనోరుడు
పరమ దయాళువు-అమృత వరదుడు

తలపైన గంగమ్మ తారాడినా-
దోసెడు నీళ్ళకే తన్మయమొందు
చితాభూమిలో తా తిరుగాడినా
చిటికెడు విభూతికే మోదమునొందు

శివశివ శంభో హరహర శంభో
హరహర శంభో శివశివ శంభో

2.భక్తవ శంకరుడు-భక్త వశంకరుడు
భోలా శంకరుడు-భవబంధ నాశకుడు

పున్నెము నెరుగని కన్నిచ్చిన తిన్ననికి-
కైవస మైనాడు-కైవల్య మిచ్చాడు
అన్నెము నెరుగని మార్కండేయునికి-
మృతినెడబాపాడు- నిరతము నిచ్చాడు

శివశివ శంభో -హరహర శంభో
హరహర శంభో- శివశివ శంభో

https://www.4shared.com/mp3/azrpzDWxce/RAKI-SHIVA-SHIVA-SHAMBHO.html