Tuesday, May 8, 2018

కొత్త పాట రాస్తున్నా
ప్రగతి బాట వేస్తున్నా
ఆనందం ఆవరించినా
లోకమొకటి నిర్మిస్తున్నా

1.దుఃఖాలకు దురాశ మూలం
యుద్ధాలకు అహమే ఆలవాలం
కాముకతకు గోప్యత హేతువు
పాశవికత ఆవేశపు ధాతువు

ఎదుటివారి స్థితి మతినిడితే
అరమరికలకు తావే ఉండదు
ఒక్క క్షణం యోచించ గలిగితే
ఆత్మహత్యలకు అయిపే ఉండదు

విలువనెరిగి మసలుకో జీవితం అమూల్యమే
అనుభూతులు దాచుకో గతం రమ్యకావ్యమే

2.సమాచార అంతరం
విపత్తులకు ఆస్కారం
నిర్లక్ష్య విధి నిర్వహణం
స్వీయ మరణ శాసనం

పనిలొ మజా అలవడితే
వినోదమే రోజంతా
సమయపాలనతోనే
ఆహ్లాదం నీ పంథా

శ్రద్ధ వల్లనే నీకు కార్యసిద్ధి అవుతుంది
మొక్కవొని నీయత్నం గెలుపు కాన్క నిస్తుంది

No comments: