Tuesday, May 1, 2018

నమ్మికదా చెడినాను నారసింహా-ధర్మపురీ నారసింహా
నీ మాయలొ పడినాను ఓ పరబ్రహ్మా- ఓ పరబ్రహ్మా

తప్పునీది కానే కాదు నారసింహా
ఏ దేవుడు లేడయ్యా నీ తరహా

1.ఎంత అలసి పోయావో
ఎంత విసిగి పోయావో
చేత కాక కూర్చున్నావో
చేష్టలుడిగి చూస్తున్నావో
నన్ను ఒడ్డు చేర్చలేక నారసింహా
నాకు దారి చూపలేక నారసింహా
తప్పు నీది కానే కాదు నారసింహా
నాకు దిక్కు వేరే లేరు ఒక్క నీవు మినహా

2.అంతట నువ్వున్నావంటూ
వింతమాటలెన్నో విన్నా
ఆర్తుల పాలించెదవంటూ
భక్తినెంతొ పెంచుకున్నా
పుక్కిటి పురాణమేనా ప్రహ్లాదుని కాచింది
కాకమ్మ కథయేనా శేషప్పను బ్రోచింది
తప్పునీది కానేకాదు నారసింహా
గొప్పగ నిను భావించడమే నాఖర్మ
 https://www.4shared.com/s/fFIohPi0jee