Thursday, May 24, 2018

కొత్తగాకోరుకునేదేదిలేదురా
ఉన్నదాన్ని గుంజుకోకపోతె చాలురా
షిరిడీ సాయినాథా షిరిడీ సాయినాథా
నీవెరుగనిదా నా దీనగాథ
నీవున్నా ఔతానా నేననాథా

1.బంధాలు బంధనాలు అనుబంధాలు
సన్యాసివైనా గానీ నీ కనుభవాలు
తాత్యాకు మామవై తల్లడిల్లి నావు
భక్తుల బాగుకొరకు  దిగులుచెందినావు
మహల్సాపతితోని మంతనాలు చేసినావు
యోగిరాజు వైననీకె  మోహపాశముందంటే
మామూలు పామరుణ్ణి మాయకు లోబడనా

2.ఏమి బావుకున్నాని నాకింతటి యాతనా
రాజభోగా లేవొనాకు తేరగ ఇచ్చావనా
ఆనందం దోచుకుంటె అదీఓ పరీక్షనా
మనసారా నమ్మినందు కింతవింత శిక్షనా
కరుణాసాగరం కదా సాయి నీహృదయం
కాసింత దయజూస్తే తరిగేనా సంద్రము
ఉత్తుత్తి పుకార్లేనా నీ మహిమలు లీలలు
నీ కంట కన్నీరు ఊరనీకు
పెదవెంట చిరునవ్వు చెరగనీకు
సడలని విశ్వాసమే నీశ్వాసగా
చెదరని సంకల్పమే చేయూతగా
జారిపోనీకు నీ గుండె ధైర్యం
సాగుతూ చేరుకో నీ బ్రతుకు లక్ష్యం

1.ఏ గాలి వానకో ఏ డేగ దాడికో
చెదిరినా తనగూడు బెదరేదేనాడు గిజిగాడు
ఒక్కొక్కపుల్లగా గూటి నోర్మితో నిర్మించి
మనుగడను సాగించదా సంతతిని పోషించదా

పట్టుజారుట మానవ సహజము
పట్టుదలతో చేరుకోవాలి గమ్యము

2.తీరొక్క పూవులో తీయనీ తేనెలే
తీయగా దాయగా తుట్టెనే పెట్టవా తేటీగలు
పొగమంటపెట్టినా నిధికొల్లగొట్టినా
వెంటాడికుట్టవా పగబట్టుతూ
ఆనందమొందవా కూడబెట్టుతూ

కోల్పోయినా గాని రాజ్యాధికారం
మరలసాధించుటే మహరాజు ధ్యేయం