Friday, July 24, 2009

అక్కడ జూసిన అయ్యప్పా-ఇక్కడజూసిన అయ్యప్పా 
అక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ-ఎక్కడ జూసిన అయ్యప్పా
 స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా

 1. ఇంట్లోజూసిన అయ్యప్పా-బయట జూసినా అయ్యప్పా మేడలొమిద్దెలొగుడిలో గుడిసెలో -అక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ జూసిన అయ్యప్పా- స్వామి శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా 

2. స్కూటరు మీద అయ్యప్పా-మోటరులోన అయ్యప్పా
 రైలు సైకిలు బస్సులొ బండిలొ--అక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ జూసిన అయ్యప్పా- స్వామి శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా 

3. గూడెం గుట్టన అయ్యప్పా-గుండెల మాటున అయ్యప్పా నీలోనాలో శబరీ గిరిలో-అక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ జూసిన అయ్యప్పా- స్వామి శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా 

4. కన్నెస్వామిలో అయ్యప్పా-కత్తి స్వామిలో అయ్యప్పా గంటస్వామిలో గదాస్వామిలో-గురుస్వామిలో ఎక్కడ ఎక్కడ ఎక్కడ జూసిన అయ్యప్పా- స్వామి శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా

 5. మాసపూజకు అయ్యప్పా-విశుపూజకు అయ్యప్పా మండల పూజకు అయ్యప్పా-మకరజ్యోతికి అయ్యప్పా ఎక్కడ జూసిన అయ్యప్పా- స్వామి శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా

 6. పాడే స్వామి అయ్యప్పా-పలికేస్వామి అయ్యప్పా భజనలు చేసేది అయ్యప్పా-తన్మయమొందేది అయ్యప్పా ఎక్కడ జూసిన అయ్యప్పా- స్వామి శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా-శరణం శరణం అయ్యప్పా

No comments: