Monday, March 6, 2023

 https://youtu.be/6Kd738FTCv8


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:షణ్ముఖ ప్రియ


మంగళాకార సర్వ మంగళ కరా

మంగళ గ్రహదోష నివారా శ్రీకరా

మంగళవార విశిష్ట ఆరాధనాప్రియా

నమోస్తు నరహరే హిరణ్యకశిపు శమనాయా


1.గోదావరి నదీతీర విరాజమానాయా

ధర్మపురీ అగ్రహార నిజ సంస్థితాయా

సత్యవతి సర్పపతి శాప విమోచనాయా

సర్వదేవ నిత్యార్చితా నిరంజనాయా


1.సృష్టికర్తా సమవర్తీ నిరత సేవితాయా

శ్రీలక్ష్మీ సహిత మహాహిమాన్వితాయా

శ్రీరామలింగేశు అనుంగు స్నేహితాయా

ప్రహ్లాద శేషాచలదాసాది భక్త హితాయా

 https://youtu.be/hpRSxit-c44


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఉన్నటట్టుంటం ఊడిపోతం

పన్నట్టుంటం పైకిపోతం

అరెరే గట్లెట్లాయే అంటడొకడు

నిన్నమంచిగుండె గాదె అంటూ ఒకడు

నిమిషాలు పట్డవాయే పానాలుపోవడానికి

కడసూపేదొ తెల్వదాయే పోయినంతసేపుకి


1.గట్లుండె మంచోడు అంటడొకడు

మంచంబట్టి జీవునం బాయె అంటడొకడు

మస్తుసంపాయిచె నంటడొకడు

ఉన్నదంత ఊడ్చిండు అంటడొకడు

ఉత్తసేతుల్తోటె గాదె ఎంతకూడ బెట్టినా

పిట్టకూడు తినుడెగాదె ఎంతదోచి మెక్కినా


2.ఆనికేం మారాజు సచ్చి బత్కెనంటరు

బతికుండి బావుకున్నదేంటొ నంటుంటుంటరు

పెండ్లంకైతె అన్నాలం జేసిపోయెనంటరు

పుల్లెందలు పోరగాండ్లు ఈనమాయిరంటరు

ఒంటిగానె అస్తింగద యాడికెల్లో ఈడికే

అందరంబోయేదా బొందలగడ్డ కాడికే

 https://youtu.be/z_CeUj6v6fg


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:తోడి


హిమనగవాసినం పన్నగభూషణమ్

సుమధన్వు దహినం లలాటలోచనమ్

లింగమూర్తినం గంగాధరం పింగేక్షణమ్

భావయామి భవానీశంకరమ్ అనుక్షణమ్


1.గణేశ పూజితం గజాసుర సేవితమ్

శ్వేతాంగవిరాజితం పురాసురపరాజితమ్

నందిభృంగి సన్నుతం నారద వినుతమ్

నమామ్యహం నటరాజమ్  సంతతమ్


2.షణ్ముఖు జనకం ప్రభో పంచాననమ్

చతుర్ముఖు వందితమ్ త్రినయనమ్

ద్విజ నిజసంకీర్తితమ్ వృషభధ్వజమ్

శరణమహం వందే శంభుం శివమేకమ్

 https://youtu.be/6QB4PqCIafg


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


(జావళి)


సరసాలు చాలించరా

సరగున నను పరిపాలించరా

మదనగోపాలా కదనకుతూహలా

హృదయము నీదే అదనిదికాదు నన్నేలా

(అదను ఇది కాదు)


1.పదపడి నా మదిలో చొరబడి

రేపకు నాలో రమయతి అలజడి

కలవరముననే తలపుల కలబడి

చేర నెంచితినిక వెచ్చని నీ ఒడి


2.కొంటెవాడ నా జంటను కోరగ

తుంటరి తనమేల నా కడకొంగు లాగ

కలలపంటనే కృష్ణా నీ జతగూడగ

మునిమాపు కానీర నా మంటనార్పగ