https://youtu.be/mjn4ayelz68?si=FoOwY7_lIbdU3fuC
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
మనసు మాటవినదు ఎంతగా చెప్పిచూసినా
తలపు జాలి కనదు పదేపదే ప్రాధేయపడినా
నీవైపే లాగుతుంది దృష్టిని మరలించినా
నిన్నే తలచుకొంటుంది వలదని బెదిరించినా
వ్యర్థ పోరాటమే నాది చెలీ నిత్య ఆరాటమే మదిది
1.మనిషిగా దూరమవుతున్నా
బ్రతుకు నీతో ముడిపడిపోయింది
పైకి చూడ నాటక మాడుతున్నా
అంతరంగమే నిన్ను ఆరాధిస్తోంది
నూటిలో ఒక్కడిగా నన్ను జమకట్టావే
నువ్వే నా దేవతగా ఎదలో గుడికట్టానే
2.నిన్ను వంచించుకుంటూనే
నన్ను ఉడికించ కించపరిచేవు
నిన్ను నిభాయించుకోలేకా
నన్ను మాత్రం దబాయిస్తునావు
నీకు నేను నిజంగానే ప్రియా ఓ పిపిలికం
నీవున్న చోటే నాకు సఖీ అసలైన నాకం