Sunday, January 22, 2023

 https://youtu.be/xZDVfD1hzIg

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హిందోళం


వేంకటేశం పరమ పురుషమ్

శ్రీ వేంకటేశం ధర తిరుమలేశమ్

అశేష భక్తజన విశేషమ్ సప్తగిరీశం

అలమేలు మంగా హృదయేశం

పద్మావతీ ప్రియేశం వందే రాఖీకవి పోషమ్


1.బ్రహ్మేంద్రాది దేవ సుపూజితమ్ 

శంఖ చక్ర గధాయుధ విరాజితమ్

కౌముదీ సమ వీక్షితమ్ కౌస్తుభ వక్షాంకితమ్ 

తులసీదళ ప్రియం వైజయంతి మాలాశోభితమ్

జగదీశం హృషీకేశమ్ వందే రాఖీ కవిపోషమ్


2.సదా అమందానంద కందళిత 

హృదయారవిందమ్ గోవిందమ్

శరణాగతవత్సలమ్ కరుణాకరమ్

అనాథనాథమ్ ఆపద్బాంధవమ్ ముకుందమ్ 

అఖిలాండేశమ్ శ్రీశమ్ వందే రాఖీకవిపోషమ్


https://youtu.be/gC_Hxs7baiU?si=TLxKGz7AUKQOmpVX

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:రేవతి


ఓం ఓం ఓం ఓం ఓం

ప్రణవమే విశ్వాధారం

ప్రణవమే విశ్వానికి మూలం

ప్రణవమే ఓం కార బీజ నాదం

ప్రణవమే సృష్ట్యాది మూలవేదం

ఓం ఓం ఓం ఓం ఓం


1.అకార ఉకార మకార సంయుతం ఓం

సత్వరజస్తమో గుణత్రయాతీతం ఓం

నిరాకార నిరామయ నిరంజనం ఓం

బ్రహ్మవిష్ణుశివాత్మకం జగన్మాత రూపం ఓం

ఓం ఓం ఓం ఓం ఓం


2.సప్త స్వర వర ప్రదం ఓం కారం

సప్త చక్ర ఉద్దీపక సాధనం ఓంకారం

సప్తధాతు చైతన్యకరం ఓకారం

సప్తవ్యసన సమూల హారకం ఓంకారం

ఓం ఓం ఓం ఓం ఓం

 

https://youtu.be/PA38Bj-xPpQ

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


మరుగు పరచినాను మనసులో నీ చిత్రాన్ని 

పదిల పరచినాను మదిలోన నీ తలపులని

ప్రతీకగా ఏదో ఒకదాన్నీ-నీవే అనిపించిన ప్రతిదాన్నీ

జత పరచుతాను ప్రతి కవితకు-శ్రుతి కలుపుతాను గీతానికి,ఊహకు ఊతానికి


1.చిత్తరువులొ ఏదో ఒకటి-నీ సాటికి పోల్చుకొని

సొగసులలో మిలమిలలేవో నీవిగా భావించుకొని

ఏ మాటా రాకూడదని ఇబ్బంది పడకూడదని

నాకు నేనే తృప్తి పడి వెలువరిస్తున్నా చిత్రకవితని

కవితకు చిత్రాన్ని


2.బిడియమెంతొ పడుతూనే బింకాన్ని నటియించి

హృదయానికి చేరువ అవుతూ దూరాన్ని పెంచి

వదలలేకా చేపట్టలేకా సాకులేవో బుకాయించి

ఆటాడుకుంటూనే ఉంటావు నా కవిని ప్రేమించి

నన్ను తప్పించి

 

https://youtu.be/zNp94vR3ius

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


జయము జయము మహాకవీ వాచస్పతికి

జేజేలు జేజేలు సంస్కృత సారస్వత మూర్తికి

శ్రద్ధాంజలి శ్రీభాష్యం విజయసారథీ ఆచార్యులకు

జోహారు జోహారు సంస్కృత భారతీ గురువర్యులకు


1.జన్మించిరి గోపమాంబ నరసింహాచార్యులవారి తపః ఫలమ్మున

గుర్తింపు తెచ్చిరి పుట్టిన చేగుర్తి గ్రామానికే జగాన

గీర్వాణ విద్వద్వరేణ్యులై ఉదయించిరి శ్రీభాష్యం వంశాన

పేరొందిరి విజయసారథి గురువర్యులు మహామహోపాధ్యాయ నామాన


2.చిరుతప్రాయమందుననే  అమరభాష నేర్చినారు

మాతృమూర్తి స్ఫూర్తితో శ్రీ వ్రతగీతిని కూర్చినారు

షట్ శాస్త్రాలను అవలీలగా ఆపోశన పట్టినారు

యుక్తవయసులోనే ఖండకావ్య సృజన సల్పినారు

నివాళులివే విఖ్యాత మందాకిని గ్రంథకర్తకు

నీరాజనాలు సంస్కృత సీసశ్ఛందావిష్కర్తకు


3.దేశభక్తి ప్రేరేపిత భారతభారతి కావ్య కవనమ్

కృష్ణభక్తి పూరిత రసరమ్యం సంగీత మాధవమ్

వెలయించిరి యజ్ఞవరాహక్షేత్రం వైదిక సంస్థానమ్

వరించెనీ శతాధిక కృతికర్తను పద్మశ్రీ పురస్కారమ్

నివాళులివే విఖ్యాత మందాకిని గ్రంథకర్తకు

నీరాజనాలు సంస్కృత సీసశ్ఛందావిష్కర్తకు