ముక్కలు చేసినా రాదు చప్పుడు
పిడికిట నొక్కినా ఉంటుంది గుప్పెడు
మంటబెట్టి మసిచేసినా కత్తిబెట్టి కోసేసినా
నీకోసమే కొట్టుకుంటోంది నా గుండె
నీ నామమే జపిస్తూ మిన్నకుండె
1.ఎవడుకనిపెట్టాడో గాని ప్రేమ అన్న ఈ పదాన్ని
ఎలా అంటగట్టాడో ఏమో లలనతో అనుబంధాన్ని
వ్యాపకాలన్నిటికీ తిలోదకాలిచ్చేలా
వ్యామోహపు వలలోనా పడిచచ్చేలా
మధురమైన ప్రణయానా ఈ మరణయాతన
తగదునీకు నెచ్చెలీ దూరమౌట జీవితాన
2.నారి మనసు మర్మమేదో హరికైనా తెలియదంట
పడతికున్న యోచనేంటో పరమేశ్వరుడే ఎరుగడంట
మాయల ఫకీరు ప్రాణాలు రామ చిలుకలోనా
నా పంచప్రాణాలు ప్రేమించానను పలుకులోనా
ఔనని మననీయి నీపాద దాసునిగా
అందాల చేయందీయి పడిఉంటా బానిసగా
పిడికిట నొక్కినా ఉంటుంది గుప్పెడు
మంటబెట్టి మసిచేసినా కత్తిబెట్టి కోసేసినా
నీకోసమే కొట్టుకుంటోంది నా గుండె
నీ నామమే జపిస్తూ మిన్నకుండె
1.ఎవడుకనిపెట్టాడో గాని ప్రేమ అన్న ఈ పదాన్ని
ఎలా అంటగట్టాడో ఏమో లలనతో అనుబంధాన్ని
వ్యాపకాలన్నిటికీ తిలోదకాలిచ్చేలా
వ్యామోహపు వలలోనా పడిచచ్చేలా
మధురమైన ప్రణయానా ఈ మరణయాతన
తగదునీకు నెచ్చెలీ దూరమౌట జీవితాన
2.నారి మనసు మర్మమేదో హరికైనా తెలియదంట
పడతికున్న యోచనేంటో పరమేశ్వరుడే ఎరుగడంట
మాయల ఫకీరు ప్రాణాలు రామ చిలుకలోనా
నా పంచప్రాణాలు ప్రేమించానను పలుకులోనా
ఔనని మననీయి నీపాద దాసునిగా
అందాల చేయందీయి పడిఉంటా బానిసగా