https://youtu.be/zR-oyHHOAYU
ఓ సుముఖా- వినాయకా- శుభదాయకా
రావయ్యా –మాయింటికి-ఎలుక నెక్కి చకచకా
ఇల్లెడింటి వారమంత- స్వాగతిస్తు వేచినాము
కాసింత చూపవయ్యా-మా పైన కనికరము
1.
బంతులు చామంతులు-దారంతా
పరిచినాము
మామిడాకు
తోరణాలు-ద్వారాలకు కట్టినాము
ఇరవయొక్క
పత్రాలు-సేకరించి పెట్టినాము
నువుమేచ్చే
మందారాల –మాల గుచ్చి ఉంచినాము
పూజలందుకోవయ్యా-
ఓ గణపయ్యా
విన్నపాలు
దీర్చవయ్య-ఓ వెంకయ్యా
2.
ముదముతోడ మోదకాలు-
ఆరగించవయ్యా
ప్రియమారగ
ఉండ్రాళ్ళు –బొజ్జనింపుకోవయ్యా
తనివిదీర పాయసాన్ని-కడుపార గ్రోలవయ్య
వండి
వార్చి ఉంచినాము-దండిగ భుజియించవయ్య
నివేదనలు నీకివే లంబోదర లకుమికరా
వేదనలను తొలగించర పాశాంకుశ ధరా
www.4shared.com/mp3/vCsn0Tbgba/O_SUMUKHA_VINAYAKA.html?
https://youtu.be/zR-oyHHOAYU