https://youtu.be/ypn-TjVNJc8?si=VGKdhPQhHZ592wDv
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం:మోహన
మూలమంత్ర జప మొకటే గోవింద యనుటే
మూలదైవ మొకడే తిరుపతి శ్రీ వేంకటేశుడే
మూర్తీభవించిన పరమదయాళువు శ్రీనాథుడే
మూలిక తానై భవరోగములు బాపు ఘనవైద్యుడే
1.గోవింద యనినంత ఎనలేని నిశ్చింత
గోవింద యనినంత స్వామియే మనచెంత
గోవింద నినదించు తిరుమల సప్త గిరులంతా
గోవింద యనినంత తరింతురు భక్తవరులంతా
2.కురులను అర్పించ వరముల నందేరు
ముడుపులు చెల్లించ ఇడుముల బాసేరు
స్వామిని దర్శించ మనఃశాంతిని పొందేరు
శ్రీశుని సేవించ సకల కుశలములు బడసెదరు