https://youtu.be/_3-oEKv5xng?si=Bkt9Quf40pwbbU7w
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
కుందనపు ఆకృతి అందాల మహతి - *we love u*
అందుకో నీ పుట్టిన రోజు బహుమతి- *we wish u*
అనురాగం ఆప్యాయత కలబోసినదీ గీతి- *just for u*
ఆనందపు ఉషస్సులు అమ్మానాన్నల ఆశీస్సులు- *HAPPY birth day to you*-
సంధ్యా రాజేశ్వరుల కలల పంటవు మహతీ *Wish u happy birthday to u*
1.పాతిక వత్సరాలు నీతో మా జీవితాలు
ఎనలేని మరపురాని మధురమైన అనుభూతులు
నీ సహన శీలత నీ ఔదార్యత అనుపమానాలు
సాధించిన నీ ఘన విజయాలు నీదీక్షకు ప్రమాణాలు-
*HAPPY birthday to you*- సంధ్యా రాజేశ్వరుల కలల పంటవు మహతీ*Wish u happy birthday to u*
2.వసంతాలై నీ నవ్వులు విరియనీ చిరకాలం
సంతస కాంతులకవనీ నీ కనులు ఆలవాలం
చీకూ చింతా లేకా చిగురించనీ నీ భవితవ్యం
భగవంతుడు కురిపించనీ దీవెనలు నీపై నిత్యం-
*HAPPY birthday to you*- సంధ్యా రాజేశ్వరుల కలల పంటవు మహతీ *Wish u happy birthday to u*