Saturday, September 18, 2021

 https://youtu.be/Mi20fJb4gr0


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ



రాగం:బీంపలాస్


అతి సామాన్యుడ నే స్వామి

మితి మీరి నాతో సయ్యాటలాడబోకు సుమీ

చతికిలబడితిని వేంకటాచలపతి

గతినీవే నాకిక శ్రీపతి కోరితినిదె నీ శరణాగతి


1.నిగ్రహమున్న తాపసినసలే కాను

నిష్ఠగ దీక్షతొ నిను మెప్పించగలేను

ముడుపులు కాన్కలు వేడ్కగనీయలేను

.ఉడుపులు తొడవులు సమర్పించగాలేను

నువుపెట్టే ప్రతి పరీక్ష నాకు కఠినశిక్షయే

 ప్రతీక్షింప అలవిగాదు స్వామీ రక్షింపవే


2.పరాచికాలు సలుప పద్మావతి చాలుగా

కేళీ వినోదమైతే అమ్మ   అలమేలు మేలుగా

భక్తులనే కాల్బంతిగ ఆడుటయే న్యాయమా

కడగళ్ళతొ కన్నీటి పాల్జేయగ పాడియా

కొత్తది అడగకుండ ఉన్నది తొలగింతువే

చీకటి గుప్పిస్తివీవే దివ్వెను వెలిగించవే