Monday, December 26, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:సారమతి


నన్నేల మరచితివి శ్రీ గణనాథా

నీ అండ లేకుండ నేననాథ

వక్రతుండ నిను నెరనమ్మితి ఏకదంత

ఏమరుపాటేల తొలగించగ నా చింత


1.నా నాలుకపై నీనామమే సదా

త్రికరణశుద్ధిగ నిను కొలిచితి కదా

నీ తలపులతో నిండెను నా ఎద

నను కనికరించగ నీ దయరాదా


2.నాడూ నేడూ మరి ఏనాడూ

నిజముగ నీవే స్వామీ నా తోడు

రుజలను బాపగ ఇక వేగిర పడు

చిగురించనీ ప్రభు నా బ్రతుకు మోడు

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

కొడిగట్టనీకు నేస్తమా స్నేహదీపం
మన మైత్రి నాకైతే అపురూపం
తేలికగా భావిస్తే నాకెంతో పరితాపం
చితిపేర్చి తెలుపకు చెలిమికి సంతాపం

1.నాకెపుడూ అవసరమే నీ సహవాసం
దాటవేసి నిన్నునీవు చేసుకోకు మోసం
నీ సాంత్వన కోరుకుంటె ఔతుందా దోషం
అనుబంధం పెనవేయకుంటేనే అది  విశేషం

2.నీ అంతట నీవెపుడూ నన్ను పలకరించవు
నాదైన అతీ గతీ ఆరాలేవీ నువు తీయవు
యాంత్రికంగా ప్రవర్తించ ప్రయత్నిస్తుంటావు
స్నేహితమా పరిచయమా అన్నట్టుగ ఉంటావు