Sunday, December 25, 2022

 

https://youtu.be/myrpFn6CKtk?si=TkzStAAUQf2ywEie

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మోహన


కనుగొనలేదు విష్ణువైనను నీ మూలము

ఎరుగలేదసలు సృష్టికర్తయు నీ అంత్యము

నరులము నిన్ను రామలింగేశ్వర తెలియ జాలము

నీ కరుణలేనిదే గ్రహియించలేము నీదైన శివ తత్త్వము


1.బంధాలు అనుబంధాలు నీకున్నట్టే తోస్తాయి

రాగాలు వింత మోహాలు నిన్ను కట్టిపడ వేస్తాయి

తామరాకు మీద నీటి బొట్టే కద ఐనా నీ మార్గము

ఒంట బడితె స్వామి ఇంకోటుంటుందా అంతకన్న స్వర్గము


2.రెప్పపాటులోనే తెప్పరిల్లగలుగు రౌద్రావేశము

చిప్పిల్లే కళ్ళలో కదలాడు నంతలో భోలా నైజము

చెప్పలేము కద ఎప్పుడుపోతుందొ బొందిలో ప్రాణము

ఇప్పటికిప్పుడు ఎప్పుడూ తప్పనీయకు స్వామీ నీ ధ్యానము


https://youtu.be/Kg5cJ_sXVPQ


 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


అగ్నిమాపకమే లేదు ఆర్పడానికి-

నిరంతరం నను కాల్చే నీ జ్ఞాపకాలని

ప్రేమమాపకమేదీ లేదు కొలవడానికి

అపారమైన నీమీది అనురాగానికి

నా గుండె సడివి నా మది అలజడివి

జన్మలెన్ని ఎత్తినా నను వీడని ముడివి


1.నేను నిన్ను ఆరాధిస్తా ప్రియమైన దేవతగా

నన్ను మాత్రం పరిగణించవు నీ కనీస భక్తుడిగా

షరతులంటు ఉంటాయా ప్రణయాను బంధాన

అవధులంటు ఉంటాయా ఆత్మలేకమయ్యాక

నా గుండె సడివి నా మది అలజడివి

జన్మలెన్ని ఎత్తినా నను వీడని ముడివి


2.గులాబివే నీవు ఘుమఘుమలు గుభాళిస్తూ 

కంటకమని నను భావించినా వెన్నంటి కాపుకాస్తా

సితారవే నీవు మంజుల స్వరములు రవళిస్తూ

తప్పని తప్పెటనై విప్పిన గుప్పిటినై లయకూరుస్తా

నా గుండె సడివి నా మది అలజడివి

జన్మలెన్ని ఎత్తినా నను వీడని ముడివి