Monday, September 13, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆరాధనంటే ముజ్జగాలలో ఆరాధదే

అద్వైతమంటే అది రాధామాధవీయమే

రాధకు కృష్ణుడిపైననే సర్వదా ధ్యాస

కృష్ణుడు రాధకెపుడు కట్టుబానిస


1.ఇహమును విరమించి అహమున రమించి

పరమాత్మనైను అంతరాత్మలో గాంచి

జీవనసాగరాన అంతర్మథనమే గావించి

సంగమ సాఫల్యమందు సుధనే సేవించ

రాధకు కృష్ణుడిపైననే సర్వదా ధ్యాస

కృష్ణుడు రాధకెపుడు కట్టుబానిస


2.పరమానందమందు పరవశమొంది

పరస్పరం పరిష్వంగ తన్మయమే చెంది

అధరపుష్పాలలో మకరందము నంది

బింబము ప్రతిబింబము ఐక్యము నొంద

రాధకు కృష్ణుడిపైననే సర్వదా ధ్యాస

కృష్ణుడు రాధకెపుడు కట్టుబానిస

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


క గుణింతమే కదా జీవితం

కనకం కాంత కిరీట కీర్తులకే అంకితం

కుడిచినదాదిగా అమ్మపాలు పసినాడు

కూలి పోయి చేరునంతదాక కాడు

అక్షరమై మొదలౌతుంది

అక్షరమై కడతేరుతుంది


1.కృష్ణగీతనాచరించ క్రూరకర్మలంతరించు

కెడయికయే నీడైనా కేలొసగిన తరించు

కైవల్యమె ధ్యేయముగా కొత్తెమలా విస్తరించు

కోరికనే త్యజించగా జీవన కౌతుక నిస్తరించు

అక్షరమెరుగుటయే ఆత్మజ్ఞానము

అక్షరముగ సాగాలి నిత్య ధ్యానము


2.కలియుగాన కాత్యాయిని కిణ్వ వారిణి

కీర్తన జేయగ కుమారసువు కూర్చు కూరిమి 

కృతకమాయె బ్రతుకు వికృతమాయే మేధ

కైంకర్యము చేసినంత కరుణించును జనని క్షేమ

అక్షరముతొ సావాసము

అక్షరమున ఆవాసము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మనిషే పశువైన దుష్కృత వేళ

మగాడే మృగాడైన వికృత హేల

కుతిదీర్చుకొనగ ఆడశునకమైనా హతవిధీ సరే

పసిమొగ్గలైను చిదమగ నికృష్టుల నేమందురే


1.మదపిచ్చి పెట్రేగ నరరూప రాక్షసులై

పురుషాంగపు యావలో కామపిశాచులై

వావిలేక వరుసలేక వయసు ధ్యాసనే లేక

సలిపిన బలత్కార చర్యకు పీకలోనె పసికేక


2.ఆడదై పుట్టడమే అవనిలొ ఒక శాపంగా

స్త్రీ శీలపు రక్షణ వైఫల్యం  జాతికి లోపంగా

అభంశుభం తెలియని ఆడశిశువులే సమిధలై

మానవాళి సిగ్గుపడే అత్యాచారాలే నిత్యం వ్యధలై