Monday, September 6, 2021

 https://youtu.be/dWKJdu3Llm0?si=SQE-EBioOIv23I6j

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మాయామాళవగౌళ


మూడు కన్నుల వాడ ముల్లోకాల రేడ

శివుడా శివుడా ఏడ నీ జాడ

రికామె లేదాయే ఎములాడ కాడ

కాసింతైన నన్ను దయజూడ


1.సోమారమెపుడైన సోకదు నీ నీడ

శావణమైతేనొ  సోచాయించను గూడ

శివరాత్రి నాడైతె నిన్ను వేడనె వేడ

గుండెలో కొలువుండు తండ్రి రాయేశుడ


2.ఉపాసమొల్లను ఉండను తినకుండ

జాగారం చేయను  రేయి నిదరోకుండ

ప్రతి పనికి మానను శివశివ అనుకుండ

జంగమయ్య  నీవే  మాకు అండాదండా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సింధుభైరవి


నేనేమో సాహిత్యం-నీవేమో సంగీతం

ఇరువురి సంగమం అద్భుత రసమయ గీతం

నాదేమో అక్షర శరం నీదేమో స్వరమాధుర్యం

వశమైపోదా ఎక్కిడితే సర్వం సహా జగం

పరవశమైపోదా ఎలుగెత్తితే సకల విశ్వం


1.చైతన్యపు ఘన మేఘం నేనేగా

నురగలెత్తు సాగరకెరటం నీ నవ్వేగా

అందుకొనగ ఆత్రంగా ప్రేమసూత్రంగా పవిత్రంగా

అల్లుకొనగ హర్షంగా ఉధృత వర్షంగా ఆదర్శంగా

పదమై పల్లవై రాగమై అనురాగమై జతులై గతులై

చరణాలే వడివడి సాగగా- కడలి ఒడిలో కడతేరగా


2.ప్రత్యూషపు రవి బింబం నేనేగా

సరస్సులో అరవిందం నీ అందమేగా

తొలికిరణం నిను చేరిన తరుణం స్వర్ణంగా ప్రణవార్ణంగా

సితగా వికసితగా అధర హసితగా విలాస విలసితగా

ధన్యవై అనన్యవై ప్రావీణ్యవై ప్రాధాన్యవై మాన్యవై శరణ్యవై

భవమే భావమై అనుభవంగా- విభవమే సంభవమై మిథునంగా