Tuesday, October 22, 2019

దండలెన్నొ వేస్తున్నా -గండాలు కాయమని
దండాలు పెడుతున్నా-అండగా ఉండమని
బండరాయి నాగుండె-నువు కూర్చుండ బాగుండె
సద్గురు సాయినాథా నీదయతో  నా కలలే పండే

1.ఇంటింటా పటములు నిలిచె-ఊరూర నీ గుడులే వెలిసే
ప్రతి మనిషీ నిన్నే తలచే-ప్రతి నాలుక నీనామం పలికే
గురు పౌర్ణమి ఉత్సవమాయే-గురువారం జాతరలాయే
ఇంతకన్న ఇంకేముంది నిదర్శనం-మదికెంతొ హాయీ నీ దర్శనం

2.తిరుపతీ  కాశీ సమము-షిరిడి యాత్రచేయగ ఫలము
ద్వారకామాయి స్థానము-అపర ద్వారకే నిజము
విభూతి ధారణతో అనుభూతులు అనుపమానము
సకలదేవతా స్వరూపము సాయినాథ నీ అవతారము




రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:హిందోళం

ఏ విధి పొగడనే పలుకులబోడి
పొందనిదేదమ్మ నిను మదివేడి
పొడిబారనీకు పొరబడి ఎదతడి
పబ్బతులిడెదనె నే సాగిలబడి

1.అడుగేయనీకు ఎపుడూ తడబడి
మాటజారనీకమ్మా మతిచెడి పదపడి
చేసితినమ్మా నా గుండె నీ గుడి
కొలువుదీరవమ్మా కడదాక తిరపడి

2.అచ్చరపడు రీతి అచ్చరాలు కూర్చనీ
ఎడదలు మురియగ పదములు సాగనీ
నా కవనమంతా పలు వన్నెలు పూయనీ
నా కైతలలో  నీ తలపులె నిలువనీ