Saturday, August 22, 2020

ఏవి స్వామి నిరుటివరకు వెల్లువెత్తిన సంబరాలు
మనిషిమనిషిలొ ఉరకలెత్తిన నవరాత్రి ఉత్సవాలు
కరడుగట్టిన కరోనాకరాళ నృత్యం ఆడసాగే
పెట్రేగిపోయి మహమ్మారి వికటాట్టహాసం చేయ సాగే
పార్వతీసుత నీ పాటవానికి లెక్కలోకే రాదిది
గణపతి నువు నేర్పుతున్న గుణపాఠమే మాకిది

1.భక్తియన్నది మచ్చుకైనా కరువాయె కదస్వామి
ఢాంబికాలా డంబరాలకు వేదికాయెగా చవితి
ముక్కుపిండి వసూళ్ళు బెదిరింపుతో చందాలు
గొప్పలకు పోతుపోతూ ఎత్తెదిగే విగ్రహాలు
రెండుమూడిళ్ళకే సా..మూహిక మంటపాలు
హానికర రాసాయనాల రంగురంగుల ప్రతిమలు

2.పేదవారు అవిటివారు నోచుకోనీ నివేదనలు
అష్టోత్తరాలుగ రకరకాలు తీరొక్క నైవేద్యాలు
పూజ భజనలు మృగ్యమై డి జే రొదలే రోతలాయే
వినోదాల పేరిట మద్యమైతే వరదలాయే
జాగారమంటూ యువత జూదము పాలాయే
తూలి ప్రేలి పిచ్చి గెంతుల శోభాయాత్రలాయే

3.మట్టి ప్రతిమలు వాడమంటే నామోషీ తీరాయే
ఊరికొక మంటపం     ససేమిరా     కుదరదాయే
ఐకమత్యమె ధేయమైతే కులముకొకటిగ చీలిపోయే
రాజకీయా పక్షాలా అండదండలు అక్కెఱాయే
చెరువులన్ని పూడిపోగా పర్యావరణం ముప్పువచ్చె
మానవాళని చక్క దిద్దిస్వామి మహితమౌ బుద్దినీయి