Thursday, October 31, 2019


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

కార్తీకమాసమే భక్తి పూరితం ముక్తిదాయం
కార్తీకమొస్తేనే స్ఫూర్తి దాయకం ఆసక్తిదాయకం
శివకేశవులే మోక్షమొసగు శుభసమయం
హరిహర పుత్ర అయ్యప్ప  దీక్షలనిలయం
తరించండి జనులారా దైవార్చనలో
రాగం యోగం మిథునం కాగ దివ్యమైన భావనలో

1.దామోదరుని ధ్యానములో ధాత్రివృక్షఛాయలో
వనభోజనాదులతో బంధుమిత్ర సమ్మేళనములో
ఆనంద ఘడియలనే అనుభవించి తీరాలి
అనుభూతులెన్నిటినో పదిలపరచుకోవాలి
తరించండి జనులారా దైవార్చనలో
రాగం యోగం మిథునం కాగ దివ్యమైన భావనలో

2.పరమశివుని ధ్యాసలో సోమవార అర్చనలో
రుద్రాభిషేకాలే భద్రంగా అనువర్తిస్తూ
పంచాక్షరి మంత్రాన్నే అనవరతం స్మరియించాలి
పరమపదము నందుటకై మనసునివేదించాలి
తరించండి జనులారా దైవార్చనలో
రాగం యోగం మిథునం కాగ దివ్యమైన భావనలో

3.కార్తీక పౌర్ణమి నాడు స్వామి మాలధారణతో
మండలవ్రతమును బూని ఇరుముడి తలనే దాచ్చి
శబరిమలను చేరి మణికంఠుని దర్శించాలి
మకరజ్యోతి తిలకించి ఆహ్లాదమొందాలి
తరించండి జనులారా దైవార్చనలో
రాగం యోగం మిథునం కాగ దివ్యమైన భావనలో

రచన, స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:పట్ దీప్

ఆరాధన ఒక్కటే దృక్పథం భిన్నమైనా
అనురాగ మొక్కటే భావుకత వేరైనా
విశ్వమంత ప్రేమమయం అది ప్రకృతి దృగ్విషయం
ప్రతి మనసూ పరితపించడం ఇదే సృష్టి నియమం

1.అమ్మ పంచగలిగేది అనుపమానమైన మమత
నాన్న గుండెలోనా అతులితమౌ వాత్సల్యత
సోదరీ సోదరుల అగణితమౌ ఆప్యాయత
ప్రేయసీ ప్రియులజన్యమౌ అద్వైత ప్రణయ రమ్యత
విశ్వమంత ప్రేమమయం అది ప్రకృతి దృగ్విషయం
ప్రతి మనసూ పరితపించడం ఇదే సృష్టి నియమం

2.గురువులకు శిశ్యుల ఎడల అనునయ భావన
మిత్రుల్లో నెలకొన్న పరస్పర ప్రతిస్పందన
నేతలు నటుల పట్ల అభిమానుల వ్యక్తీకరణ
దైవమంటె భక్తులకుండే ఆత్మ నిజ నివేదన
విశ్వమంత ప్రేమమయం అది ప్రకృతి దృగ్విషయం
ప్రతి మనసూ పరితపించడం ఇదే సృష్టి నియమం




కన్నీరుగా ప్రియా కారిపోకుమా..
కనుపాపల నీరూపే నిలుపుకున్నా సఖీ
నా గుండెలో నుండి జారిపోకుమా చెలీ చేజారిపోకుమా
మధురోహల దాహములో నే పరితపిస్తున్నా పలవరిస్తున్నా

1. మనిషినిక్కడున్నా గాని మనసునీ వెంటే ఉంది
దేహాలువేరైనా ఆత్మ నీలొ ఐక్యమైంది
రోజుకెన్ని సార్లునీకు పొలమారిపోతుందో
పదేపదేనిన్నే తలవ గొంతారిపోతుందో

2.మన వింత బంధానికి పేరే లేదు ఇలలోన
కలవరించడం మినహా కలవగలమ కలలోన
చల్లగాలి నిన్నుతాకితే అది ప్రేమసందేశం
వానచినుకు నిను తడిపితే నా ఆనందభాష్పం