రాఖీ|| నాయకి  ||
కనుబొమ్మల ధనువుతో..ఎనలేని శరములు..
మునిపంటి విరుపుతో మోకరిల్లు శిరములు..
చిరునవ్వుకే..మునులు..కాగలరు ..వశులు..
దయచూస్తివా..ఘనులు
అవుతారు బానిసలు..!                     
సరస సమర నాయకి-సహృదయ సరసి జానకి
మతిచెలించె నినుకన్నబ్రహ్మకి-నీ చూపుల
తూపులే మదితాకి..
1.  కనుల కలువలే నీకు
వారుణాస్త్రాలు-సంపంగి నాసికే నాగాస్త్రము...
          గులాబీ
చెక్కిలే..సమ్మోహనాస్త్రం ..-మందారమోవియే పాశుపతాస్త్రం
          మరుమల్లి పలువరుస నారాయణాస్త్రము..ముఖ
పద్మమే నీకు బ్రహ్మాస్త్రము
          సరస సమర నాయకి-సహృదయ సరసి జానకి
           మతిచెలించె నినుకన్నబ్రహ్మకి-నీ చూపుల
తూపులే మదితాకి..
2.  తుమ్మెదల తలపించు ముంగురులు.-ఎదల  కట్టడిజేసే మంత్రమ్ములు
పాదాల రవళించు మంజీరములు..-పరవశమొ౦దించే వాద్యమ్ములు
వయ్యారి నడకల్లో..వన్నె ముక్కు పుడకల్లో –పొదువుకున్నది గుమ్మ వేలాది
అమ్ములు
           సరస సమర నాయకి-సహృదయ సరసి జానకి
            మతిచెలించె నినుకన్నబ్రహ్మకి-నీ
చూపుల తూపులే మదితాకి..
 
