https://youtu.be/Vzv3gchRDuc?si=M5VwaeQBInxM_w_3
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ప్రాణమున్న పాటను నేను
పరిమళాల విరి తోటను నేను
మానవత మనగలిన చోటును నేను
విజయానికి దారితీయు ప్రగతి బాటను నేను
పాటే ప్రతి పూట సాపాటై పరిపాటై నా నోట
1.పాటగ పరిణమించు ఎదన నాటిన సంఘటన
పాటగ ఉదయించు మదిని మీటిన
పర్యటన
పాటను ఆలపించు హృదయంగమమై పటిమ
పాటే ప్రతి పూట సాపాటై పరిపాటై నా నోట
పాటే నా తూట సమ్మెట తప్పెట చేట తరగని ఊట ఎగసే బావుటా
2.పాట ప్రేమ ఆలంబన ఆరాధన
పాట విరహ వేదన విషాద నివేదన
పాట భావ ప్రకటన వాదన వంతెన
పాట ఆత్మ శోధన పరయోగ సాధన
పాటే ప్రతి పూట సాపాటై పరిపాటై నా నోట
పాట నా పబ్బతి వినతి శరణాగతిగా నాకు బాసట