Thursday, March 30, 2023



https://youtu.be/cXTyo22Vmtk


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మోహన


పెండ్లాడెను సీతమ్మను-సాకేత రామయ్య 

శివుని విల్లు విరిచేసి మా జానకమ్మ మనసు గెలిచేసి

చూడముచ్చటే కనే కండ్లకు ఆ సుభ లగ్గం

సంబరంగ కంటూఉంటే తలనింక తిప్పుటకొగ్గం


1.రాజాధిరాజులు వీరాధివీరులు

నెగ్గక సిగ్గుతొ తలదించుకొన్న మిథిల పేరోలగం

రాఘవుని సూరత్వముగని వలచిన వైదేహి

వరమాల బూని సిగ్గుతొ తలవంచుకొన్న వైనం

పూలవానలు కురిసెనంతట నీలినీలి ఆ గగనం

కనులకింపుగ జరిగేను సీతారాముల కళ్యాణం


2.తరలివచ్చిరి తండ్రి దశరథుడు రాముని తమ్ములు

మునులు జనులు ముక్కోటి దేవుళ్ళు వేడ్క చూచిరి ఆ మనువును

జనకుడు దారబోయంగ సీతతొ నలుగురు కూతుళ్ళను 

రాముడాతని తమ్ములుమువ్వురు మనువాడిరి వాళ్ళను

రాముడు-మైథిలి భరతుడు-మాండవిలు  జంటగా

దంపతులైరి సౌమిత్రి ఊర్మిళ శత్రుఘ్ను శ్రుతకీర్తి  కనుల పంటగా

Tuesday, March 28, 2023

 https://youtu.be/8gqbaYwW4MA


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:తిలక్కామోద్


ప్రణతులివే పవనసుతా

ప్రణుతులివే మా జీవనదాతా

ప్రభాతవేళ మా వినతులివే వీరాంజనేయా

ప్రమోదాలు కూర్చరా ప్రసన్నాంజనేయా


1.ప్రభాకరుని శిష్యుడవు ప్రపన్నార్తిహరా

ప్రచండతేజుడవే నీవు ప్రభో కపివరా

ప్రకీర్తి ప్రదాయుడవు పావని నామశూర

ప్రలోభాల పాల్జేయకు జితేంద్రియా బ్రోవరా


2.ప్రసిద్ధుడవే రామభక్త హనుమాన్ నీవు

ప్రహస్త సప్తసుత దానవ హంతకుడవు

ప్రత్యగాత్మవీవే పరితోషవరదాయకా

ప్రత్యక్షదైవానివీవే ప్రపత్తి నీవే నాకికా

 https://youtu.be/XNXRf_9IDNA


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


అలికిడి లేని నడిరాతిరిలోను అలజడిరేపింది నీ జ్ఞాపకము

దినమానమమునీ స్మృతుల జడిలో తడవడమే కద నా వ్యాపకము


1.ఎండుటాకుల గలగల సడి నీ మంజుల పదమంజీర రవమై

కోటిరాగాలు మీటసాగింది మధుర భావాల నా మానసము


2.అల్లనవీచే పిల్లతెమ్మెర నీ ఊసులేవో గుసగుసలాడగ

ఊహలు కథకళి నర్తనమాడగ మ్రోగింది నా ఎద మృదంగము


3.మెల్లగ వేసిన పిల్లి అడుగులు సడిరేపెను నీ రాక సూచిగ

ఆశలు రేగ ఆరాటపడుతూ ఉద్వేగమొందెను నా దేహము


4.నీతలపులతోనే తలమునకలవుతూ నా మది సమాధికాగా

విషాదాంతమై రాఖీ నీ గీతి సాగరఘోషకు సాపేక్షము

Monday, March 27, 2023

 https://youtu.be/j7_Y09-nqOI


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హిందోళ వసంతం


బ్రహ్మీ ముహూర్త కాల స్వప్నము

అవుతుందట సదా శివా సత్యము

నీ ఆనుజ్ఞతోనే కదా ప్రతి కృత్యము

ఋజువుపరచు మహేశా నీ మహత్మ్యము


1.గాడి తప్పిన నా బండి దారికి మళ్ళిందట

చేజారిన మణిపూస మరలా దొరికిందట

నే వెదికే వనమూలికతీగ కాలికే తగిలిందట

మూగవోయిన నాగొంతు రాగాలు పలికిందట

ఊహ ఐతె మాత్రమేమి తలపే ఎంతహాయి

వాస్తవంగ మార్చివేస్తూ వరమే నా కిచ్చివేయి


2.కరిగిపోయిన మంచికాలం తిరిగి వచ్చిందట

కూలిపోయిన ఆశాసౌధం దానికదే నిలిచిందట

తెగిపోయిన స్నేహబంధం చిగురించిందట

తరలిపోయిన బ్రతుకు వసంతం తానే మరలిందట

కల్పనే కలిగిస్తోంది అంతులేని ఆనందం

అనల్పమే నీ మహిమ నీకేదీ అసాధ్యం

 https://youtu.be/RCCXO8QADE8


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:చంద్రకౌఁస్


గుండె కెలికినట్టుంటుంది/

మనసు కలుకుమంటుంది/

అంతరాలలో ఏదో /

వింత వేదన పొగులుతుంది


1.కంటిమీద కునుకే లేక/

సరిహద్దు పహారా కాచే సైనికుడు/

గడ్డకట్టే మంచులో కూరుకున్నప్పుడు/

పిలిచేందుకు మనిషేలేక ఏసాయమందక/

దీనంగా అశువులు బాసే యాతన కనగా


2.అందరికీ అన్నంపెట్టే అన్నదాత రైతన్న/

కరువుకాటకాలవల్ల అప్పుల ఊబిలొచిక్కి/

ఆదుకునే దిక్కేలేకా ఏదిక్కూకనరాక /

పొలంగట్టు చెట్టుకే

ఉరిత్రాడుకు వ్రేలాడి ఊపిరే వదిలే వేళ/

సభ్యసమాజమంతా చోద్యంగా చూస్తుంటే

 https://youtu.be/ey0p7_m3aXE


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:దర్బార్ కానడ


కేశవా మాధవా వేంకట నారాయణా

గోవిందా ముకుందా హే పరమానందా

మూడునామాలతో ముదమును గొలుపువాడ

ఏడుకొండల మీద చెలగీ వరలెడువాడ

మముకాచెడి ఆపదమొక్కులవాడా

దండాలు దండాలు అడుగడుగూ దండాలవాడా


1.తలనీలాలనైతె ముడుపులు గొంటావు

మావెతలను సుతరామూ పట్టించుకోవు

మొక్కులెన్ని మొక్కినా లెక్కనే చేయవు

మాచిక్కులు తొలగించగ మనసే పెట్టవు

ఓపికే సడలింది నిను బతిమాలి బామాలి

ఇప్పటికిప్పుడే ఇభవరదా తాడో పేడో తేలాలి


2.హుండీలు నిండినా మా కాన్కలతో మెండుగా

మేం గండాల పాలబడితె నవ్వుతావు మొండిగా

గుంజీలు తీస్తాము నీముందు లెంపలేసుకుంటాము

తప్పులు ఒప్పుకొని మమ్ముల మన్నించమంటాము

ఎందరెందరిని ఆదుకొన్నావో ఇందిరా రమణా

నీవు దప్ప దిక్కులేదు మాకిక కరుణాభరణా

 https://youtu.be/PIltmxNe4kc


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:రేవతి


నాకెందుకో చెప్పరాని అసహనం

నాలో నేనే నిరంతరం దహనం

ఎప్పుడూ ఏదో తెలియని వెలితి

అకారణంగా సతమతమౌతూ నామతి


1.నిరంకుశ ధోరణే నా నైజం

నియంతృత్వ పాలనే నాతత్వం

ఉత్తపుణ్యానికి గుత్తాధిపత్యం

మితిమీరిన చనువుతో సాన్నిత్యం


2.రక్తపోటు పెట్రేగుతు రసాభాసగా

తలపోటు పెరగుతుంటె ఓ రభసగా

గుండెపోటు వచ్చేలా ఉధృత శ్వాసగా

ఆటుపోటు జీవితాన పరధ్యాసగా

Tuesday, March 21, 2023

 https://youtu.be/o-zz2IccnEw


*శుభోదయం*


*శోభకృతు నామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం: కళ్యాణ వసంతం


రవినై మీవాకిటి తొలిపొద్దుగా అడుగెడుతా/

కవినై నాగీతితో మీ ఎద తలుపు తడుతా/

ఈ శోభకృతు ఉగాది శుభవేళ షడ్రుచుల కవితను పంచిపెడతా/

ఈ శుభోదయ నవ రస మయ సమయానా మీగుండెలో జేగంటకొడతా/


1.తెలుగులంత ఒకటని చాటే ఉగాది పండుగ నా మది/

రెండు రాష్ట్రాలు సందడిగా చేసుకొనే  సంబరాలకిది నాంది/

మూడు కాలాలు పాడి పంటలతో నిండాలి ప్రతి ఇంటి గాది/

నాలుగు దిక్కులా చెలఁగాలి  తెలుగు ప్రజల ప్రజ్ఞా ప్రఖ్యాతి


2.పంచాంగ శ్రవణంతో కలగాలి అందరికి సుఖము శాంతి/

ఆరురుచులను ఆరగించి పొందాలి విందుభోజన తృప్తి/

ఏడు వ్యసనాలు విడనాడగా జనావళికి ఆరోగ్య సంప్రాప్తి/

ఆష్టవిధ ఐశ్వర్యాలతోబాటు వికసించాలి మానవత్వ వ్యాప్తి/



https://youtu.be/1HY-fLc2sk4


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:కీరవాణి


అడవి గాచిన వెన్నెలా  నా గేయ రచన

అరణ్యరోదన కోయిలా నీ గాన నివేదన


1.సభికులే కొరవడి  సరసతే వెనకబడి

సందడే లేక మొక్కుబడిగ నేడీ సమారాధన


2.పదగుంఫన మూలబడి భావుకత కాలబడి

సాహితీ సౌరభమే చచ్చీ చెడీ సాగే ప్రదర్శన


3.గొంతు కాస్త పిడచబడి శ్రుతీలయా పలచబడి

గాత్రధారణ యధేచ్ఛగా మలచబడే గర్భవేదన


4.భావరాగతాళాలు రాఖీ నీపాటకైతె పొసగబడి

ఎద ఎదలో  అలజడి రేపబడితేనే తేనె ఆస్వాదన



 https://youtu.be/apkIYpGZ1tM


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


నిదురోయిన మధురోహల జాగృత పరచకు

పదపడి నా స్తబ్దుమదికి అతురతను పెంచకు


1.శతమర్కట సమమైనది అతివన వాసన

వాలము కటిఒంపు కరవాలముతో ఖండించకు


2.వయసులో వరాహమూ సుందరమను నానుడి

సొగసుకత్తెవాయె మరి నారీ వలపు తూపులిక దించకు


3.మగువ ఎదురు పడితేనే మధిరానది తీరమది

వాలుచూపులే విసరుతూ కైపుసుడిలొ ముంచకు


4.ఎటు కొరుకూ చెఱకుగడను గ్రోలు తీపి మారదు

సోకులార బోసి మరీ దీక్ష భగ్నమొందించకు


5.చరితలందు చదివితివే వనితల వంచన రీతులు

మూణ్ణాళ్ళ మురిపెం రాఖీ ముగ్ధానను విశ్వసించకు

Monday, March 20, 2023

 https://youtu.be/_vY1icBGVZg


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:పహాడీ


సోమలింగా భీమలింగా

రామలింగా రాజలింగా

నిన్ను మేము చూడంగా నువు దయజూడంగా 

దండాలు దండాలు మా గండాలు బాపంగా



1.కోడెనుచేపట్టి నీ గుడి చుట్టుచుట్టి

ఘోరీని దాటేసి వాకిటి మట్టుకు కట్టి

గంటగొట్టి గణపతి కాళ్ళకు పబ్బతిబట్టి

నీ ముంగట సాగిల పడితిమి వల్లు బట్టి


2. బసుమ లింగా బసవలింగా

శంభులింగా శక్తిలింగా శివలింగా

నాగలింగా నమ్మాము నిన్నే భోగలింగా

మన్నన సేయి మరగతలింగా సైకతలింగా

 https://youtu.be/rZ1Hzn6vsOU


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:శుద్ధ సీమంతిని


నా ప్రియ రాధా మధురమే మన గాధా

ఆ సాంతం చిలికించేనూ అమర సుధ

పులకించేను బృందావని పొద పొద ఈ వసుధ


1.నీ ఊహయే తీయని బాధ

  నీ విరహామే తీరని ఓవ్యధ

తలపుకొస్తే నీ సొగసుల సంపద

తనువంతా  పెంచదా తహతహ


2.యమునకు మనపై ఎంతటి దుగ్ధ

మన ప్రణయం కనగా ఇంచుక సందిగ్ధ

ఎడబాటుతో వేగలేకా తానొక విప్రలబ్ధ

మురళి రవళికి మురిసి నీలా మంత్రముగ్ధ


3.మననావ విహరించ కదలదు రయమున

అలలతొ డోలాల నూగించు ప్రియమున

మరులను రేపు మరిమరి నా కాయమున

సాయం సమయమున సరస మయమున

 https://youtu.be/LZLB4axmkS4


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


మెదడును తొలవకు కుమ్మరి పురుగులా

ఎదపై పారకు జాణా గొంగళి పురుగులా


1.అంచెలంచెలుగా నను వంచెనతో ముంచకు

 ఈగగ ఎంచి కసిగా చంపకు  సాలె పురుగులా


2.జ్యోతిగా మాయలొ ముంచేసి ఆకర్షణ పెంచకు

జ్వాలగా నను కాల్చకు  దీపపు పురుగులా


3.తరచి తరచి శోధించి గుట్టంతా దోచకు

 బ్రతుకు బట్టబయలు చేసి పుస్తకపురుగులా


4.కాలాన్నీ ధనాన్నీ ఆసాంతం భుజించకు

వదలక నశింపజేయుచు చెదలు పురుగులా


5. ముసుగు మాటు నటనను ప్రేమగా భ్రమించకు

రాఖీ నంగనాచి తీరెపుడూ మిణుగురు పురుగులా

Friday, March 17, 2023

 https://youtu.be/tL13Ngltav4


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:వసంత



గోవిందా గొను పాదాభివందనం

సప్తగిరీశా  సాష్టాంగ వందనం

శ్రీ హృదయేశా హృదయాభివందనం

శ్రీ వేంకటేశా సర్వస్య శరణాగతి వందనం


1.నిండుగ మదిలో నిన్నే నిలిపితి

నిత్యము స్వామి దీక్షగ కొలిచితి

అగత్యమే దయగను నను  త్వరితగతి

అర్పించెద నిదె ప్రభూ ఆర్తిగ సుకృతి


2.విన్నపాల నాలకించ ఒగ్గవయ్య నీ చెవి

చిరునవ్వు పూయనీయి స్థిరముగ నా మోవి

పరవశింప జేయనీ సదా నీమేని కస్తూరితావి

కనికరించుదాకా కరివరదా తప్పదు నీకీ పల్లవి

 https://youtu.be/XhNPphlc-ng


*శోభకృత నామ ఉగాది-2023 శుభాకాంక్షలు*…!!


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:దేశ్


సవరించవే గొంతు ఓ కోయిలా /

శోభకృతు ఉగాది అరుదెంచిన వేళా/

లేమావి కిసలాలు మేసీ మత్తిలుదువేలా/

పాటందుకో పాటవాన చెవులకు చవులూరేలా


1ఆలపించవే ఎలుగెత్తి తేనెలొలికేలా నాలా ఇలా/

అలరారు అలరుల అలరు ఆమని అలరించేలా/

ప్రకృతి యావత్తు నీ కృతికి ప్రీతిగా పులకించేలా/

చైత్ర పున్నమి రేయిలా చెలి చెలిమిలోని హాయిలా/


2.ఆరు ఋతువులూ నీ మధుర గానాల తేలించు/

ఆరు రుచులనూ ఆలాపనలో సుధగా మేళవించు/

పంచమ స్వరమే నీ సుస్వనమున స్వతహా జనించు/

సరిగమదని స్వరషట్కముతో ఆహ్లాద గీతుల పంచు/

 https://youtu.be/98-aKZ-E-5w


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:బృందావన సారంగ


శృంగేరి పీఠ సంశోభితే

వేములవాడ సంస్థితే

శంకర మఠ విరాజితే

సర్వ జన హితే  సమ్మోహితే

శారదే దేవీ నమోస్తుతే


1.నమిలికొండ కోటయార్య వరిష్ఠ

ఘనపాటీ హస్త సుప్రతిష్ఠితే

నిగూఢ పరమార్థ సౌఖ్యవరదే

నిత్య విప్ర నిరతాన్నదాన భాసితే


2.సామగాన ప్రియే సరసిజాననే

శుక కలశ పుస్తక కర భూషణే

చిన్ముద్రధారిణే చిదానంద రూపిణే

చంచలచిత్త నియంత్రిత భవతారిణే

Thursday, March 16, 2023

 https://youtu.be/98-aKZ-E-5w


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:బృందావన సారంగ


శృంగేరి పీఠ సంశోభితే

వేములవాడ సంస్థితే

శంకర మఠ విరాజితే

సర్వ జన హితే  సమ్మోహితే

శారదే దేవీ నమోస్తుతే


1.నమిలికొండ కోటయార్య వరిష్ఠ

ఘనపాటీ హస్త సుప్రతిష్ఠితే

నిగూఢ పరమార్థ సౌఖ్యవరదే

నిత్య విప్ర నిరతాన్నదాన భాసితే


2.సామగాన ప్రియే సరసిజాననే

శుక కలశ పుస్తక కర భూషణే

చిన్ముద్రధారిణే చిదానంద రూపిణే

చంచలచిత్త నియంత్రిత భవతారిణే

 https://youtu.be/pD4OTYrSTwU


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హిందోళం


మహాకాయం మహాదేవ సూనమ్

లంబోదరం జగదంబా సుతమ్

వక్రతుండమ్ వల్లినాథాగ్రజమ్

వందే  ఏకదంతం తం సతతం శరణాగతమ్


1.ప్రణవ స్వరూపమ్ ప్రమథగణాధిపమ్

 ప్రసన్న వదనమ్ ప్రపన్న వరదమ్

ప్రకీర్తి ప్రదాయకమ్ ప్రమోద కారకమ్

 ప్రథమపూజితమ్  ప్రభో ప్రణమామ్యహమ్


2.విఘ్నేశ్వరమ్ విమలచిత్త వాసమ్

విబుధవినుతమ్ విశేష వికట వేషమ్

విశ్వైక విశారదమ్ వరసిద్దిబుద్ధిప్రాణేశమ్

వినాయకం విషాణిలపనం నమామి సంకటనాశమ్

Tuesday, March 14, 2023

 https://youtu.be/KonRLoHUYwI


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:భైరవి


మంచు గుండె నీదన్నా -కొండగట్టు అంజన్నా

మా గోడువినుమన్నా -మామంచి హనుమన్నా

దిక్కుమొక్కులేకున్నాము-మాకు దిక్కు నీవన్నాము

చల్లగ మముజూడు మా తోకదేవుడా

నమ్ముకొని వస్తిమి నీవె మాకు తోడునీడా


1.చిక్కని పాలతో నిన్నుతాన మాడిస్తిమి

జిగేల్మనే చందనాన్ని నీ ఒంటికి పూస్తిమి

జిల్లేడు దండలూ నీ మెళ్ళో వేస్తిమి

గానుగ నూనెతో గండదీపం బెడితిమి

చల్లగ మముజూడు మా తోకదేవుడా

నమ్ముకొని వస్తిమి నీవె మాకు తోడునీడా


2.కళ్ళింత జేసుకొని తుర్తిగ నిను జూస్తిమి

అరటిపళ్ళు నీకు ఆరగింపు జేస్తిమి

కొబ్బరిబెల్లాల ఫలారాన్ని పంచితిమి

పోర్లుడు దండాలునీ గుడిచుట్టూ బెడితిమి

చల్లగ మముజూడు మా తోకదేవుడా

నమ్ముకొని వస్తిమి నీవె మాకు తోడునీడా

Monday, March 13, 2023

 


https://youtu.be/WvxGYSwvO-c

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:సారమతి

సింగార నరసింగరాయా
అనంగజనకా రసికశేఖరాయా
చెంచులక్ష్మి పై మనసుపడి
మనువాడిన ధర్మపురి నరహరిరాయా
ఆనందకరమౌఈ శుభ తరుణానా
కనికరించు మము కరుణాభరణా

1.సిరితో ఏకాంత సేవకు వేళాయే
శ్రీకాంత నీ కిది పరవశ సమయమాయే
విరిమాలలతో అలరించిన నీ సుందర రూపం
కనినంత అనంతా మా జన్మ కడుపావనం

2.వివిధ విధులతో విధిగా నిను వినోదింతుము
వైదిక మంత్రాల సంగీత గానాల నర్తింతుము
సప్త పరిక్రమల పరిపరి రీతుల సేవింతుము
పవళింపుసేవతొ స్వామీ నిను ఆరాధింతుము

 

https://youtu.be/cyM4IjpLCnw

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

జైత్రయాత్రకు  బయలు దేరిరి ధర్మపురి మీ మిత్రత్రయము
నరహరి హర వేంకటేశ్వర స్వాములకు జయము
శిష్టరక్షణ దుష్టశిక్షణమీకు సర్వదా ప్రథమ ధ్యేయము
దనుజ సంహారమొనరించి కూర్తురు లోక కళ్యాణము

1.వైరులకు వెన్నుజూపని క్షత్రియత్వము నీదినరసింహా
చతురతను జూపి నెగ్గగలిగిన గుప్తభావన నీది శ్రీనివాసా
3.అరివీర భయంకరుడవు త్రిపురహరుడవు నీవు శివశంకరా
విజయోత్సవము  దివ్యమగు మీ రథ ఉత్సవము
ధర్మపురీశా ఈశా శ్రీవేంకటేశా

2.వీర తిలకము దిద్ది సమరానికంపిరి మీ వీరపత్నులు
హారతులు వెలిగించి స్వాగతించిరి  మిమ్ము మా ఊరి భక్తులు
కనుల పండుగ మాకు కలలు పండగ బ్రతుకు అభయమిచ్చును మీ దయాదృక్కులు
తొలగిపోవును మిమ్ము నమ్మి వేడితిమేమి విడరాని మా చిక్కులు

 


https://youtu.be/e__rTLxAcPI

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:లలిత

రాజేశ్వరా నటరాజేశ్వరా
రాజరాజేశ్వరా రాజేశ్వరీ వరా
రారా నన్నేలరా రాజశేఖరా
కైలాస శిఖరాలు కడచిరారా
కైవల్యమార్గాన నను నడపగరా
నందీవాహనమెక్కి వందీమాగధులగూడి
భృంగిశృంగి ఆదిగా సేవక జనములతోడి

1.క్రిమి కీటకాలకు పశుపక్ష్యాదులకు
దారిచూపినావు శివా మోక్షలోకాలకు
అజ్ఞాన భక్తులకు చోరశిఖమణులకు
అనుగ్రహించి చేర్చావు  అక్షరములకు
ఉత్కృష్టమే కదా నరజన్మ ఉద్ధరించరా
అదృష్టములేదా ఈజన్మకు అవధరించరా

2.దమనచిత్త దానవులను దయజూశావు
   భిల్లుడైన తిన్నడినీ నీ అక్కున జేర్చావు
బాలకులను సైతం బిరాన కాచావు
కిరాతావతారమెత్తి కిరీటినింక బ్రోచావు

నిరతము నీ ధ్యాన మగ్నుడనే కదా శంకరా
కనికరమున ననుగాంచగ నాకేదిక వంకరా

 


https://youtu.be/ygMeKTfZiIo

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:రీతిగౌళ

శాంకరీ శాంభవీ శివాని
భగవతి బార్గవీ భవాని
నతించెద ప్రీతిగా నుతించెద
మతిలో సతతము జపించెద

పరాశక్తి నను పరాకుసేయకు
పరమానందమే వరమీయి నాకు

1.శ్రుతియు స్మృతియు ద్యుతియునీవే
చరాచర గోచరము నీవే అగోచరమునీవే
విశ్వవ్యాపిని విమల హృదయిని
జ్ఞానదాయిని మోక్ష ప్రదాయిని

పరాశక్తి నను పరాకుసేయకు
పరమానందమే వరమీయి నాకు

2.దైహికవాసన దహింపజేయవే
ఐహిక వాంఛల నిక త్రుంచవే
చండ ముండ శమని చాముండేశ్వరి
వైష్ణవి వారాహి అఖిలాండేశ్వరి

పరాశక్తి నను పరాకుసేయకు
పరమానందమే వరమీయి నాకు

 


https://youtu.be/AxmiDRW7JNg

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:భీంపలాస్

వీనులవిందాయే గోవిందా
నీ గానమె మందాయే భవరుగ్మత బాపంగ
పాడినవారి గళము పావనగంగ
భక్తుల హృదయమే ఉప్పొంగే సంద్రంగా

1.పలికించిరి హరిపద మకరందము
ఒలికించిరి సంకీర్తనామృతము
చిలికించిరి ఆరాధన నవనీతము
ఆస్వాదించిరి ఇహపర సౌఖ్యము

2.భక్తిభావ సుధకై  కవనం మధించిరి
సంగీతమె జీవితమని సదా భావించిరి
నీ మహిమల నభినుతించి అనుభూతించిరి
కృతులనెన్నొ లిఖించి నిరతమాలపించిరి

 

https://youtu.be/sWjmN8wBE2U

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:నాగ గాంధారి

సరసిజ నాభా సిరివల్లభా
శ్రీ శ్రీనివాసా శ్రితజనపోషా
సరసహృదయ దయామయా
నిను కీర్తించి తరించె అన్నమయా
కరుణను నను చేగొనవయా
తాత్సారమేలనయా తిరుమలనిలయా

1.కాంచనమణి మకుటము-తిరునామ లలాటము
  కాంచగ కౌతుకము నీ కౌముది సమ హాసము
  తడబడచుంటిని స్వామి పొగడగ కాదునాతరము
నిను చూడనీ కడతేరగా నీ కడనే నిరంతరము

కౌస్తుభ వక్షాంకితము వైజయంతిమాలాలంకృతము
కర యుగళ భూషణము శంఖ చక్ర విరాజితము
పద్మ హస్త శోభితము కౌమోదకి ఆయుధ సహితము
కౌశికాయుధమే కమలలోచనా నీ నఖశిఖపర్యంతము

@every one

Thursday, March 9, 2023

 

https://youtu.be/tPio3DBPMkA?si=JJQ_663rG4v_540N

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


బుక్కా గులాల ధూళి నింగీ నేలా నిండగా

లక్ష్మీ నరసయ్యా నీ జాతరా కనుల పండగ

కళ్యాణమాడి సిరితోగూడి కోనేట్లో తిరుగాడగా

నడి మండపాన డోలాలనూగి కరుణతో చూడగా


గోవిందా గోవిందా దరంపురి నరసింగా

కోటిదండాలు నీకు మము గండాల కాయంగా


1.హంసనావ మీద కొలనంతా కలయదిరుగా

దూరతీర భక్తులకు నీ ప్రేమమీర చేరువకాగా

చుట్టుచుట్టుకూ  గోవిందఘోష మిన్నుముట్టగా

చూసి మురియు భక్తజనుల జన్మధన్యమవగా


గోవిందా గోవిందా దరంపురి నరసింగా

కోటిదండాలు నీకు మము గండాల కాయంగా


2.విప్రవర్యులంతా వేద పారాయణ చేయగా

సేదదీరు మండపాన ఊయలనూగగా

యోగ ఉగ్రనారసిమ్మ వేంకటేశ మమ్మూర్తులుగ కొలువవగా

దీనుల విన్నపాలు గొని మూడునాళ్ళూ వరమీయగా


గోవిందా గోవిందా దరంపురి నరసింగా

కోటిదండాలు నీకు మము గండాల కాయంగా

Wednesday, March 8, 2023

 https://youtu.be/CyTcqVJriNQ


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:ధర్మవతి


ప్రదర్శించు సాయి నీ-అపూర్వ మహిమని

ప్రకటించు నా వెతతీర్చి బాబా నీ లీలని

ఋజువులేక నమ్మలేను నీ ఉనికిని

చెబితే పొందలేను నీవున్న అనుభూతిని

భవభూతినికాను నేను ఆషాఢభూతిని

దివ్యానుభవమెరుగనైతి నే మూఢమతిని


1.వేవేలమందిరాలు నీకుంటేనేమి

కోట్లాది వ్యక్తులు నిను కొలుచుకుంటె మాత్రమేమి

ఊరూరా నీభజనలు మారుమ్రోగినా సరే

ఎవరెంత చెప్పినా నాదిమనసొప్పని తీరే

భవభూతినికాను నేను ఆషాఢభూతిని

దివ్యానుభవమెరుగనైతి నే మూఢమతిని


2.దృష్టాంతరాలెన్ని గ్రంథస్తమైతెనేమి

కష్టాలు తీరిపోయి ఎందరో గట్టెక్కినా గాని

త్రికరణశుద్ధిగా నిను విశ్వసించు వారున్నా సరే

నా సంగతి వచ్చు సరికి సాయి మారదాయె నీతీరే

భవభూతినికాను నేను ఆషాఢభూతిని

దివ్యానుభవమెరుగనైతి నే మూఢమతిని

Monday, March 6, 2023

 https://youtu.be/6Kd738FTCv8


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:షణ్ముఖ ప్రియ


మంగళాకార సర్వ మంగళ కరా

మంగళ గ్రహదోష నివారా శ్రీకరా

మంగళవార విశిష్ట ఆరాధనాప్రియా

నమోస్తు నరహరే హిరణ్యకశిపు శమనాయా


1.గోదావరి నదీతీర విరాజమానాయా

ధర్మపురీ అగ్రహార నిజ సంస్థితాయా

సత్యవతి సర్పపతి శాప విమోచనాయా

సర్వదేవ నిత్యార్చితా నిరంజనాయా


1.సృష్టికర్తా సమవర్తీ నిరత సేవితాయా

శ్రీలక్ష్మీ సహిత మహాహిమాన్వితాయా

శ్రీరామలింగేశు అనుంగు స్నేహితాయా

ప్రహ్లాద శేషాచలదాసాది భక్త హితాయా

 https://youtu.be/hpRSxit-c44


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఉన్నటట్టుంటం ఊడిపోతం

పన్నట్టుంటం పైకిపోతం

అరెరే గట్లెట్లాయే అంటడొకడు

నిన్నమంచిగుండె గాదె అంటూ ఒకడు

నిమిషాలు పట్డవాయే పానాలుపోవడానికి

కడసూపేదొ తెల్వదాయే పోయినంతసేపుకి


1.గట్లుండె మంచోడు అంటడొకడు

మంచంబట్టి జీవునం బాయె అంటడొకడు

మస్తుసంపాయిచె నంటడొకడు

ఉన్నదంత ఊడ్చిండు అంటడొకడు

ఉత్తసేతుల్తోటె గాదె ఎంతకూడ బెట్టినా

పిట్టకూడు తినుడెగాదె ఎంతదోచి మెక్కినా


2.ఆనికేం మారాజు సచ్చి బత్కెనంటరు

బతికుండి బావుకున్నదేంటొ నంటుంటుంటరు

పెండ్లంకైతె అన్నాలం జేసిపోయెనంటరు

పుల్లెందలు పోరగాండ్లు ఈనమాయిరంటరు

ఒంటిగానె అస్తింగద యాడికెల్లో ఈడికే

అందరంబోయేదా బొందలగడ్డ కాడికే

 https://youtu.be/z_CeUj6v6fg


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:తోడి


హిమనగవాసినం పన్నగభూషణమ్

సుమధన్వు దహినం లలాటలోచనమ్

లింగమూర్తినం గంగాధరం పింగేక్షణమ్

భావయామి భవానీశంకరమ్ అనుక్షణమ్


1.గణేశ పూజితం గజాసుర సేవితమ్

శ్వేతాంగవిరాజితం పురాసురపరాజితమ్

నందిభృంగి సన్నుతం నారద వినుతమ్

నమామ్యహం నటరాజమ్  సంతతమ్


2.షణ్ముఖు జనకం ప్రభో పంచాననమ్

చతుర్ముఖు వందితమ్ త్రినయనమ్

ద్విజ నిజసంకీర్తితమ్ వృషభధ్వజమ్

శరణమహం వందే శంభుం శివమేకమ్

 https://youtu.be/6QB4PqCIafg


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


(జావళి)


సరసాలు చాలించరా

సరగున నను పరిపాలించరా

మదనగోపాలా కదనకుతూహలా

హృదయము నీదే అదనిదికాదు నన్నేలా

(అదను ఇది కాదు)


1.పదపడి నా మదిలో చొరబడి

రేపకు నాలో రమయతి అలజడి

కలవరముననే తలపుల కలబడి

చేర నెంచితినిక వెచ్చని నీ ఒడి


2.కొంటెవాడ నా జంటను కోరగ

తుంటరి తనమేల నా కడకొంగు లాగ

కలలపంటనే కృష్ణా నీ జతగూడగ

మునిమాపు కానీర నా మంటనార్పగ

Saturday, March 4, 2023

 

https://youtu.be/1TaWSD451LY?si=JlGEKApo_Dm6dgHw

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మధ్యమావతి


భం భం భోలేనాథా-శంభో విశ్వనాథా

నమో నమో నాగనాథా పశుపతినాథా

చిందెయ్యరా గంగాధరా గౌరీనాథా 

వందనాలురా నందివాహనా చంద్రశేఖరా


1.భస్మధారీ త్రిపురారి చర్మాంబరధారీ

కామారీ జడదారీ కపాలమాలా ధారీ

కేదారి ఖట్వాంగధరీ ఖండపరశుధారీ

వందనాలురా నందివాహనా భృంగీశ్వరా


2.త్రయంబకా  దూర్జటీ దిగంబరా

నృత్యప్రియా శరణ్యా మృత్యంజయా

నీలకంధరా నిటలాక్షుడా విరూపాక్షుడా

వందనాలురా నందివాహనా సుందరేశ్వరా

 

https://youtu.be/StQkNTuKZPo

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:చంద్రకౌఁస్

ఏడుకొండల వాడా - నాడూ నేడూ ఏనాడూ
ఉండడు నీకు స్వామీ - నా వంటి భక్తుడు
వేడియుండడు చేయమని- నిను కీడు
నశింపజేసైనా  ప్రభో  -నను  కాపాడు

1.అంతరింపజేయి -నా లోని అహమును
రూపుమాపవయ్యా -నాకున్న మోహమును
తెగటార్చవయ్యా - నా లోపమైన లోభమును
పరిమార్చవయ్యా ప్రభో -ఈర్ష్యా -ద్వేషమును

2.తొలగించు నాకున్న -దేహ  వాసనను
మసిచేయి అప్రియమౌ -నా గాత్ర కర్కశను
కట్టడిసేయవయ్యా- నా తొందరపాటును
కడతేర్చవయ్యా స్వామీ- నా జీవయాత్రను

 

https://youtu.be/AstIBaUQXFI

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

నా తీరని తీయని కలవో
నా లోన దాగిన కవన కళవో
పదహారు కళలొలికే తెలుగుపడుచువో
ఊహలకే పరిమితమై కల్పనకే పరిచితవై
నిజముగ జగమున కలవో లేవో

1.ఉత్సాహం నాలోనింపే ఉత్పలమాలవో
ఇంపగు వన్నెలుకలిగిన చంపకమాలవో
నవనవలాడే నాగమల్లివో
మిసమిసలాడే మరుమల్లివో

2.మరులే రేపే మదనకుతూహలానివో
మమతలు కురిసే అమృతవర్షిణివో
జాగృతపరచే భూపాలానివో
ఆత్రుత పెంచే హిందోళానివో

 

https://youtu.be/2N6l5MTU9Xc

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:సిందుభైరవి

తేలిపోతాయి గాలివాటుకే నీలిమేఘాలు
కూలిపోతాయ చిన్నమాటకే గాలి స్నేహాలు
ఒకతావు నుండి మరో రేవుకు ఏటవాలుగా
చేయూత కోరుతూ చేతుల్నిమార్చుతూ తమవీలుగా

1.వాటంకొద్ది వైష్ణవాలే స్నేహబంధాలు
నవ్వుఅత్తరు పూసుకున్న దుర్గంధాలు
మనసుపై ముసుగేసుకున్న ఉత్తుత్తి నేస్తాలు
పబ్బం గడుపుకోవడానికే పత్తిత్తు వేషాలు

2.ఇచ్చిపుచ్చుకుంటుంటే వ్యాపారాలు
లెక్కపక్కాచూసుకుంటే వ్యవహారాలు
ఇంతోటి దానికి మైత్రీగా నాటకాలు
ఆత్మీయబంధాలిపుడు గగనకుసుమాలు

 

https://youtu.be/ak7N_tAwc9A?si=vmPGi1MvQc6FRH0Z

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


శ్రీ లక్ష్మీ నరసింహ దివ్య కళ్యాణం

ఎల్లలోకాలకు మంగళ ప్రదాయకం

బ్రహ్మోత్సవ శుభవేళ భవతారకం 

కనినజనులకందరికీ జన్మ పావనం


1.ముక్కోటి దేవతలూ కాంచే కలయిది

బ్రహ్మాది సురముఖ్యులు ఏతెంచునది

వేద మంత్రాలఘోష నినదించు తరుణమిది

ఆనందం జగమంతా ఆవరించు ఉత్సవమిది


2. బాసికాలు సింగారించి నరహరి

సిగ్గులొలుకు చిరునగవులతో సిరి

శేషప్ప మండపాన వధూవరులైరి

శుభ పరిణయ విభవానికి ఇలలో ఏదిసరి

*తిలకించి పులకించే అలవైకుంఠమే ధర్మపురి*




 https://youtu.be/zqRYGaUTj9A


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:చంద్రిక


జయజయ నారసింహ 

జయము జయము జయము

మమత మీర మము చేకొను

నీకిదే మంగళము 

జయమంగళము శుభమంగళము


1. నర మృగరూపుడవు

 ప్రహ్లాద వరదుడవు

హిరణ్యకశిపుని దునిమినవాడవు

ధర ధర్మపురిలో వెలసిన దేవుడవు


2.ఉగ్ర యోగ మూర్తివి

భక్త ప్రపన్నార్తివి

దంష్ట్రనఖాయుధ ధరకీర్తివి

దుష్ట శిక్షణా స్ఫూర్తివి

 https://youtu.be/rmm2W7LSgjU


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


తావీజిస్తావో -మూలికాతైలం పూస్తావో

విభూదిస్తావో -మనా…దికేదైన బోధి స్తావో

మంత్రంవేస్తావో -రోగంపోయె గారడిచేస్తావో

అక్కునజేరు స్తావో -మా తిక్కలు కుదురు స్తావో

ధైర్యం కలిగించు సాయి- మాలో దెయ్యం వదిలించుసాయి

లీలలేవైన చేయి -మాకు మైమజూపి  కూర్చుహాయి


1.ఉప్పుదింటె ఊష్ణము పప్పుదింటె పైత్యము

మనసుపడి మిఠాయి తింటే మధుమేహము

పులుపుతో వాతము కారమైతె అజీర్ణము

ఏది తినబోయినా ఒంటికి పడని శాపము

ధైర్యంకలిగించు సాయి-మాకు పత్యం వదిలించుసాయి

లీలలేవైన చేయి -మాకు మైమజూపి  కూర్చుహాయి


2.ఆరోగ్యము మహాభాగ్య మన్నది అక్షర సత్యము

వ్యాయామం మాటమాకు కొరుకుడుపడని కృత్యము

వేళకు భోజనము రాతిరితొలి జాముకు శయనము

గగనకుసుమమే మాకు నియమ సమయ పాలనము

మాకళ్ళు తెరిపించు సాయి మనసును వికసింపజేయి

లీలలేవైనా చేయి - మాకు మైమజూపి కూర్చు హాయి

Wednesday, March 1, 2023

 

https://youtu.be/_3-oEKv5xng?si=Bkt9Quf40pwbbU7w

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


కుందనపు ఆకృతి అందాల మహతి - *we love u*

అందుకో నీ పుట్టిన రోజు బహుమతి- *we wish u*

అనురాగం ఆప్యాయత కలబోసినదీ గీతి- *just for u*

ఆనందపు ఉషస్సులు అమ్మానాన్నల ఆశీస్సులు-  *HAPPY birth day to you*- 

సంధ్యా రాజేశ్వరుల కలల పంటవు మహతీ *Wish u happy birthday to u*


1.పాతిక వత్సరాలు  నీతో మా జీవితాలు

ఎనలేని మరపురాని మధురమైన అనుభూతులు

నీ సహన శీలత నీ ఔదార్యత అనుపమానాలు

సాధించిన నీ ఘన విజయాలు నీదీక్షకు ప్రమాణాలు-

*HAPPY birthday to you*- సంధ్యా రాజేశ్వరుల కలల పంటవు మహతీ*Wish u happy birthday to u*


2.వసంతాలై నీ నవ్వులు విరియనీ చిరకాలం

సంతస కాంతులకవనీ నీ కనులు ఆలవాలం

చీకూ చింతా లేకా చిగురించనీ నీ భవితవ్యం

భగవంతుడు కురిపించనీ దీవెనలు నీపై నిత్యం-

*HAPPY birthday to you*- సంధ్యా రాజేశ్వరుల కలల పంటవు మహతీ *Wish u happy birthday to u*