Friday, March 17, 2023

 https://youtu.be/tL13Ngltav4


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:వసంత



గోవిందా గొను పాదాభివందనం

సప్తగిరీశా  సాష్టాంగ వందనం

శ్రీ హృదయేశా హృదయాభివందనం

శ్రీ వేంకటేశా సర్వస్య శరణాగతి వందనం


1.నిండుగ మదిలో నిన్నే నిలిపితి

నిత్యము స్వామి దీక్షగ కొలిచితి

అగత్యమే దయగను నను  త్వరితగతి

అర్పించెద నిదె ప్రభూ ఆర్తిగ సుకృతి


2.విన్నపాల నాలకించ ఒగ్గవయ్య నీ చెవి

చిరునవ్వు పూయనీయి స్థిరముగ నా మోవి

పరవశింప జేయనీ సదా నీమేని కస్తూరితావి

కనికరించుదాకా కరివరదా తప్పదు నీకీ పల్లవి

 https://youtu.be/XhNPphlc-ng


*శోభకృత నామ ఉగాది-2023 శుభాకాంక్షలు*…!!


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:దేశ్


సవరించవే గొంతు ఓ కోయిలా /

శోభకృతు ఉగాది అరుదెంచిన వేళా/

లేమావి కిసలాలు మేసీ మత్తిలుదువేలా/

పాటందుకో పాటవాన చెవులకు చవులూరేలా


1ఆలపించవే ఎలుగెత్తి తేనెలొలికేలా నాలా ఇలా/

అలరారు అలరుల అలరు ఆమని అలరించేలా/

ప్రకృతి యావత్తు నీ కృతికి ప్రీతిగా పులకించేలా/

చైత్ర పున్నమి రేయిలా చెలి చెలిమిలోని హాయిలా/


2.ఆరు ఋతువులూ నీ మధుర గానాల తేలించు/

ఆరు రుచులనూ ఆలాపనలో సుధగా మేళవించు/

పంచమ స్వరమే నీ సుస్వనమున స్వతహా జనించు/

సరిగమదని స్వరషట్కముతో ఆహ్లాద గీతుల పంచు/

 https://youtu.be/98-aKZ-E-5w


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:బృందావన సారంగ


శృంగేరి పీఠ సంశోభితే

వేములవాడ సంస్థితే

శంకర మఠ విరాజితే

సర్వ జన హితే  సమ్మోహితే

శారదే దేవీ నమోస్తుతే


1.నమిలికొండ కోటయార్య వరిష్ఠ

ఘనపాటీ హస్త సుప్రతిష్ఠితే

నిగూఢ పరమార్థ సౌఖ్యవరదే

నిత్య విప్ర నిరతాన్నదాన భాసితే


2.సామగాన ప్రియే సరసిజాననే

శుక కలశ పుస్తక కర భూషణే

చిన్ముద్రధారిణే చిదానంద రూపిణే

చంచలచిత్త నియంత్రిత భవతారిణే