Saturday, May 30, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పిచికారీ చేయొద్దే మత్తునలా
రుచికోరి కొఱకొద్దే పెదవులలా
ఎన్నెన్ని బాణాలో నీ అమ్ములపొదిలో
ఎన్ని దించుతావే నా మెత్తని హృదిలో
దుంపతెంచకే జాణా సిగలొ పూలు దట్టించి
పుట్టిముంచకే పరువానా సెగలెన్నో పుట్టించి

1.నినుచూసి పడిపోని ప్రవరాఖ్యుడె కనరాడు
నీసొగసుకు దాసుడుకానీ భీష్ముడే ఇల లేడు
విఘ్నమే కలిగిస్తావు తపశ్చర్య ఎందరికో
భగ్నమేచేస్తావు బ్రహ్మచర్యమెందరిదో
నీ సఫలత ఎంతటిది చపలచిత్తమే నాదీ
పిచ్చుకై బ్రహ్మాస్త్రం తగదు తరుణీ నీకిదీ

2.రంభనిన్ను కన్నాకే గుంభనంగ ఉంటోంది
మేనకే పోటీపడలేక వెనకడుగు వేసింది
మెళకువలు నేర్చారు సుందరాంగులెందరో
కిటుకులే కనుగొన్నారు గ్రంథసాంగులెందరో
అంగనలే ఆశపడే అంగాంగ అందం నీది
గుండెజారకుంటుందా మామూలు పురుషులది