Sunday, September 27, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


దాసోహమంటుంది అందమే నీకు

పాదాక్రాంతమౌతుంది చందమే  నీకు

వయసన్నది ఒక   సంఖ్యనీకు ప్రమాణామై

ప్రాయనికి పరువమెపుడు విలోమమై

అభినయ రేఖా అభినవ శశిరేఖా 

నభూతో న భవిష్యతి మరో రేఖ


1.ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొని

అవమానాలే దిగమ్రింగుకొని

అవకాశాలందగ చేజార్చుకొని

నిన్ను నీవె అద్భుతంగ మలుచుకొని

చెక్కుచెదరలేదు నీసొగసిప్పటికి

ఉక్కువంటిదే నీ మనసెప్పటికీ


2.యోగాయే చేస్తావో అనునిత్యము

పాటిస్తావో ఏమో ఆహార పథ్యము

చెరిగిపోదు నీ నవ్వన్నది సత్యము

సాగదునీపై ఎవరి ఆధిపత్యము

వీడలేదు జతనీతో నాట్యమిప్పటికీ

తరగదు నీపై అభిమానమెప్పటికీ