https://youtu.be/VBC8x8eXs3U
తట్టి చూసాను నేను ఎందరి ఎదలనో
పట్టి పట్టి చూసాను ఎందరి వదనాలనో
సాయీ నీవంటే భక్తులకు ఎంతటి మైకం
సాయీ అనురక్తులకు నీవే ఏకైక లోకం
కలిగించవు నాకెందుకు అంతటి సౌభాగ్యం
సవరించగ సుతి తప్పిన నా సుతుని ఆరోగ్యం
1.సముచితమే నేను నిన్ను నిలదీయడం
సహజమే సాయి నాలోని ఈ భావావేశం
పక్షపాతమెందుకు ఏ కొందరి ఎడల
లక్ష్యపెట్ట వెందుకు నా విశ్వాసం సడల
కలిగించవు నాకెందుకు నీ అనుభవ సౌభాగ్యం
సవరించగ సుతి తప్పిన నా సుతుని ఆరోగ్యం
2.సహనానికి సైతం ఉంటుందొక అవధి
పరీక్షించడానికీ ఉండాలి ఒక వ్యవధి
మనసంతా నిండిపోతే బ్రతుకుపట్ల నైరాశ్యం
చోటుండదు నా గుండెలొ నీకై అవశ్యం
కలిగించవు నాకెందుకు నీ దర్శన సౌభాగ్యం
సవరించగ సుతి తప్పిన నా సుతుని ఆరోగ్యం