Friday, October 4, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

తిరుపతి శ్రీవేంకటపతి-నీవే మా శరణాగతి
అడుగడుగున కాపాడే-చక్రధారీ శ్రీపతి
హే భక్త వరదా ఆర్తత్రాణ బిరుదా
గోవిందా గోవిందా పాహిపాహి ముకుందా

1.నీ నామస్మరణయే ఆనందదాయకం
నీ గుణగానమే ఆహ్లాదకారకం
నీ దివ్య దర్శనమే భవతారకం
నీ పాద సన్నిధియే శోకనాశకం
హే భక్త వరదా ఆర్తత్రాణ బిరుదా
గోవిందా గోవిందా పాహిపాహి ముకుందా

2.ప్రతి పదమూ సాగాలి నిన్ను చేర్చే పథం
నా జీవన గమనమవని నీ అభిమతం
తెగిపోనీ ఇకనైనా ఇహలోక బంధం
ఆఘ్రాణించనీ నీ చరణారవింద గంధం
హే భక్త వరదా ఆర్తత్రాణ బిరుదా
గోవిందా గోవిందా పాహిపాహి ముకుందా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:తిలక్కామోద్

జ్వాల నేత్రీ కాళరాత్రీ కామితార్థ దాయినీ
దక్షపుత్రీ దానవ హంత్రీ సర్వదా సజ్జనమైత్రి
స్మరణమాత్రేన అభయ ప్రదాత్రీ పాహిమాం
కృష్ణవర్ణాంగినీ హరితవర్ణాంబరీ పాలయమాం

1.మధుకైటభ సంహారిణీ-శుంభనిశుంభ నిశ్శేషిణీ
అజ్ఞాన తిమిరాంతకి-మహా మాయావినీ
ఖర వాహినీ సురవందినీ-ఘనరూపిణీ జననీ
పాహిమాం పరవిద్యా పాలయమాం నిత్యా

2.రుద్రభామిని కామినీ  కామవర్ధినీ కౌమారి
కాలకాలినీ నాట్యకేళినీ  జగదేక సమ్మోహినీ
దురిత దూరినీ దుర్గుణ హారిణీ భవానీ మారీ
పాహిమాం పరమేశ్వరీ పాలయమాం కృపాకరీ