Sunday, August 15, 2021


పరునిగ తోచవు పరమశివా

నాకిహము పరము నీవే కావా

తండ్రివి నీవు నా తల్లి గౌరి

దండంబులు మీకివే మల్లారి మారి


1.గణపతీ దేవసేనాపతీ

అయ్యప్పా మా కగ్రజ భాతి

ఇందఱి మీ అండ నాకున్నది

ఈశ్వరా ఇక కలగదు వెఱపన్నది


2.బంధుమిత్రులే అంగబలం

అంతకుమించింది దైవబలం

దేవుళ్ళే ఆప్తులైన మనోబలం

సర్వకార్యసిద్ధికి ఆలవాలం