Saturday, September 4, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కమనీయ నీ మోము కననైతినే చెలీ

కరి మబ్బులు కమ్మెనా పున్నమి  జాబిలి

ఏల నామీద రాదికనూ ఇసుమంత జాలి

తలదన్నేవూ రాధికనూ అందంలో  నెచ్చెలి


1.తటిల్లతలా మెరిసి మటుమాయం

 తేరుకోలేక నేనేమో అయోమయం

 నీ ఊహకే కలుగుతోంది మదిలో విస్మయం

నీ ఊపిరే తాకితే బ్రతుకంతా రసమయం


2.మొగిలి రేకు తావిలా వెంటాడె నీ చూపు

మధువు గ్రోల తుమ్మెదలా నీ నవ్వెంత కైపు

రాజ్యాలు దారబోసినా లభించేనా నీ ప్రాపు

ప్రవరాఖ్యుడైతెనేమి నీ మాటకు తల ఊపు