Monday, March 20, 2023

 https://youtu.be/_vY1icBGVZg


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:పహాడీ


సోమలింగా భీమలింగా

రామలింగా రాజలింగా

నిన్ను మేము చూడంగా నువు దయజూడంగా 

దండాలు దండాలు మా గండాలు బాపంగా



1.కోడెనుచేపట్టి నీ గుడి చుట్టుచుట్టి

ఘోరీని దాటేసి వాకిటి మట్టుకు కట్టి

గంటగొట్టి గణపతి కాళ్ళకు పబ్బతిబట్టి

నీ ముంగట సాగిల పడితిమి వల్లు బట్టి


2. బసుమ లింగా బసవలింగా

శంభులింగా శక్తిలింగా శివలింగా

నాగలింగా నమ్మాము నిన్నే భోగలింగా

మన్నన సేయి మరగతలింగా సైకతలింగా

 https://youtu.be/rZ1Hzn6vsOU


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:శుద్ధ సీమంతిని


నా ప్రియ రాధా మధురమే మన గాధా

ఆ సాంతం చిలికించేనూ అమర సుధ

పులకించేను బృందావని పొద పొద ఈ వసుధ


1.నీ ఊహయే తీయని బాధ

  నీ విరహామే తీరని ఓవ్యధ

తలపుకొస్తే నీ సొగసుల సంపద

తనువంతా  పెంచదా తహతహ


2.యమునకు మనపై ఎంతటి దుగ్ధ

మన ప్రణయం కనగా ఇంచుక సందిగ్ధ

ఎడబాటుతో వేగలేకా తానొక విప్రలబ్ధ

మురళి రవళికి మురిసి నీలా మంత్రముగ్ధ


3.మననావ విహరించ కదలదు రయమున

అలలతొ డోలాల నూగించు ప్రియమున

మరులను రేపు మరిమరి నా కాయమున

సాయం సమయమున సరస మయమున

 https://youtu.be/LZLB4axmkS4


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


మెదడును తొలవకు కుమ్మరి పురుగులా

ఎదపై పారకు జాణా గొంగళి పురుగులా


1.అంచెలంచెలుగా నను వంచెనతో ముంచకు

 ఈగగ ఎంచి కసిగా చంపకు  సాలె పురుగులా


2.జ్యోతిగా మాయలొ ముంచేసి ఆకర్షణ పెంచకు

జ్వాలగా నను కాల్చకు  దీపపు పురుగులా


3.తరచి తరచి శోధించి గుట్టంతా దోచకు

 బ్రతుకు బట్టబయలు చేసి పుస్తకపురుగులా


4.కాలాన్నీ ధనాన్నీ ఆసాంతం భుజించకు

వదలక నశింపజేయుచు చెదలు పురుగులా


5. ముసుగు మాటు నటనను ప్రేమగా భ్రమించకు

రాఖీ నంగనాచి తీరెపుడూ మిణుగురు పురుగులా