Friday, October 2, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తపముచేతురు తాపసులు ఋషులు

ధ్యానించెదరు యోగులూ మునులు

జన్మలెన్ని ఎత్తవలెనో నిన్ను చేరుటకు

కర్మలే నశియింప జేయగ ముక్తిదొరుటకు

వేంకటేశ్వర ప్రసాదించు సూక్ష్మమందున మోక్షము

శ్రీనివాసా ప్రాప్తించదా- నీకు మనసైనదంటే మార్గము


1.శబరి ఎంగిలి పళ్ళకిస్తివి సాయజ్యము

జాడతెలిపిన పక్షికిస్తివి పరమపదము

పిడికెడటుకుల మైత్రికిస్తివి పరసౌఖ్యము

తులసిదళముకె వశుడవైతివి ఏమి భాగ్యము

వేంకటేశ్వర ప్రసాదించు సూక్ష్మమందున మోక్షము

శ్రీనివాసా ప్రాప్తించద  మనసైనదంటే మార్గము


2.గర్భమందే భక్తి నేర్పిన ప్రహ్లాద చరితము

మొరాలించి మకరిజంపి కరినిగాచిన వైనము

స్పర్శించి కుబ్జను కనికరించిన విభవము

విషముగ్రోలిన మీరాను ఆదరించిన తత్వము

వేంకటేశ్వర ప్రసాదించు సూక్ష్మమందున మోక్షము

శ్రీనివాసా ప్రాప్తించద  మనసైనదంటే మార్గము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పంచకళ్యాణి చెలీ నీ పరువం

అదుపుచేయు రౌతుకెంత గర్వం

కళ్ళెమైన లేకున్నది నీ తమకపు హయం

మచ్చికచేయుటలోనే మగతనం జయం


1.కొండలు కోనలైన ఎక్కేలా

వాగులు వంకలైన ఈదేలా

దుర్గమారణ్యాలూ దాటేలా

స్వారి చేయకావాలి నేర్పరితనం

సహకరించి తీరాలి మేలుజాతి అశ్వం


2.సప్తసముద్రాలపై ఎగురుతూ

దీవిలో మఱ్ఱిచెట్టు మరుగున దాగిన

మాంత్రికుడి ప్రాణప్రద రామ చిలుకను

సాధించి పెట్టేంత చేయాలి సాహసం

సహకరించి తీరాలి రెక్కలగుఱ్ఱం


PIANTING: Sri. Agacharya Artist